చెన్నైకు మా చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన అనేకమంది బాధితుల సహాయార్థం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఫిలిమ్ ఛాంబర్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తల్లిలాంటి చెన్నైకి ప్రస్తుతం కడగండ్లు మిగిలాయని, తమ జీవితాలే అక్కడ ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం చెన్నై పరిస్థితి చూస్తుంటే బాధగా వుందని, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను కొంతవరకైనా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమ తరఫున కొందరు హీరోలు స్పందించి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ఆనందంగా వుందని, ‘మా’ తరఫున కూడా 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా అందరూ స్పందించి సహాయం చేయాలని తాను కోరుకుంటున్నానని, పరిశ్రమ అంతా స్పందించి ఆపన్న హస్తం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, గతంలో కూడా అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు జోలెపట్టి ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారని, వారి పద్ధతిలోనే ప్రయాణిస్తున్నామని ఆయన అన్నారు. చెన్నై ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక మా తరఫునుండి ప్రత్యేకంగా చెన్నై ప్రజలను ఆదుకునేందుకు తమిళనాడు నడిగర్ సంఘంతో కలసి పనిచేస్తామని ఆయన తెలిపారు. 1986లో కూడా ఇలాంటి పెద్ద తుఫాను వచ్చినప్పుడు తాము కూడా అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పుడు చెన్నై తారలంతా కదిలి తమ వంతు భారీ విరాళాలను ప్రకటించారని, ఇప్పుడు చెన్నై ప్రజలను ఆదుకోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాధ్యత అని కార్యదర్శి శివాజీరాజా అన్నారు. కార్యక్రమంలో ఏడిద శ్రీరామ్, శశాంక్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మన మద్రాస్‌కోసం..
తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ తారలు నడుం బిగించారు. ‘మన మద్రాస్‌కోసం’ అన్న పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన అటు పరిశ్రమనుండి, ఇటు ప్రేక్షకులనుండి లభిస్తోంది. డి.రామానాయుడు స్టూడియోలో ఆదివారం ఏర్పాటు చేసిన కేంద్రానికి పెద్దఎత్తున సినీ అభిమానులు, నటీనటులు చేరుకున్నారు. తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. కొందరు అక్కడే వుండి దాతలు ఇస్తున్న వస్తువులను వివిధ వాహనాలలో సర్దేందుకు సహాయం చేస్తున్నారు. చెన్నైలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మరికొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాలను నటుడు నవదీప్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. చెన్నై వరద బాధితులను ఆదుకోవడానికి విజయవాడలో కూడా ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. భారత్ మోటార్ పార్శిల్ సర్వీస్ ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. దాతలు చెన్నై బాధితులకు ఏదైనా సహాయం అందించాలంటే ఆ సామగ్రిని విజయవాడ ఆటోనగర్‌లోని భారత్ మోటార్ పార్శిల్ సర్వీస్‌లో అందజేయాలని నవదీప్ తెలిపారు.