మాతో - మీరు

అమృతవర్షిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమృతవర్షిణి’లో హరికథా పితామహుని విశేషాలు చదివి మిక్కిలి సంతోషించాం. ఆనాటి వారి మిత్రుల, బంధువుల, శిష్య ప్రశిష్యుల పేర్లను చదువుతుంటే ఏదో మధురానుభూతి. ఒకసారి నారాయణదాసు గారు ‘జానకీ శపథం’ కథ చెప్పబోతున్నట్లు ప్రకటించారు. పండిత పామరులందరూ రామాయణ కథలో సీతమ్మతల్లి చేసిన శపథం ఏమిటి చెప్మా అని ఆసక్తిగా చూడసాగారు. మన దాసుగారు రామాయణంలో కొన్ని అద్భుత ఘట్టాలను, అందరికీ తెల్సినవే గానం చేశారు. కథ సమాప్తం అయిన తర్వాత దాసు గారిని ‘జానకీ శపథం’ కథ అని చెప్పి ఎక్కడా సీతమ్మ చేసిన ఆ శపథం ఏమిటో చెప్పలేదేమిటి?’ అని నిలదీశారు. అందుకు దాసుగారు ఏ మాత్రం తడుముకోకుండా ‘అయ్యా! నేను జానకీ శపథం గురించే చెప్పాను. ఎలాగంటే ‘జానకి + ఈ శపథం’ అనగా రాముని జీవన మార్గం అంటే రామాయణమే కదా! మీరు దాన్ని జానకీ - శపథంగా అర్థం చేసుకున్నారేమో’ అని సమర్థించుకున్నారు. అదీ వారి భాషా పటిమ. దాసుగారి గురించి రాయాలంటే ఒక వ్యాసం ఏ మాత్రం సరిపోదు. అనేక విషయాలు తెలియజేసిన మల్లాది వారికి వందనాలు.
-పెద్దాడ చిదానందమూర్తి (అమలాపురం)
ప్రాతఃస్మరణీయులు
ఓ మారు దాసుగారు హరికథ చెబుతూ.. అందులో భాగంగా నాట్యం చేస్తూండగా, ముందు వరుసలో కూర్చున్న ఆంగ్లేయ అధికారి ‘ఈయన ఆంగ్ల నాట్యం (వెస్ట్రన్ డాన్స్) కూడా చేయగలరా? అన్నాట్ట. అది విన్న దాసుగారు ఆ అధికారి నోరెళ్లబెట్టేలా వెస్ట్రన్ డాన్స్ చేసి.. నివ్వెరపోయేట్టు చేశారట. అలాంటిదే మరో సంఘటన. ‘దాసుగారూ హరికథ చెబుతారా గిరి కథ చెబుతారా అని ఓ ఆకతాయి వేసిన ప్రశ్నకు ‘గిరి’ కథే చెబుతాను అని ‘గిరి పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవి కళ్యాణ గాథను హరికథగా చెప్పారుట. ఇలాంటివే ఎన్నో సంఘటనలను మాకు జ్ఞాపకం చేస్తున్న ‘అమృతవర్షిణి’ శీర్షిక నడిపిస్తున్న మల్లాది వార్కి కృతజ్ఞతలు.
-కాకుటూరి నాగరాజరావు (కావలి)
స్ఫూర్తి
ఇతరుల నుంచి స్ఫూర్తి పొందడమే కాదు మనలను చూసి మనమే స్ఫూర్తి పొందేట్టు మనల్ని మనం మలచుకోవాలని అద్భుతంగా చెప్పారు ‘సండే గీత’లో. నిరసన తెలియజేయడానికి తొట్టెల్లో కాళ్లు పెట్టి కాంక్రీటు పోసుకోవడం కొత్తగా ఉన్నా ఇలాంటి నిరసనలు సరికాదు. నిప్పుతో హెయిర్ కటింగ్ తమాషాగా ఉంది. అక్షరాలోచనల్లో హృదయ సౌగంధికం కవితలో గుండె గుమ్మానికి ఆర్ద్రతా సౌగంధిక పుష్పం కట్టి నిను పిలవాలని ఉంది అనడం భలేగా ఉంది.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
కల్పరసం
‘కల్పరసం’ అని పిలువబడే కొబ్బరి మొవ్వ నుంచి సేకరించిన రసం పోషక విలువల సమ్మిళితం, ఆరోగ్యప్రదాయిని అని తెలిసి ఆశ్చర్యపోయాం. అలాగే ‘నీరా’ అని పిలువబడే తియ్యని తాటిరసం కూడా. చెన్నైలో రోడ్డు పక్కన బళ్ల మీద చెరుకు రసమే కాదు అరటి దూట రసం కూడా అమ్ముతారు. ఈ రసాలన్నీ ప్రకృతి మాత తన బిడ్డలకిస్తున్న ప్రసాదాలే. ఒక బీద స్ర్తి నిజాయితీపరురాలు, నమ్మకస్తురాలు అన్న ఇమేజి సాధిస్తే చాలు ఎన్ని ఘరానా దొంగతనాలైనా చేసి చట్టం నుంచి తప్పించుకోగలదని ఆసక్తికరంగా క్రైం కథ చక్కగా చెప్పింది.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
లోకాభిరామమ్
పర్యావరణం గురించి గోపాలంగారు ‘లోకాభిరామమ్’లో రాసినది మరొకరి పేరుతో రావడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. సాహిత్యమే కాదు సినిమాలూ అంతే! కన్నవారలెంత ధన్యులో విన్నవారలంత ధన్యులు అంటూ హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి చెప్పిన విషయాలు అవ్యక్తానందం కలిగించాయి. హత్య జరగడానికి మూడు నెలల ముందే ఆ నేరాన్ని ఎడ్వర్డ్ చూడటం, పోలీసులకు చెప్పడం నిజంగా నమ్మలేని నిజం!
-పి.చంపక్ (మాధవనగర్)
బలహీనత
ఓ చిన్న మాటగా వాట్సాప్ మెసేజీల్లో మన బలహీనతల్ని భలేగా ఎండగట్టారు. ఒక్కోసారి అశ్లీల బెడద వున్నా ఒకే మెసేజీని పది మంది ఫార్వర్డ్ చేసి మన ఫోన్ నింపేస్తారు. చిరాకేస్తుంది. ట్రంప్ పట్ల మీ అభిప్రాయాలు మిగిలిన వారికన్నా సజావుగా నిజాయితీగా ఉన్నాయి. అందుకే మీ విశే్లషణలంటే మాకిష్టం. తన సలహాదార్లు రాసిచ్చినవి చెప్పడమే తప్ప రాహుల్‌కేమీ తెలియదు అనే చెప్పాలి. మోదీ దుస్తులు 15 లక్షలనడం అబద్ధం. తను చిరిగిన ఖాదీ వస్త్రాలే ధరిస్తాననడమూ అబద్ధమే. తన తల్లి కట్టుకునే చీర ఖరీదు ఆయనకు తెలుసా? అందుకే ఆయనేం చెప్పినా ఎవరూ పట్టించుకోరు.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
మోదీ వ్యక్తిత్వం
ఈ వారం కవర్‌స్టోరీలో ‘జనమేజయుడు’ నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, రాజకీయ ప్రస్థానం గురించిన విశే్లషణ అద్భుతంగా ఉంది. కార్పొరేట్లు, వ్యాపార వేత్తలే రాజకీయాలను శాసిస్తారన్న అపప్రధను మోదీ ఒంటిచేత్తో సునాయాసంగా చెరిపేశారు. అధికారం కోసం కొన్ని వర్గాలు, ప్రాంతాలను ప్రలోభపెడుతూ, కాలం చెల్లిన సిద్ధాంతాల ముసుగులో అభివృద్ధి పేరిట అరచేతిలో వైకుంఠం చూపే నేతలు కోకొల్లలుగా ఉన్న కాలంలో సామాన్యుల ఆకాంక్షలు, ఆక్రోశాలు, ఆవేశాలు ప్రతిఫలించే నేత దేశాధినేత కావడం భారతీయుల అదృష్టం. గత రెండున్నర సంవత్సరాలలో తీసుకున్న ప్రతీ నిర్ణయం ప్రజాసంక్షేమం, దేశాభివృద్ధిలో తీసుకున్నవే కావడం, ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధి పాలిట పెను సవాలుగా పరిణమించిన అవినీతిని నిరోధించడంలో అద్భుత విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ నూట ఇరవై కోట్ల భారతీయుల పాలిట ఆశాదీపం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)