రాష్ట్రీయం

మూతబడ్డ బీడీ కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 15:బీడీ కట్టలపై రెట్టింపు సైజులో పుర్రె గుర్తు, క్యాన్సర్ బొమ్మలను ముద్రించాలన్న కేంద్ర నిర్ణయానికి నిరసనగా కంపెనీల యాజమాన్యాలు సోమవారం నుంచి సమ్మెకు దిగాయి. రాష్టమ్రంతటా బీడీ కంపెనీలు మూతపడటంతో లక్షలాది మంది కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బీడీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఈ ఆందోళనల తాకిడి తొలి రోజునే ఉవ్వెత్తున ఎగిసిపడింది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ మొదలుకుని అన్ని మండల కేంద్రాల్లో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు ర్యాలీలు, తహశీల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. మరోవైపు బీడీ యాజమాన్య సంఘం ప్రతినిధులు జిల్లా కేంద్రంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సమ్మెకు దారితీసిన పరిస్థితులు వివరించారు. ఆంక్షల తీవ్రత వల్ల పరిశ్రమలను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. బీడీ కట్టలపై 85శాతం మేర క్యాన్సర్, పుర్రెగుర్తు బొమ్మలు ముద్రిస్తే తమ కంపెనీల పేర్లు, ఇతర వివరాలను ఎక్కడ ముద్రించాలని ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల బీడీ పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడిందని యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హితేంద్రభాయి అన్నారు. తాము ముందస్తుగానే నోటీసులు అందించి సమ్మెకు దిగామని, 24వ తేదీ వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 117బీడీ కంపెనీలు ఒక్కసారిగా మూతబడడంతో వీటిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. రాష్ట్రంలోనే సుమారు 7లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. కొత్త ఆదేశాలను 2016 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్మికుల ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.