మాతో - మీరు

దృఢ మనస్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన దేశభక్తులకు కారాగారంలో తినలేని తిండిని పెడుతూ, అదే సాంఘిక దురాచారాలైన దొంగతనం, దోపిడీలు, మానభంగాలు, దొమీలు లాంటి నికృష్ట నేరాలు చేసిన వారికి రాజభోగాలా? - చదువుతూంటే మనిషై పుట్టిన బ్రిటీష్ దొరలకు మానవత్వం కనుమరుగై ఇంత కాఠిన్యమెలా కలిగిందో అని బాధ వేసింది. మన దేశంలో మన వారిని ఇంత క్షోభపెట్టిన చరిత్రను యథాతథం ప్రపంచానికి విస్తృతంగా ప్రచారం చేయాలి. నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీల ఎదుట స్వీట్లు, పళ్లు, ఫలహారాలు నుంచినా, పాల కుండలను వారికిచ్చినా, నీరసించి కృంగి కృశించిపోతున్నా మొక్కవోని ధైర్యంతో, మనోబలంతో తమ ఆశయ సాధన కోసం రోజులు నెట్టుకొచ్చారంటే ఈ దేశ ప్రజలు ఎంతైనా రుణపడి ఉండాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

ఇంటి శాస్త్రం
‘లోకాభిరామమ్’లో గోపాలంగారి ‘ఇంటి శాస్త్రం’ భలేగా ఉంది. ప్లాస్టర్‌ని పలాస్ర్తి అనడం, సున్నం తయారీ - ఆనాటి నిర్మాణ విధానాలే వేరు. సున్నం ఆడేటప్పుడు గుండు వృత్తాకారంలో ఎన్నిసార్లు తిప్పాలో లెక్కించేవారు. వందసార్లు తిరిగితే కాంక్రీటు కన్నా దృఢమైన సున్నం లభించేది. అప్పట్లో స్లోప్ (వాలు)ని ఉల్లోప్ అనీ, వెంటిలేటర్‌ని వింటర్ అని అనేవారు మేస్ర్తిలు. ఆ భాష ఇప్పటికీ ఉంది. జీవరాశి విపరీతంగా పెరగడం గాని, తరగడం గాని లేకుండా ప్రకృతి అద్భుతంగా సమతుల్యత సాధించేది కాని మానవ వికృతాల వల్లనే మిడతలు, ఉడతలు, ఏనుగులు దండుగా వచ్చి పంటల్ని నాశనం చేస్తున్నాయి.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)

సండే గీత
ఈ శీర్షికన అందిస్తున్న చిన్నచిన్న కథలు ఎంతో ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ‘ఇరుకు’ గురించి చక్కగా వివరించారు. ఇల్లు ఇరుకైనా ఫర్వాలేదుగాని హృదయాలు విశాలంగా ఉంటే చాలు అన్న విషయం చాలా బాగుంది. ‘ఓ చిన్న మాట’లో ‘ఆత్మవిశ్వాసం’లో, అన్నింటికంటె చాలా ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం అని చక్కగా వివరించారు. సిసింద్రిలో ‘విమర్శే ప్రశంస’ అంటూ విమర్శలకు విచారించకపోగా అవి నిజమైన ప్రశంసగా తీసుకుంటే అదే ఆనందంగా ఉంటుందని చక్కగా తెలిపారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

ముఖాముఖి
ఈ శీర్షికన అందిస్తున్న సమాధానాలు మమ్మల్ని అలరిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల ధృతరాష్ట్రుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసిన తర్వాత కూడా అందరు నేతలు అవును, కాదు అంటూ ప్రజల్ని మభ్యపెట్టారు. తెలిసో, తెలియకో ప్రధాని రాజ్యసభలో హోదా హామీ ఇచ్చిన మర్నాడే ‘హోదా మా పరిధిలోని వ్యవహారం. నిబంధనల ప్రకారం ఆంధ్రకు హోదా ఇవ్వలేం’ అని ప్లానింగ్ కమిషన్ కుండ బద్దలు కొట్టింది. అప్పుడు ఆలోచించిన కాంగ్రెస్ విభజన చట్టంలో ఆ అంశం చేర్చలేదు. హోదా సాధ్యం కాదని, ప్రధాని హామీ సంతకం లేని వీలునామా లాగ చెల్లదని అందరికీ తెలిసినా, నిజం చెప్పకుండా మళ్లీ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ధృతరాష్ట్రులు ఇద్దరే కాదు నేతలంతా ధృతరాష్ట్రులే! నమ్మకద్రోహుల్ని, నేరగాళ్లని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్న ప్రజలూ సూపర్ ధృతరాష్ట్రులే!
-కె.ప్రవీణ్ (కాకినాడ)

ఓ చిన్న మాట
అనుభవానికి ఆత్మవిశ్వాసం తోడయితే అద్భుతాలు సృష్టించవచ్చు - అన్న ఓ గొప్ప మాట చెప్పారు. బావుంది. మనవారి రోదసి విజయాలు అమెరికాకి కనె్నర్ర, పాక్, చైనాలకు మెరమెర కలిగిస్తున్నాయి. మనవాళ్లు చౌకగా ఇతర దేశాల ఉపగ్రహాల్ని రోదసిలోకి పంపి తమ వ్యాపారం దెబ్బతీస్తున్నదని అమెరికాకు మంట. గోపాలంగారి ‘ప్రేమ పాట’ మమ్మల్ని రంజింపజేసింది. ప్రేమ పాట మరెవరినో వెల్లి అర్థమడిగేలా ఉండకూడదనడం నిజం! ఇటలీలో కోర్సిని కుటుంబం చరిత్రకు సంబంధించిన వివరాలు, తమ కుటుంబ చరిత్ర రాసి దాచుకోవాలన్న ఐడియా బాగుంది. మనవాళ్లూ కుటుంబ చరిత్రలు రాసుకుంటే బావుణ్ణు.
-సదాప్రసాద్ (గొడారిగుంట)

మీకు తెలుసా?
‘మీకు తెలుసా?’ అంటూ దయ్యంలా అరిచే టస్మానియా డెవిల్స్, పర్యావరణానికి మేలుచేసే డంగ్ బీటిల్స్, అరవకుండా కరిచి వేటాడే డింగో డాగ్స్‌కి సంబంధించిన విషయాలు బాగా చెప్పారు. ఆలి మర్కటం అయినా కాకపోయినా ఇల్లు ఇరుకుగా ఉన్నా హృదయాలు విశాలంగా ఉండాలని చక్కగా చెప్పారు ‘సండే గీత’లో. సంస్కృతంలో మంత్రాలకు ఒక జవం, జీవం, ఒక గమనం, ఒక స్ట్రెస్ ఉంటాయి. మంత్రం పాఠంలాగా చదివేయకూడదు. తప్పులు లేకుండా పఠించాలంటే మొదట గురు ముఖతః వినాలి. అపభ్రంశాలు కూడదు. అందుకే గురువు ఆవశ్యకత డబ్బునొల్లుకోడానికి కాదు.
-పి.చంద్ర (మాధవనగర్)