జాతీయ వార్తలు

మాతే మహాదేవి ఇకలేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రముఖ లింగాయత్, బసవధఠ్మ పీఠం అధ్యక్షురాలు మాతే మహాదేవి (74) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మార్చి 9న కన్నుమూశారు.ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇవాళ జరిగాయి. 1946, మార్చి 13న చిత్రదుర్గలోని ససాలట్టి గ్రామంలో మహాదేవి జన్మించారు. జ్ఞానవంతురాలైన ఆమె.. ఆధ్యాత్మిక జీవితానికి ఆకర్షితమయ్యారు. దీంతో జంగం దీక్ష చేపట్టి.. 1965-66 మధ్య కాలంలో సన్యాసిగా మారారు. 1969లో కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఎంఏ తత్వశాస్త్రం చేశారు. బసత తత్వ దర్శనంతో పాటు హెప్పిట్ట హలు, తరంగిణి అనే నవలలు రాశారు. హెప్పిట్ట హలు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వరించింది. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పించాలని మహాదేవీ ఉద్యమం చేపట్టారు.