మాతో - మీరు

మాతో-మీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుకు వెలుగు?
తెలుగు నుడికారంలో మమకారం ఎంత ఉందో వెటకారపు ఘాటూ అంతే ఉంటుంది. మన భాషకే పరిమితమైన ‘అవధానం’లో లభించే భాషా మాధుర్యం, ఆనందం ఆస్వాదించి అనుభవిస్తే గానీ తెలియదు. ఆంగ్ల భాషా వ్యామోహంలో చిక్కుకుపోయి అమ్మ భాష చిన్నబోతున్న కాలమిది. గ్రాంథిక భాషా ప్రవాహంలో చిక్కుబడిపోయిన తెలుగు నేలను వ్యావహారిక భాషా రాజ్యంగా మార్చిన గిడుగు వంటి ఉద్దండులు ఉదయిస్తే గానీ మళ్లీ తెలుగు వెలుగు సాధ్యం కాదు. చక్కటి వ్యాసాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు.
-యర్రమోతు ధర్మరాజు (్ధవళేశ్వరం)
వానాకాలంలో...
‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు పాఠకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ వారం ప్రచురించిన ‘వానాకాలంలో ఏం తినాలి?’ అంశం బాగుంది. వానాకాలంలో ఆహార పదార్థాల విషయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ కాలంలో జీర్ణశక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాత వ్యాధులైన కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, పక్షవాతం, ఎలర్జీ వ్యాధులు, ముఖ్యంగా జలుబు, ఉబ్బసం వగైరా ఇవన్నీ వానాకాలంలో బయటపడుతుంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే.. వానాకాలం నుంచీ రక్షణ కల్పించుకోవచ్చు. ఇక ‘అమతృవర్షిణి’ గురించి ఎంత చెప్పినా తనివితీరదు. కుంతీకుమారి కావ్యానికి రచనాకృతి సమకూర్చిన కరుణశ్రీ, స్వరాలంకారం చేసిన ఘంటసాల చిరంజీవులే.
-డా.శివభూషణం (కర్నూలు)
సుస్వర భూషణం
సమాజంలోని మనుషుల మనస్తత్వాలను బాగా గ్రహించగలిగే తెలివితేటలు లేకపోతే మన మనుగడ కూడా కష్టం. ఎవరినీ శాసించలేం. నా మాటే చెల్లాలనుకోవడం అవివేకం. మనస్సును అదుపు చేసుకుంటూ ఎక్కడ ఏది ప్రస్తుతమో తెలిసి మసలుకుంటూ ఉండాలనే త్యాగయ్య సందేశం ఎన్నో కీర్తనల్లో కనిపిస్తుంది మనకు. మన చుట్టూ తిరిగే మనుషుల మనస్తత్వాలను గమనించి నడవాలంటాడు త్యాగరాజు. ఓ మనిషి ఉన్నట్లు మరో మనిషి ఉండడు. ఒక మొక్క వున్నట్లు మరో మొక్క వుండదు - ఇలాంటి అంశాల నెన్నింటినో ప్రస్తావిస్తూ మహానుభావులైన ఎందరో గాయక రత్నాలను మదిలో మెదిలేట్టు చేస్తున్న ఈ శీర్షిక మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది.
-సిహెచ్.రామారావు (గొల్లప్రోలు)
కథ
ఆదివారం అనుబంధంలో ప్రచురించిన కథ ‘సిసిటివి కెమెరా’ బాగుంది. ‘మనిషి మెదడు సిసిటివి కెమెరా లాంటిది. విశేషాల్ని నిక్షిప్తం చేసి, పదేపదే వాటిని పరిశీలించడానికి అవకాశమిస్తుంది. విశేషాల్ని విశే్లషించడానికి మెదడుని సిసిటివి కెమెరాలా ఉపయోగించుకోగల శక్తి ఉన్నవాడే గొప్ప రచయిత కాగల్గుతాడు’ అన్న మాటలు ఆకట్టుకొన్నాయి. అలాగే ‘వినదగు’ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ‘సండే గీత’లో మనం సమాజానికి ఏం చేయడానికి పుట్టాం అనే అంశం ప్రతి మనిషిని ఆలోచింపజేసేదిగా ఉంది. తరగని నిధి, గాయపడ్డ పిచ్చుక కథానికలు చాలా బాగున్నాయి. ‘మీకు తెలుసా?’ శీర్షిక ద్వారా పిల్లలకు తెలీని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు.
-యం.్భస్కర్ (గాంధారి)
క్రైం కథ
ఆదివారం అనుబంధంలో ఏ శీర్షికకు ఆ శీర్షిక హైలైట్. ముఖ్యంగా ‘క్రైం’ కథ. కథ ఎంతో సాఫీగా సాగిపోతున్నట్టు అనిపించినా.. క్లైమాక్స్‌లో మంచి థ్రిల్‌ని అందించే విధంగా ఉంటాయి. మల్లాది గార్కి కృతజ్ఞతలు. ‘మాయ’ కథ చదువుతుంటే మాకు తెలీకుండానే అతీంద్రియ శక్తుల వైపు మళ్లినట్టనిపించింది.
-ఎం.సోమయాజులు (ఆత్మకూరు)
నిశ్శబ్దం
వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శీర్షిక ‘కథాసాగరం’. ఈ శీర్షికన వస్తున్న కథలు చదువుతూ ఆధ్యాత్మిక లోకాల్లోకి వెళ్లిపోతున్నాం. ‘నిశ్శబ్దం’ కథ బాగుంది. ‘వాళ్లలో అనంత పరివర్తన జరిగింది. వాళ్లు చెట్ల మధ్య ఉన్నారు. చెట్లతో ఉన్నారు. ఆకాశంలో ఉన్నారు. వాళ్లిక్కడ లేరు. కేవలం నిశ్శబ్దమే వ్యాపించి ఉంది. అందువల్లనే పక్షులు కూడా ఆ నిశ్శబ్ద ప్రభావానికి లోబడి ఉన్నాయి. నువ్వు అరణ్యాలు చూశావు. కానీ ఈ నిశ్శబ్దం నీ అనుభవంలో లేనిది. పదివేల మనసుల నిశ్శబ్దం ఇక్కడ ఉంది. అది పరిసరాల్ని కూడా ప్రభావితం చేస్తుంది’ అన్న మాటలు మా హృదయాల్లో నాటుకున్నాయి. అలాగే ‘రామాయణం’ ఈ విధంగానైనా పిల్లలు చేరుతుందన్న నమ్మకం కలుగుతోంది.
-వి.మార్కండేయులు (విశాఖ)
లోకం తీరు
చక్కగా చెరువులలో ఇళ్లు కట్టుకొని వర్షం నీటిలో ఇళ్లు మునిగిపోయాయని గోలపెట్టేవారిని చూసి జాలిపడాలా? కోపగించుకోవాలా? ఇక- మాత్ర వేసి నీటిని పెట్రోలుగా మార్చి మాయమైన మనిషి గురించి నమ్మండి ఇది నిజం అన్నారు. మన దేశంలో కూడా రామర్ అనే తమిళుడు ఆకులతో పెట్రోలు చేసి మాయమవలేదు గాని జైలు పాలయ్యాడు. తర్వాత ఏమయిందో తెలీదు. నడుము నొప్పికి కారణాలు, నివారణ చక్కగా వివరించారు ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికలో. ఉపయుక్తంగా ఉంది.
-ఆర్.శాంతిసమీర (వాకలపూడి)
ఆలోచనలే పెట్టుబడి
ఆలోచనలే పెట్టుబడిగా పనిచేయడంలోను చేయించడంలోను, కలలు కని వాటిని సాకారం చేసుకోవడంలోనూ దిట్ట అయిన అమెజాన్ అధినేత జెఫ్ బెజొస్, బిల్‌గేట్స్‌ని వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత ధనికునిగా కొద్దికాలమే అయినా రికార్డు సాధించడం శ్లాఘనీయం. మా చిన్నప్పుడు బాల, బాలమిత్ర, చందమామ లాంటి ఎన్నో పిల్లల పత్రికలుండేవి. అవన్నీ కొడిగట్టాయి. పిల్లలు కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. విభిన్న లక్ష్యంతో వీధి బాలల కోసం బాలురే నిర్వహించే బాలక్‌నామా పత్రిక రావడం శుభసూచనే.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)

మాతో-మీరు