మాతో - మీరు

సండే గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సండే గీత
జీవితంలో వక్ర మార్గాలు పట్టకుండా నిజాయితీ, నిబద్ధతలతో కృషి చేసి విజయం సాధించేందుకు మూడు సూత్రాలను ‘సండే గీత’లో అద్భుతంగా విశదీకరించారు. అపసవ్య ఆలోచనా విధానాన్ని సంస్కరించుకుంటూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని సాధించేందుకు సండే గీత, ఓ చిన్న మాట శీర్షికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. రణ క్షేత్రం సీరియల్ ప్రారంభం ఎంతో ఆసక్తిని కలిగించింది. దూరపు కొండలు కథ పైకి బోల్డన్ని నీతులు చెబుతూ, ఆచరణకు వచ్చేసరికి ఆమడ దూరం పారిపోయే ద్వంద్వ మనస్తత్వం గలవారికి చెంపపెట్టుగా నిలిచింది. మల్లాదిగారి ‘స్ఫూర్తి’ శీర్షిక మమ్మల్నెంతగానో అలరిస్తోంది.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
నేతాజీ మిస్టరీ
లక్షలాది భారతీయుల ఆరాధ్యుడు, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఒంటిచేత్తో గడగడలాడించిన సూపర్ హీరో నేతాజీ అదృశ్యం వెనుక వున్న మిస్టరీపై ప్రత్యేక వ్యాసం చాలా బాగుంది. కాంగ్రెస్ వారి స్వలాభ, పాత చింతకాయ పచ్చడి విధానాలతో విభేదించినందువల్లే నేతాజీని స్వాతంత్య్ర సంగ్రామంలో సహాయ నిరాకరణ చేయడమే కాక చరిత్ర పుస్తకాల నుండి శాశ్వతంగా తొలగించేందుకు, నేతాజీ ఉనికి కూడా బయటపడకుండా ఇప్పటికీ మిస్టరీగానే ఉంచేందుకు గత ప్రభుత్వాలు కృషి చేసాయన్నది జగమెరిగిన సత్యం. గాంధీజీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ వారి దృష్టిలో నేతాజీ ఒక అంటరానివాడు! పైన చెప్పుకున్న వారి కంటే, స్ఫటికం లాంటి దేశభక్తితో, దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలగకుండా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆఖరి క్షణం వరకూ పోరాటం సల్పిన నేతాజీ గురించి భారతీయులకు అసలు నిజాలు అందజేసేందుకు శాస్ర్తీగారు తప్పక ప్రయత్నించాలి.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
మీకు తెలుసా?
వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శీర్షిక ఇది. ఈ వారం చింపాంజీల రక్తం గురించీ... బుష్‌బేబీ.. ఆర్చర్ ఫిష్ గురించి మాకు తెలీని ఎన్నో విశేషాలను క్లుప్తంగా అందజేసినందుకు కృతజ్ఞతలు. అలాగే పేజీల్లోని కార్టూన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఆదివారం అనుబంధంలోని ప్రతి శీర్షిక దేనికదే హైలెట్. మనం వృద్ధి చెందాలంటే ఇతరులతో పోటీ కాదు మనతో మనకు పోటీ ఉండాలి అంటూ ఓ చిన్న మాటలో చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యం.
-డా.శివభూషణం (కర్నూలు)
ఈ వారం స్పెషల్
దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న ఈ రాష్ట్రంలో అన్నింటికన్నా కులాల ప్రభావమే అధికం. అన్ని పరిణామాలూ ఈ అంశం ఆధారంగానే సంభవిస్తూంటాయి. కులం ప్రస్తావన లేని విధానం లేదు. ఎన్టీఏతో జతగట్టి నితీష్ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రం తొలిసారిగా అభివృద్ధి మార్గాన పయనించడం మొదలైంది. ఇది తిరుగులేని నిజం. చక్కటి కవర్‌స్టోరీని అందించారు. ఇక సిసింద్రీలో ‘దైవానుగ్రహం’ కథ బాగుంది.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)
హోరాహోరి
భారతదేశ రాజకీయాలను అంచనా వేయడమంటే, అడవుల్లోకెళ్లి తపస్సు చేసినా దైవం ప్రత్యక్షమవుతాడు కాని ఈ కల్మష రాజకీయాలను ఎదిరించి తట్టుకునే మొనగాడు ఎవరు? భారతదేశం మొత్తంలో రెండు పార్టీలు ఉంటేనే దేశం బాగుపడుతుంది. అది బీహార్ కాని.. ఏ ప్రాంతమైనా. రాజకీయ నాయకుల వాగ్దానాలకేం కొదవలేదు. ఆచరణలో లేని మాటలు ఎన్ని మాట్లాడినా ప్రయోజనం సున్నా. అందుకే క్షుద్ర రాజకీయంకన్నా రాచరికమే మిన్న అనేట్టు ఉంటున్నాయి రాజకీయ నాయకుల తీరుతెన్నూ.
-బి.సుమతి (తిరుపతి)
భగత్‌సింగ్
ఈ వారం నుంచీ ప్రారంభమైన భగత్‌సింగ్ చదువుతూంటే ఒళ్లు పులకరించింది. యావత్ భరతజాతికి గర్వకారణం భగత్ గాథ. నేటి కంప్యూటర్ తరంలో - చాటింగ్‌లు, డేటింగ్‌లు చేస్తున్న యువతకు దేశాభిమానం, దేశభక్తి అనే గ్లూకోజ్ ఎక్కిస్తే కానీ మళ్లీ మన భారతదేశం నిద్రమత్తులోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేవదు. ఈ సీరియల్ ప్రారంభంలోనే స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కలిగించింది.
-బి.సహస్త్ర (వరంగల్)
లోకాభిరామమ్
కొంచెం పక్కకు ఆలోచించగలిగితే అందరూ కొత్త విషయాలను అనుభవించ గలుగుతారు - అన్న వాస్తవం చెప్పిన ‘యురేకా’కు, గోపాలంగార్కి అభినందనలు. నేతాజీ గురించిన వాస్తవాలు బయటపడి, ఈ జాతి పోరాట పటిమ, పౌరుషం మళ్లీ ప్రజ్వరిల్లే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాము. ‘రణక్షేత్రం’ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. రాసే విషయంపట్ల రచయితకి నిబద్ధత లేకపోతే ఎంత ప్రమాదకర, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో ‘దూరపు కొండలు’ కథ ఎంతో హృద్యంగా చెప్పింది. ‘అక్షరాలోచనాలు’ శీర్షిక ఎందరో కవులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
-బి.వెంకటపద్మరాజు (విజయవాడ)
నడక
‘సండే గీత’లో చక్కటి విషయాలను అందజేస్తున్నారు. నడక అంటే ప్రకృతితో మాట్లాడటం.. మార్నింగ్ వాక్ అంటూ చెవుల్లో హెడ్‌సెట్‌లు పెట్టుకొని పాటలు వింటూనో.. మాట్లాడుతూనో - నడవటం కాదు. మొబైల్ ఫోన్లలో పనీపాటా లేని కబుర్లు మాట్లాడితే మనసుకు ప్రశాంతత స్థానే గందరగోళం నెలకొంటుంది. అలాగే ‘లోకాభిరామమ్’ శీర్షిక ద్వారా గోపాలంగారు అందిస్తున్న వ్యాసాలు ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్తున్నాయి.
-డి.కళ (కర్నూలు)