మాతో - మీరు

ఓ చిన్న మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతాన్ని తవ్వుకుంటూ ఆనాటి మధుర స్మృతుల్లో ఓలలాడుతుంటారు. నేడు రేపటికి గతమే కదా! అందుకని నేడు కూడా మాధుర్యం నింపుకుంటే వర్తమానంలో గతాన్ని చూసుకుంటూ జీవితం మరింత మధురంగా ఉంటుందన్న ‘ఓ చిన్న మాట’ ఒక గొప్ప సత్యం. చెప్పేది కథలాగ నడిస్తే వాస్తవం మరింత బాగుంటుందంటూ గోపాలంగారు చెప్పిన ‘తులసి కథ’ భలేగా ఉంది. ఎక్కడో మొదలుపెట్టి మరెక్కడికో లాక్కుపోయి పాఠకుల్ని రంజింపజేయడం ఆయన హాబీ! ఇంతకూ ఆయన కథ చెప్పారా? ఏమో?! కానీ గత స్మృతులను నెమరువేసుకొనేట్టు చేస్తున్నారు. అనుష్క చెప్పినట్టు తారల పెళ్లిగోల మనకేల?
-సి.మైథిలి (సర్పవరం, తూ.గో.జిల్లా)
సండే గీత
మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం ఎంత అవసరమో మనస్సుని, హృదయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం అంతే అవసరం అంటూ చేసిన జ్ఞానబోధ ‘సండే గీత’ ఆకట్టుకొంది. ఒకే నేరానికి భిన్నమైన శిక్షలు వేయడాన్ని గురించి అడిగిన శ్రమకు మీ సమాధానం బాగుంది. తమాషా ఏమిటంటే అమెరికాలో రెండు లేక మూడు జీవితకాలాల శిక్ష విధించడం హాస్యాస్పదంగా అనిపించవచ్చు కాని ఆ శిక్షలు నేర తీవ్రతను సూచిస్తుంది. అలాంటి వారికి మన దేశంలో మాదిరి శిక్ష తగ్గింపు ఉండదు.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
అన్నీ బాగుంటున్నాయి
మొదటి పేజీలో ఇరుకు, ఆత్మవిశ్వాసం ఫీచర్స్ మాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మనలో మనంలో శాస్ర్తీగారి జవాబులు ఎకె47 రైఫిల్ నుండి వచ్చే బుల్లెట్‌లా పదునుగా, స్పీడ్‌గా, సూటిగా ఉంటాయి. భగత్‌సింగ్ గురించి వచ్చిన చాలా పుస్తకాలలో పార్లమెంటులో బాంబు ప్రయోగం తర్వాత అతను చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి పోలీసులకు దొరికిపోయి, తద్వారా దేశ జాతీయోద్యమంలో విప్లవకారుల పాత్రను నీరుగార్చేసారని రాశారు. శాస్ర్తీగారు ఈ సంఘటనలను కూలంకషంగా విశే్లషించి, నిజాలను పాఠకులకు అందించిన వైనం అపూర్వం. ఉరికంబం ఎక్కబట్టే భగత్‌సింగ్ ఇప్పటికీ అశేష భారతీయులకు స్ఫూర్తిదాయకంగా, వారి హృదయాలలో సజీవంగా ఉన్నాడన్నది నిర్వావాదాంశం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
క్రైం కథ
ఇంటి నుంచి వెళ్లిపోయిన పాలాస్మిత్‌ని వెదుకుతున్నట్లు రిపోర్టులు పంపుతూ ఆమె కనిపించలేదని చెప్పడానికి డిటెక్టివ్‌ని నియమించడం, ఆమె కనిపించరాదని ముగ్గురు కోరుకోవడం వారిలో ఒకరు ఆమెను హత్య చేసి ఉంటారన్న అనుమానం - ఇలా సాగిన క్రైం కథ ‘కనబడుటలేదు’ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కాలమే పరిష్కారం అని చేతులు కట్టుకుని కూచోకుండా చుట్టుపక్కల వారితో అపార్థాలు వెంటనే పరిష్కరించుకోవాలంటూ శర్మగారు చెప్పిన విషయాలు తక్షణం ఆచరణీయం. అందరూ చేస్తున్నదే అంటూ సబబు కాని పనులు మనమూ చేయరాదన్న స్ఫూర్తి కథ బాగుంది.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)
వినదగు
ఈ శీర్షిక ద్వారా ఆత్మ తత్వం గురించిన విశే్లషణ చాలా బావుంది. మనస్సు చేసే కర్మలను సాక్షీభూతంగా చూస్తూ అందరిలో కొలువై వున్న సర్వాంతర్యామితో కనెక్ట్ కాగలిగితే సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, అసూయా ద్వేషాలు వంటి నెగెటివిటీస్ అంటే వ్యతిరేక, ప్రతికూల ధోరణుల నుండి అతి సులభంగా బయటపడవచ్చునన్న తత్వ విచారణ మాకెంతో నచ్చింది.
-సి.పి. (కోటిలింగాల)
గీతోపదేశం
‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ మాకు గీతోపదేశం చేస్తున్నట్టుగా ఉంటున్నాయి. ప్రేమ కానుక చాలా బాగుంది. సదాచారం గురించి చక్కగా చెప్పారు. పిల్లలకు నమస్కారం గురించి స్కూల్లో చెప్పాలి. వాళ్లు హాయ్, బై కల్చర్‌లోకి వచ్చేశారు. గురువుకి కూడా బై చెప్తున్నారు. గడి-నుడి, పదచదరంగం ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ‘నేను సైతం’ కథ మంచి కాలక్షేపాన్ని ఇచ్చింది. ఆడపిల్ల అంటే తల్లికి కూడా ఇష్టం లేకపోతే ఎలా? ఆవిడ కూడా ఆడదే అన్న విషయం మర్చిపోతున్నారు. ప్రముఖ శాస్తవ్రేత్తల గురించి ‘్భమి’లోనే తెలుసుకొంటున్నాం. తాగుబోతు పక్షి గురించి చదివి ఆశ్చర్యపోయాం.
-డి.వి.తులసి (రామవరప్పాడు)
ఫాదర్స్ డే
ఈ వారం ఆదివారం అనుబంధంలోని అన్ని అంశాలు బాగున్నాయి. ముఖ్యంగా ఫాదర్స్ డే సందర్భంగా వచ్చిన కవర్‌స్టోరీ ఎంతో బాగుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రి పాత్రా మారుతోంది. ఆధునిక జీవితంలో తండ్రి నిర్వహిస్తున్న పాత్ర మరచిపోలేనిది. ఇక అన్ని రెగ్యులర్ శీర్షికలు బాగున్నాయి. భగత్‌సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)
మహావిజేత
మహావిజేత సీరియల్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంటోంది. అనేకానేక మలుపులతో సాగుతోన్న ఈ జానపద కథ తీయటి అనుభూతిని కలిగిస్తోంది.
-పి.బాబ్జీ (తెనాలి)