మాతో - మీరు

వెనుకటి రోజులు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా చక్కని కవర్‌స్టోరీని అందించారు. కుటుంబ దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం అంటూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా కలసిమెలసి ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, సమస్యలు, రాన్రాను చిన్న కుటుంబాలు ఏర్పడటంవల్ల తలెత్తుతున్న సమస్యలను క్లుప్తంగా అర్థవంతంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలసిమెలసి ఉండటంవల్ల ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కారం అవుతుంది. పిల్లలకు తాత నాయనమ్మల ఆప్యాయతలు లభిస్తాయి. చిన్న కుటుంబం వల్ల తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తే, పిల్లలు బేబీ కేర్ సెంటర్లలోనూ, వృద్ధులు కొన్నిచోట్ల వృద్ధాశ్రమాల్లోనూ ఉంటున్నారు. ఇది శ్రేయస్కరం కాదు. వెనుకటి రోజులు మళ్లీ రావాలి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)

స్ఫూర్తి
ఎప్పటిలానే మల్లాదివారి ‘స్ఫూర్తి’ కథ దోమలకన్నా సిగరెట్ ప్రమాదకరం అన్న నీతిని చెప్పింది. బాగుంది. జైలు సెల్లు వాతావరణం, భగత్‌సింగ్ చివరి రోజు గురించి చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది. కళ్లంట నీళ్లు కారాయి. భగత్‌సింగ్ అమర్ రహే అని అరవాలనిపించింది. గొప్ప సీరియల్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇక ‘లోకాభిరామమ్’లో గోపాలంగారి అనుభవాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. మనిషిలోని దేవుని చూడగలిగితే తర్వాత దేవుడు కనిపిస్తాడన్న మాటలు చిరస్మరణీయం. దేశంలో అసహనం పెరిగిపోతున్నదని ఆక్రోశించేవారు తప్పక చదవాల్సిన వాక్యాలివి.
-ఎ.సమీర్ (తూ.గో.జిల్లా)

మీకు తెలుసా?
ఈ శీర్షికన అందిస్తున్న బిట్స్ మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంటున్నాయి. చెట్టంత గూడు చూసి ఆశ్చర్యపోయాం. ‘సండే గీత’లో మెరుపు - స్కూలు పిల్లలకు, అనాధ పిల్లలకు మేము మా సంస్థ తరఫున వెళ్లి వాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చినపుడు చూశాను. నిజంగా వాళ్ల కళ్లల్లో మెరుపు చాలా ఆనందాన్నిచ్చింది. జగమంత కుటుంబం చాలా బాగుంది. అలా ఉండాలనే ఉంటుంది కాని కుదరలేదు. ‘రెండో పెళ్లి’ కథ బాగుంది. రెండు ఎప్పటికీ మొదటిదవదు కదా. అది తెలుసుకుంటే మనుషులు బాగుపడతారు. కార్టూన్లు నవ్వించాయి. స్ఫూర్తి కథ బాగుంటోంది. అలాగే మల్లాదిగారి క్రైం కథలు విభిన్న తరహాలో సస్పెన్స్‌తో సాగుతున్నాయి.
-డి.వి.తులసి (రామవరప్పాడు)

సండే గీత
ఈ శీర్షికన అందిస్తున్న కథనాలు అర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆలోచింపజేస్తున్నాయి. ‘మెరుపు’ను గూర్చి చక్కగా తెలియజేశారు. మంచి పని చేయడానికి మనకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. కాని అవి మనం ఉపయోగించుకోం అని చక్కగా తెలియజేశారు. ‘ఏది ముఖ్యం?’ అంటూ ఓ చిన్న మాటలో ‘మనల్ని మనం సర్దుకోవాలి’ మనలోకి మనం తొంగి చూసుకోవాలి’ అన్న మాటలు మాకెంతో నచ్చాయి.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

ఓ చిన్న మాట
సంవత్సరాంతంలో అల్మరాని సర్దుకోవడం, దేన్ని ఉంచాలి, దేన్ని పారెయ్యాలి తేల్చుకోలేక పోవడాన్ని ‘ఓ చిన్న మాట’గా చక్కగా వివరించారు. అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. మనల్ని మనం సర్దుకోవాలి అనడం బాగుంది.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)

వసుధైక కుటుంబం
భారతీయం అయిన వసుధైక కుటుంబం కానె్సప్ట్‌ని ప్రపంచ కుటుంబాల దినోత్సవంగా జరపడం భారతీయులకు గర్వకారణమే. దాని గురించిన ‘ఈ వారం స్పెషల్’ మమ్మల్ని ఎంతగానో అలరించింది. క్రోన్డ్ క్రేన్స్ లవ్ డాన్స్, స్కిమ్మర్ పక్షి విశేషాలు, చెట్టంత గూడు కట్టుకునే వీవర్ పక్షుల గురించి ఆకట్టుకునే విషయాలు చెప్పి అలరించారు. చేసిన ఒక మంచి పని భగవంతునికి దగ్గర చేస్తుంది. స్వర్గానికి భూమికి మధ్య దూరాన్ని తగ్గిస్తుందన్న సండే గీత ఎంతో నచ్చింది.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)

లోకాభిరామమ్
గోపాలంగారు ఏం రాసినా బాగుంటుంది. ఈసారి ఆయన పాక నిర్మాణ శాస్త్రం గురించి గొప్పగా చెప్పారు. నిజమే. ఆనాటి పాకల్లో ఎయిర్ కండిషనింగ్ లాంటి సుఖం ఉండేది. పొగ పోయే సౌకర్యం ఉండేది. ఈ కాలంలో పనులు సులభం అయ్యాయి గాని సుఖం మాత్రం కరవు అయిందనడం నిజంగా నిజం! అమెరికాలో ఆశ్రయం పొందడానికి రష్యా క్రీడాకారులు హత్యలు చేయడానిక్కూడా వెనుకాడరని క్రైం కథ ద్వారా తెలిసింది. అయితే హత్య జరగకపోయినా ముగ్గురు అమెరికా ఆశ్రయం పొందడం ఎందరినో ఉత్తి పుణ్యానికి శిక్షించిన టీమ్ లీడర్‌కే శిక్ష పడటం అసలు ట్విస్ట్!
-పి.శుభలక్ష్మి (శ్రీనగర్)

కథ
‘తడి తగిలిన పాదాలు’ కథ ఒక సామెతని స్ఫురణకి తెచ్చింది. దేశ ప్రగతికి వ్యవసాయం మూలం పరిశ్రమలు కాదంటారు శాస్తవ్రేత్తలు! సదరు కథ కథాంశం అద్భుత వ్యాఖ్యలు నేటి రైతాంగం స్థితికి అద్దం పట్టాయి. ప్రభుత్వ రాయితీలు సకాలంలో సన్న చిన్నకారు రైతుల కందితే పంట దిగుబడులు పెరిగి వేలాది జీవరాసులు బట్టకట్టి ప్రకృతి ధర్మంగా ఉపయోగపడతాయన్న నాగయ్య పలుకులు ఆలోచింపజేశాయి.
-కృష్ణ మాధవరపు (కాకినాడ)