బిజినెస్

రూ. 2.52 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద 2.52 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. సెనె్సక్స్ 568 పాయింట్లు పుంజుకున్న క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 2.52 లక్షల కోట్ల రూపాయలు ఎగిసి 88,62,680 కోట్ల రూపాయలకు చేరింది. సెనె్సక్స్‌లోని 30 సంస్థల్లో టాటా స్టీల్, ఎల్‌అండ్‌టి, ఎస్‌బిఐ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా తదితర 27 సంస్థలు లాభాల్లో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునిలివర్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు నష్టాలను అందుకున్నాయి.