మాతో - మీరు

ఆణిముత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం ‘్భగ్యనగరిలో ఆణిముత్యాలు’ వ్యాసం చాలా బాగుంది. ఆలోచింపజేసేదిగా ఉంది. గోపీచంద్ కృషి వల్ల భారత్ ఈ పతకాన్ని సాధించగలిగింది. అతడి కృషి, సింధు పట్టుదల, క్రీడా నైపుణ్యం ఎంచదగ్గది. ఇప్పుడు ప్రతి రాష్ట్రం మేల్కొని మంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. రాజకీయాలకు అతీతంగా ఉంటే ఎన్నో ఆణిముత్యాలు రాణిస్తాయి. అలాగే ఊహించని విధంగా జిమ్మాస్టిక్స్‌లో దీపాకర్మాకర్ దూసుకొచ్చింది. అంటే ఈ క్రీడలో రాణించే శక్తి ఉందన్నమాట. ఏదో తూతూ మంత్రంగా కాకండా జిమ్మాస్టిక్స్‌ని ప్రోత్సహిస్తే భారత్ అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ఒలింపిక్స్‌లో గట్టి పోటీ ఇవ్వగలదనిపిస్తోంది.
-జి.జి.కె.రావు (శ్రీకాకుళం)

ఆధునికతతో చేటు
‘చివరి చీర’ కథ ఆలోచింపజేసింది. ఆనాటి పల్లెటూరి సంప్రదాయాలు, పండుగ వచ్చిందంటే సంప్రదాయబద్ధంగా దానిని జరుపుకునే విధానం, వ్యవసాయపు ప్రాధాన్యత, దాని కోసం వారు కష్టపడే విధానం బాగనిపించింది. రైతుల తొలి పండుగ అయిన ఉగాదికి మామిడాకుల తోరణాలతో ఇల్లలంకరించడం, ఉగాది పచ్చడి, భక్ష్యాలు తదితరాలు తయారుచేసుకొని రుచికరంగా సేవించడం, పక్షుల కిలకిలారావాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకొనే పండుగ అసలైన పండగనిపించింది. నేటి ఆధునికత, నగర వాతావరణంలో విజ్ఞానం, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దుస్తుల విషయంలోనూ, సంప్రదాయాలలోనూ మార్పులు వచ్చి, సోమరితనం పెరిగి కృత్రిమంగా పండుగ చేసుకోవటం బాధనిపిస్తుంది. ఆ వాతావరణానికి దూరమై ప్రకాష్ మంచిపనే చేశాడు. మంచి కథని అందించినందుకు ధన్యవాదాలు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)

సంతోషం
సంతోషం అనే మూడ్ అంటువ్యాధి లాంటిదే. మనం సంతోషంగా ఉంటే ఇల్లంతా సందడే. ఇతరుల బాధని సహవేదనతో వింటే వాళ్లు ఊరట చెంది సంతోషిస్తారు. అలా సంతోషం వ్యాపిస్తుందన్న ఓ చిన్న మాట గొప్ప సత్యాన్ని ఆవిష్కరించింది. టెస్ట్ ర్యాంకుల్లో 8వ స్థానంలోని వెస్టిండీస్‌తో రెండో స్థానంలోని మనదేశం ఆడితే విజయం ఎవరిదో ముందుగానే తెలిసిపోయి జనం చూడరు. మీడియా మాత్రం మన దేశం గెలిస్తే గొప్ప ఘనకార్యం జరిగినట్టు మన దేశాన్ని ఆకాశానికెత్తేయడం వింతల్లో వింత! మధురాహారం దొరికినప్పుడు పంచుకొని తినాలి. అలాగే మంచి పుస్తకం, మంచి సినిమాని అందరూ అనుభవించాలన్న గోపాలంగారి మాటలు భేషుగ్గా ఉన్నాయి.
-శాండో ప్రచండ్ (శ్రీనగర్, తూ.గో.జిల్లా)

ప్రశాంతత
ఘర్షణకు దూరంగా ఉంటే ప్రశాంతత కోల్పోకుండా ఉంటాం. మనకు పడని వ్యక్తులను పట్టించుకోకపోతే మంచిది. పట్టించుకొని ఏదైనా చేస్తే వాళ్లు మరింతగా పెరిగిపోతూ మనల్ని మరింత బాధిస్తారని చెప్పిన ‘సండే గీత’ అద్భుతంగా ఉంది. తెలంగాణను సాధించి పెట్టిన వారి చరిష్మా మరో పదేళ్ల వరకు ఉండొచ్చు. ఈలోగా తెదేపా కాదు కదా మరే పార్టీ అక్కడ పుంజుకోదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన ఖ్యాతి కొట్టేసిన కాంగ్రెస్ దశాబ్దాలపాటు దేశాన్ని ఏలలేదా? అలాగే ఇక్కడాను. పక్కా కమర్షియల్ క్రికెటర్ సాటి చెయ్యదా రామారావు ప్రజాసేవ అన్న మీ సమాధానం భేషో భేష్!
-కె.ప్రవీణ్ (కాకినాడ)

పరామర్శ
కష్టంలో వున్నవారిని కలిసి పరామర్శించి వారికి కొంత సంతోషం ఇచ్చిన అనుభూతి చాలా గొప్పదని ‘ఓ చిన్న మాట’లో బహు చక్కగా చెప్పారు. పంచభూతాల మేధో మధనంలో సృజనాత్మకంగా ఆవిష్కృతమయ్యే సాహిత్యమే సజీవ శక్తిమయం అంటూ చెప్పిన అక్షరాలోచనాలు నిజంగా ఆలోచింపజేసాయి. చైనాలోని షియాంగ్ సిటీ వాల్‌ని మట్టి పొరలు, లైమ్, బియ్యం నుంచి తీసిన జిగట వంటి వాటితో నిర్మించారని టెర్రాకోటా వ్యాసంలో చెప్పారు. నిజానికి సిమెంట్ లేని రోజుల్లో మన దేశంలోని కోట గోడలు కూడా మట్టిపొరలు, లైమ్‌ని గానుగలో ఆడించి వచ్చిన జిగట సున్నంతో నిర్మించేవారు.
-కె.హితీష్ (రమణయ్యపేట)

స్ఫూర్తి
ఈ వారం కథ ‘స్ఫూర్తి’ మాకెంతో నచ్చింది. ప్రభుత్వ వనరులను వినియోగించుకొని, అత్యున్నత విద్యాభ్యాసం చేసి, తర్వాత కెరీర్ పేరిట విదేశాలకు పక్షుల్లా ఎగిరిపోయే యువత శాతమే అధికంగా ఉంటున్న నేటి కాలంలో తన జీవితంలో అహర్నిశలు భారతదేశ అభివృద్ధి, దేశ సార్వభౌమాధిపత్యం కోసం, దేశాన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో అభివృద్ధి సాధించడంలో కృషి చేసిన భారతరత్న అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, తన ఉన్నత విద్య, తెలివితేటలు మాతృదేశానికే ఉపయోగపడాలని తపించిన యువకుని ఆదర్శం మాకెంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. -ఎం.కనకదుర్గ (తెనాలి)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.