మాతో - మీరు

‘షీ’రోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛమైన మనసు, నిండైన ఆత్మవిశ్వాసం, సడలని మనోనిబ్బరం - ఇవన్నీ కలగలిసిన ఆత్మసౌందర్యమే అసలైన అందం - అంటూ యాసిడ్ దాడుల్లో కురూపులుగా మారిన యువతులు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన షీరోస్ రెస్టారెంట్ గురించిన ఫీచర్ ఆకట్టుకొంది. ఆగ్రా అనగానే తొలుత గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్. తర్వాత సందర్శించేది షీరోస్‌నే అనడంలోనే ఉంది ఆ యువతులు సాధించిన విజయం.
-కె.సుధీర్ (శ్రీనగర్)

లోకాభిరామమ్
మనసు బీదతనం గురించి ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు గొప్పగా వివరించారు. మొగమాటపడి మనసులో మాట మనసులోనే దిగమింగుతాము. అలా దిగమింగకూడదు. స్టార్ హోటల్‌లో ఆర్డర్ ఇచ్చినదంతా తినలేకపోతే మిగిలినది ప్యాక్ చేయించుకొని ఇంటికి తీసుకుపోవడానికి సిగ్గుపడనక్కర్లేదు. అమెరికా నుంచి తిరిగొచ్చిన వారి ఉపాధి గురించి అడిగిన ప్రశ్నకు మీ సమాధానం అత్యంత సమంజసంగా ఉంది. తిరుమలలో వున్న వందలాది మంది అర్చకులు కట్టకట్టుకొని ఒకేచోట ఉండరు. వారికి ఎక్కడ ఎప్పుడు ఏ పని ఉంటుందో టైమ్ చార్ట్ ఉంటుంది. వారికీ విరామం, సెలవులు ఉంటాయి.
-బి.సోనాలి (సూర్యారావుపేట)

నమ్మలేని నిజం
బర్మింగ్‌హాంలోని సుజాన్‌కు రాత్రిళ్లు కలలో ఒక భవనం కనిపించడం, ఎర్రజుట్టు మహిళ ఆమెను దయ్యంలాగ భయపెట్టడం, కొంతకాలం తర్వాత ఆమెకు లివర్‌పూల్‌లో అదే భవనం వాస్తవంగా కనిపించడం నిజంగా నమ్మలేని నిజమే. ఎడ్వర్డ్‌లాగ ముఖ కవళికలు మార్చుకొని ఎడ్వర్డ్‌ని అని చెప్పుకుంటూ ఆత్మహత్య చేసుకోబోతున్న వాడిలా అందర్నీ నమ్మించి చివరకు నిజం ఎడ్వర్డ్‌ని చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న భ్రమ కలిగించి హత్యానేరం నుంచి తప్పించుకున్న రాస్కెల్ కథ చిక్కని సస్పెన్స్‌తో సాగి ఆకట్టుకొంది. 140 కోర్సులు చేసి 140 డిగ్రీలు సాధించిన పార్తిబన్ విజ్ఞాన తృష్ణ మెచ్చుకోదగినదే.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)

అమ్మ
‘ఓ చిన్న మాట’లో గుండెను గూర్చి, అమ్మని గూర్చి ఎంతో చక్కగా తెలిపారు. అమ్మని, గుండెని జాగ్రత్తగా గమనించిన వ్యక్తులు తమ శక్తి ఉన్నమేరకు పని చేస్తూనే ఉంటారని చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. ‘సండే గీత’లో సూక్ష్మం బాగుంది. జీవితం అంటే ఇవ్వడం, తిరిగి పొందడం అన్న సూక్ష్మాన్ని జింబోగారు చక్కగా తెలిపారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

ఆర్ట్ ఈజ్ లాంగ్
డా.పార్తిబన్ గారు 140 కోర్సులు పూర్తి చేశారు అనే వాస్తవం వారు ‘నిత్య నూతన విద్యార్థి’ అని తెలియజెప్తున్నది. ‘ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్’. జీవితం చిన్నది. విద్య, కళలు ఆకాశం అంత అనే సామెతకు సార్థక్యాన్ని నిజం చేశారు. వీరి అధ్యయన జీవితం ముఖ్యంగా నేటి యువతకు మార్గదర్శకం కావాలని అభిలషిస్తున్నాను. అవీ-ఇవీ శీర్షిక ద్వారా అనేకానేక అంశాలను మా ముందుకి తెస్తున్నందుకు కృతజ్ఞతలు. ‘అదే బాగుంది’ వ్యాసం బాగుంది.
-కాకుటూరి సుబ్రహ్మణ్యం (ఖమ్మం)

ముఖచిత్ర కథనం
ప్రధాని నరేంద్ర మోది ముఖచిత్ర కథనం బాగుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ‘నరేంద్ర మోదీ వయస్సు మీదపడ్డ వృద్ధుడు’ అన్న మాటలు పత్రికల్లో చూశాం. మోదీ వృద్ధుడైనప్పటికీ స్థానిక ఎన్నికల్లోనే కాకుండా తాజాగా యు.పితో సహా నాలుగు రాష్ట్రాల్లో ఆయనకు పట్టం కట్టారు. పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బంది పడినా, ఆయన నిజాయితీని మెచ్చారు. నల్లధన నిర్మూలన యజ్ఞంలో సహకరించారు. అందుకే ఆయన జనం మెచ్చిన నాయకుడు - జనమేజయుడు. ముఖ చిత్ర కథనం బాగుంది. ‘అమృతవర్షిణి’లో స్వర లిపిలో స్వరాన్నీ, స్వర స్థానాన్ని శిష్యుడు గుర్తెరిగేలా చెప్పగలిగే గురువులలోనే సంగీత స్వరూపం బోధపడ్తుంది. ఏదైనా సమగ్రంగా నేర్చుకోవాలనే స్థిర సంకల్పం ఉండాలి. నేర్చుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడం, తెలియడం అంతే ముఖ్యం. శిష్యుడికి గ్రహించే శక్తి ఉండాలి. గురువుకి చెప్పాలని ఉండాలి. చక్కటి శీర్షికను అందజేస్తున్నందుకు ధన్యవాదాలు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

జిజ్ఞాస
‘ఓ చిన్న మాట’లో జిజ్ఞాస గురించి చెప్పిన అంశం ఆకట్టుకొంది. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన శక్తి సామర్థ్యాలు మెరుగుపడటమే కాక మన మీద మనకే విశ్వాసం పెరుగుతుంది. ‘మతం పుచ్చుకోవడం’ గురించి మీరు చెప్పిన సమాధానం - తెలిసి మోసపోయే వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరు - అనడం సముచితంగా ఉంది. ‘గతి తప్పిన తరం’ గురించి గోపాలంగారు చెప్పినవన్నీ పచ్చి నిజాలే. కొన్ని కాలేజీల విద్యార్థుల్ని ఇంటర్వ్యూలకే పిలవడం మానుకున్నాయి ఐటి కంపెనీలు. అలాంటి కాలేజీల్లో బి.టెక్, ఎంటెక్ డిగ్రీలు సంపాదించినా సరియైన ఉద్యోగాలు దొరక్క ప్యూను, పోలీసు ఉద్యోగాలకు ఎగబడుతున్నారు.
-ఎ.శాంతిసమీర (వాకలపూడి)

దొంగతనం
పక్కింటాయన కుటుంబంతో వారం రోజులు సెలవుపై ఊరెళ్లాడు. రెండు రోజులయ్యాక ఆయనకు బదిలీ అయింది.. సామాను తెమ్మన్నారంటూ నలుగురొచ్చి సామాను లారీలో ఎక్కించి తీసుకుపోయాక వాళ్లు దొంగలని తెలిసింది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. క్రైం కథలో ఇంట్లోంచి ఏం దొంగిలించకుండా ఇంటినే దొంగిలించిన దొంగ కథ కొత్తగా ఉండి ఆకట్టుకొంది.
-హెచ్.హితీష్ (రమణయ్యపేట)