క్రీడాభూమి

మహిళల క్రికెట్ లంకపై భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్‌లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌ని భారత జట్టు 107 పరుగుల భారీ ఆధిక్యంతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మందన (55), హర్‌మన్‌ప్రీత్ కౌర్ (50) అర్ధ శతకాలతో రాణించారు. లంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధిని, శశికళ సిరివర్ధనే చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక 45.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ ప్రసాదిని వీరక్కొడి 69 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌విమెన్ వైఫలమైన కారణంగా లంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 22 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ చెరి రెండు వికెట్లు సాధించారు.