మాతో - మీరు

ధ్వని సంగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది ఆనాటి వారసత్వ సంగీతం? గుండె దడ పుట్టించే ధ్వనులనే సంగీతమనే దుస్థితి దాపురించింది. ఏది రాగమో, ఏది తాళమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. టెక్నాలజీ పెరగాలి. కొత్త వాయిద్య పరికరాలు వస్తున్నాయి. రావాలి కూడా. కాని వాటిని ఇష్టం వచ్చినట్లు పలికించేసి సంగీత పరిమాణాలను అపహాస్యం చేస్తున్నారు. ఈ సంగీతమనబడే హోరులో సాహిత్యం ఖూనీ చేయబడుతోంది. ‘అమృతవర్షిణి’ ప్రతీ వారం మమ్మల్ని సంగీత జగత్తులో విహరించేట్టు చేస్తోంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఓ చిన్న మాట
ఈ శీర్షికలో ‘పుస్తకం విలువ’ గురించి చక్కగా తెలియజేశారు. అవీ ఇవీ- శీర్షిక తెలీని ఎన్నో విషయాలను తెలియజెప్తోంది. ‘అక్షరాలోచనలు’లో ‘ఆకలి సాహస విన్యాసాలు’ కవిత మాకెంతో నచ్చింది. ‘మార్పు’ను స్వాగతించే ప్రేరణ పద్ధతుల గురించి చక్కగా చెప్పారు. ‘సంతృప్తి’ కథ బాగుంది. ఉమ్మడి కుటుంబాలలో నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు ఇలాంటి మంచి విషయాలను చెప్పేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు అంత తీరుబడి లేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారు.
-డి.వి.తులసి (విజయవాడ)
కవర్ స్టోరీ బాగుంది
షార్... హుషార్ పేరిట వచ్చిన కవర్‌స్టోరీ బాగుంది. షార్ ఏర్పాటు, ప్రయోగాల గురించిన వివరాలు తెలిసాయ. సతీష్ ధావన్ నేతృత్వంలో ఇస్రో అనేక మైలురాళ్లను అధిగమించింది. ముఖ్యంగా ఈ 104 ఉపగ్రహాల ప్రయోగ విజయం ఒక అద్భుతం. సండే గీత బాగుంది. సిసింద్రీ, కార్టూన్లు అలరించాయ.
- వెంకట్ (మచిలీపట్నం)
సండే గీత
వర్షం లేకపోతే సృష్టి లేదు. అలాగని ఎప్పుడూ వర్షమే ఉన్నా సమస్యలే! అన్ని కాలాలూ అంతే అని చెప్పిన ‘సండే గీత’ బాగుంది. మాయలూ, మంత్రాల కథలు పిల్లల్నే కాదు పెద్దల్నీ ఆకట్టుకుంటాయి. కాని మాయలూ మంత్రాలూ లేవు. కష్టపడితేనే ఏదైనా సాధించగలం - అని ఓ చిన్న మాటలో బహు చక్కగా చెప్పారు. మాతో మీరు (ఉత్తరాల శీర్షిక)కి ఈ వారం కటీఫ్ చెప్పినందుకు బోలెడంత విచారించాం. అక్షరాలోచనల్లో ‘నీవు తిరిగి రావు జ్ఞాపకాల దొంతరలు తప్ప’ అంటూ ప్రారంభమైన కవిత బాగుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
ఆమె ఎవరు?
క్రైం కథ ‘ఆమె ఎవరు?’ పాత గ్రూప్ ఫొటోల్లో ఆమె బొమ్మ కనిపించడం గురించి చిక్కని ఉత్కంఠతతో కథని నడిపారు. చివరకు ఆమె ఎవరో తెలిసినా ఆమె బొమ్మ వీరి ఫొటోల్లోకి ఎలా వచ్చిందో మిస్టరీగానే ఉండిపోయింది. ‘ఒక్క తూటా చాలు’ క్రైం డిటెక్షన్ సీరియల్ ఉత్కంఠతతో చకచకగా నడుస్తోంది. గోపాలంగారు బాల మురళి గానం గురించి చెప్పిన విషయాలు అలరించాయి.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
భగత్‌సింగ్
‘్భగత్‌సింగ్’ పుస్తక సమీక్ష చదువుతుంటే ఆ సీరియల్ మరోసారి పునశ్చరణ చేసుకుంటున్న అనుభూతి కలిగింది. మాటకు ఎంత శక్తి ఉందో శబ్దానికీ అంత శక్తి ఉన్నదంటూ ఆకాశంపై ఉదయ రాగాలాపనతో అమృత వర్షం కురిపించారు మల్లాది సూరిబాబు. ‘మీకు తెలుసా’లో కళ్లద్దాల ఎలుగుబంట్లు, రహస్యాలు చెప్పే పాదాల రంగులు, ముఖం ఎర్రబడే కోతుల విశేషాలు అలరించాయి.
-కె.సుధీర్ (శ్రీనగర్)
పేపర్ ప్లేట్
నేటి వివాహ తంతు గురించి.. బఫే పద్ధతి గురించీ.. బంధుమిత్రుల ఆర్భాటాలనూ ఎంతో చక్కగా వర్ణిస్తూ సాగిన ‘పేపర్ ప్లేట్’ కథ మా ఇంటిల్లిపాదినీ అలరించింది. ఇప్పుడు చాలా హడావిడీ, స్పీడు. కంప్యూటర్ యుగంలో, కొత్త జంటను చూస్తారో చూడరో గాని, బఫే మీల్సంటూ నచ్చిన ఆహారాన్ని నిలబడి దూడల్లా తినేసి, ఆర్కెస్ట్రా, మ్యూజికల్ నైట్‌ల వంటివి ఉంటే వాటిని చూసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారన్నది వాస్తవం. మంచి కథని అందించినందుకు ధన్యవాదాలు. ‘నట గాయకుల పట్ట్భాషేకం’ ద్వారా ఆనాటి మేటి పౌరాణిక రంగస్థల నట చక్రవర్తుల గురించి బాగా జ్ఞాపకం చేశారు. అలాగే ‘ఒక్క తూటా చాలు’ సీరియల్‌లో -హత్య చేయడం ఎంత తేలికో, శవాన్ని మాయం చేయడం అంత కష్టం’ - చీకటి నల్లత్రాచులా ప్రకృతిని చుట్టుకొంది’ లాంటి మాటలు చాలా బాగున్నాయి.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
కొన్ని తేదీలు
ఆదివారం అనుబంధంలో ‘సండే గీత’ మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంటోంది. ‘కొన్ని తేదీలు’ అంటూ, మన జీవితంలో కొన్ని తేదీలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, అవి అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయని, మనం వాటిని గూర్చి తలచుకుంటామని, గుర్తులు జ్ఞాపకాలు బాధించవచ్చునని, కానీ పరుగెట్టక తప్పదని చక్కగా తెలియజేశారు. ‘ఓ చిన్న మాట’లో చివరి రోజుకు గల ప్రత్యేకతను చక్కగా వివరించారు. ‘నట గాయకుల పద్య పట్ట్భాషేకం’ గూర్చి మల్లాది వారు ఎంతో చక్కగా తెలిపారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)