మాతో - మీరు

మీకు తెలుసా? (మాతో-మీరు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీకు తెలుసా?’ అని అడిగి మరీ చెప్పిన గొడుగు కథ, చదరంగం ఉండే పుచ్చకాయలు, చేతి రుమాళ్ల విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని మరో కోణంలో పరిశీలించి ‘సండే గీత’లో బాగా చెప్పారు. నిజమే. కోపంవల్ల అమూల్య కాలం వృధా అయి పని నుంచి దృష్టి మరలుతుంది. ఎవరికి మొర పెట్టుకున్నా చూస్తాము అనే అంటారు అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కామరాజ నాడార్ జాతీయ నాయకుడిగా ఎదిగాక ఏ సమస్య చెప్పినా ‘పార్కలాం’ (చూస్తాం) అనేవారట. పార్కలాం పాలిటిక్స్ అన్న కొత్త మాట పుట్టింది.
-కె.సాహిత్య దీప్తి (రమణయ్యపేట)

సండే గీత
‘కోపం’ గురించి ‘సండే గీత’లో చక్కగా వివరించారు. ఒక్క నిమిషం కోపంగా వుంటే, అరవై నిమిషాలు వృధా అవుతాయని చక్కగా చెప్పారు. అందరికీ చాలా అవసరమైన విషయాన్ని అందించారు. ‘ఓ చిన్న మాట’లో టెలిగ్రాం గూర్చి చక్కటి విషయాలు తెలియజేశారు. ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇటీవలి కొన్ని సంవత్సరాల వరకు ఈ టెలిగ్రాంల ద్వారా అందజేసేవారు. ఇప్పుడా వ్యవస్థ కనుమరుగై కొత్త సౌకర్యాలు పుట్టుకొచ్చాయి. ‘ఈ వారం స్పెషల్’లో ‘ఎండ ప్రచండం’ గూర్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

క్రైం కథ
క్రైం కథ బాగున్నప్పటికీ తెలుగు సీరియల్‌లాగ అనిపించింది. భార్య భర్తని చంపాలనుకోవడం, భర్త భార్యని! ఆ కథలోనే చెప్పినట్టు ప్రపంచంలోని ప్రతి మనిషి వౌలికంగా ఒకే విధంగా ఉండి ఒకే విధంగా ఆలోచిస్తాడు. మంచి మీద చెడ్డ వారి విమర్శ ఎక్కువకాలం కొనసాగలేదని, ఆగిపోతుందని ‘మల్లాది’ వారు స్ఫూర్తి కథలో బాగా చెప్పారు. రోబో కప్ పేరిట రోబోల చేత సాకర్ ఆడించడం గురించి చదివినప్పుడు మరో విషయం జ్ఞాపకం వచ్చింది. చైనాలో కొన్ని హోటళ్లలో రోబో వెయిటర్స్‌ని నియమించగా అవి ఆర్డర్లు తీసుకొని ఆహారం అందించేటప్పుడు తప్పులు జరిగి పదార్థాలు వొలికిపోతున్నాయట. వాళ్లు రోబో వెయిటర్లను ఉపసంహరించారట. రోబో సాకర్ కూడా అలానే రద్దు కావచ్చు.
-కె.హితీష్ (ఆర్.పేట, తూ.గో.జిల్లా)

లోకాభిరామమ్
గోపాలంగారి ‘అనంతాంతం’ అమందానందం కలిగించింది. అలాగే కాజల్ లాంటి వారు గ్లామర్‌డోస్ పెంచి చూపించేస్తే ఇక చూడడానికేం మిగులుతుంది! ‘ఓ చిన్న మాట’గా టెలిగ్రాం అంతమైన దినం ఆసక్తికరంగా చెప్పారు. అయితే తెలుగులో టెలిగ్రాంలు వచ్చేవా? అది ఒక విధంగా జరిగి ఉంటుంది. ఆ రోజుల్లో పోస్ట్ఫాసుల్లో గ్రీటింగ్ టెలిగ్రాం అన్ని రంగుల్లో ముద్రించిన కాగితంతోపాటు కవర్లు అమ్మేవారు. కాగితం మీద శుభాకాంక్షలు రాసి ఆ కవరులో పెట్టి స్టాంపు లంటించి మామూలు కవరులాగా పోస్ట్‌డబ్బాలో పడేస్తే అడ్రసుదారుకి అందజేసేవారు. ఆ విధంగా తెలుగు టెలిగ్రాం వచ్చి ఉంటుంది!
-ఎ.చైతన్య (వాకలపూడి)

మధురస్మృతులు
‘ఓ చిన్న మాట’లో టెలిగ్రాం కథ చదువుతూంటే గతంలోనికి జారుకొని ఆ మధుర స్మృతులతో ప్రయాణం చేశాం. మంచి, చెడు ఎలాంటి కబురునైనా క్షేమంగా, సురక్షితంగా, సకాలంలో గమ్యాన్ని చేర్చి కోట్లాది భారతీయులకు అపురూప నేస్తంగా మారిన టెలిగ్రాం ఇక లేదంటే చాలా బాధ కలుగుతోంది. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా భారతీయులతో టెలిగ్రాం పెనవేసుకున్న బంధం మరువలేనిది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)

గీతాసారం
‘గీతాసారం’ ఎంపిక శ్రేష్ఠం. ముగింపు ప్రశంసనీయం. భగవద్గీత ఉండగా దుఃఖ సముద్రాన్ని సంతోషంగా ఈదటం ఎలా పుస్తకం రాయాల్సిన అవసరం లేదన్న జ్ఞానోదయం కావడం.. అద్భుత వాక్యం ఆకట్టుకొంది.
-కృష్ణ మాధవరపు (కాకినాడ)

కథ
మొదటి బహుమతి కథ ‘గీతాసారం’ మొదలు, ముగింపు - భాష బాగున్నాయి. కానీ ఇతివృత్తమే పేలవంగా ఉందనిపించింది. విడాకులు, ఆత్మహత్యలతో ముగిసిన కథ మాకిచ్చే స్ఫూర్తి ఏమిటి? పైగా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఫలితం ఆశించకుండా అనేది విషాదంలో పడ్డ అర్జునునికి కృష్ణుడు ఇచ్చిన గీత యొక్క సారం. ఎన్నో ఇతర విషయాలు ఉన్నప్పటికీ గీతాసారం ఇదే! కానీ కథలో ఇంకేదో చెప్పారు.
-కాశీ అన్నపూర్ణ (ఉయ్యూరు)

నవరసాలు
ఏమని వర్ణించగలం? ఎంతని పొగడగలం? ఎన్నో వేల పాటలు గత ఐదు దశాబ్దాలకు పైగా, ఎన్నో భాషలలో, ముఖ్యంగా మన లెస్స అయిన మాతృభాష తెలుగులో నవరసాలొలికించే ఎన్నో మధురమైన, స్వరబద్ధమైన పాటలు ఆలపించి పండిత పామరులను సైతం మురిపించి, మైమరపించిన గానకోకిల సుశీల తన జన్మసార్థకం చేసుకుని, శ్రోతల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మహనీయురాలు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు పరిచయం చేసినా, ఇతర దురంధరులైన సాలూరి రాజేశ్వరరావు, మహదేవన్, విశ్వనాథన్, ఘంటసాల వంటి వారి పర్యవేక్షణలో కళకళలతో తళతళలతో మెరుగులు దిద్దుకున్న అదృష్టవంతురాలు. ఆమె ఘంటసాలతో డ్యూయెట్లు, సోలోగా పాడినవి ఎప్పటికీ అజరామరాలే.
-ఎన్.పద్మావతి (హైదరాబాద్)