మాతో - మీరు

తెలుగు వెలగాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషా వికాసానికి, గ్రంథాలయాల విస్తరణకు పాటుపడిన గిడుగు రామ్మూర్తి లాంటి వారి జయంతులకు, ఏటా జరుపుకునే తెలుగు మహాసభలలోనూ, మధ్యమధ్యలో తెలుగు భాషా పునరుద్ధరణకు సభలు, సమావేశాలు నిర్వహించడమే కాని వాస్తవంగా మన పిల్లలకు తెలుగు బోధించే విద్యాలయాలు ఎన్ని ఉన్నాయి? తెలుగు మాధ్యమంలో చదవడానికి చదివించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అంతరించిపోయే అనేక భాషల్లో తెలుగు లేకపోవడం గుడ్డిలోమెల్ల. ఆంగ్ల భాషకన్నా అతి పురాతనమైన మన తెలుగు భాషకు విలువ, గౌరవం కరువవడానికి మన అశ్రద్ధే కారణం. దురదృష్టం కూడా. మరేం చేయాలి? అన్ని విద్యాలయాల్లో డిగ్రీ వరకూ తెలుగుకు ఒక సబ్జెక్ట్‌లో పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలి. కేవలం ఉపన్యాసాలు, ప్రవచనాలు, ప్రకటనలు చేయడంవల్ల తెలుగు వెలిగిపోతుందనుకోవడం పొరపాటే అవుతుంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఆనందాన్నిచ్చాయి
ఆశ్చర్యంకన్నా అద్భుతం అంటూ ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు చెప్పిన విషయాలు ఆనందాన్నిచ్చాయి. డావించి కోడ్ గురించి ఒక ముఖ్య విషయం. లాస్ట్ సప్పర్ చిత్రంలో రంగుల్లో కప్పిపుచ్చిన మేరీ మగ్దలీనా నిజానికి యేసుక్రీస్తు భార్య అనీ, ఆయనకు పుత్రులు కూడా ఉన్నారని డావించి చెప్పిన విషయం సంచలనం రేపాయి. నిరశన వెల్లువెత్తాయి. యేసు అవివాహితుడన్న ఇమేజ్ సృష్టించారని డావించి ఆరోపణ. ఆంగ్లం పేరులు రాసేదొక విధంగా, చదివేది మరో విధంగా. పినషే, షాన్, కోనరీ, డావించి అనే పలికే పదాల్ని పినోచెట్, సీన్‌కోనర్, డావిన్సీ అని రాస్తూంటారు. ఇలాగే చాలా పదాలు దశాబ్దాల క్రితం వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో వార్తల్లో పుంజాబ్, రాజహ్‌ముండ్రి, కుడప్పా, కుర్నూల్ అని వినిపించేవి! ఆజ్ఞానమే ఆనందం!
-కె.హితీష్ (రమణయ్యపేట)
నమ్మకం
ప్రతి విషయాన్ని ఆశావహ దృక్పథంతో చూడాలి. అతి విశ్వాసం వేరు. అతి నమ్మకం వేరు. అతి నమ్మకం వల్ల నష్టం ఉండదు. లాభం లభిస్తుంది అన్న ‘సండే గీత’ సిద్ధాంతపరంగా నిజమే కాని ఇతరుల్ని అతిగా నమ్మి చెడిన వారెందరో కనిపిస్తారు. అగ్ని పర్వతం మీద పిడుగు పడి పర్వతం విస్ఫోటనం చెందిన ఫొటో అద్భుతంగా ఉంది. అక్షరాలోచనల్లో ‘వందేమాతరం’ కవిత, ముఖ్యంగా దానిలోని చివరి పంక్తులు ‘తరాలు మారినా, యుగాలు మారినా మన భారతావనిలో అణువణువూ వినిపించే అమృతగానమే వందేమాతరం’ మాకు బాగా నచ్చాయి.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
ఆత్మవిశ్వాసం
‘సండే గీత’లో ‘ఎక్కువ నమ్మకం’ గురించి చక్కగా వివరించారు. నమ్మకం వేరు. ఆత్మవిశ్వాసం వేరు అని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ‘ఓ చిన్న మాట’లో ‘జీవిత చరమాంకం’ లో మనిషి మరణం ఆసన్నమయ్యేంతవరకు వేచి చూడకుండగ ప్రతిరోజూను కానుకగా ఎందుకు పరిగణించకూడదు. మనిషిలోని మంచి గుణాలని ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటూ మంచి సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
గిడుగు
గ్రాంథిక భాషను, తెలుగును ‘జన భాష’గా విస్తృతం చేసేందుకు పోరాటం చేసిన అక్షర గొడుగు అగ్గిపిడుగు తెలుగు వెలుగు అడుగు గిడుగు.. పూర్తి సమాచారంతో కూడిన కవర్‌స్టోరీ ‘తెలుగుకు వెలుగేది?’ సూపర్బ్. అక్షరాలోచనల్లో నానీలు అలరించాయి.
-ఈవేమన (శ్రీకాకుళం)
జ్ఞానోదయం
చాలామందికి జీవిత చరమాంకంలో జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. అప్పుడు చేసేదేమీ లేక చాలా బాధపడుతుంటారు. ఆ జ్ఞానోదయం ముందే కలిగితే ఎంతో ఆనందంగా ఉంటుందన్న ఓ చిన్న మాటలో ఎంతో బరువుంది. మూడు నుంచి ఏడు నెలలలోపు బిడ్డలకు ఈత నేర్పే పాఠశాల, బీరుకాయల అడవి ఆకట్టుకున్నాయి. ఆశ్చర్యపరిచాయి. అక్షరానలోచనల్లో నానీలు బాగున్నాయి.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
ఆశ్చర్యం
డేన్ స్టేప్లర్ తన భార్యని చంపి ఈగిల్ పాయింట్ నుంచి కిందకు పడదోసి ఆత్మహత్యలా చిత్రించడం, ఆ భార్య ఆత్మ తాత్కాలికంగా మరో స్ర్తి శరీరంలో ప్రవేశించి తనను హత్య చేసిన భర్తను చట్టానికి పట్టివ్వడం ఆశ్చర్యంగా ఉంది. అచ్చం భారతీయ కథలా ఉంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మల కథలన్నీ ఒకేలాగ ఉంటాయేమో! ఒంటి చేతితోనే జుట్టు కత్తిరించే క్షురక వృత్తిలో అప్పుడప్పుడు నోటిని కూడా ఉపయోగిస్తూ కీర్తి ప్రతిష్టలార్జించిన అన్సర్ అహ్మద్ కథ స్ఫూర్తిదాయకంగా ఉంది. ‘విజ్ఞానం’ శీర్షికలో కృత్రిమ మేథ గురించి చెప్పిన అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయి. నిద్ర గురించి మాకు తెలీని ఎన్నో విషయాలు చెప్పారు పూర్ణచంద్‌గారు.
-ఆర్.శాంతి సమీర (వాకలపూడి)
మమకారం
తెలుగు నుడికారంలో మమకారం ఎంతుందో వెటకారమూ అంతే ఉంది అనడంలో ఎంతో సత్యం ఉంది. సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలూ మాతృభాష ప్రాముఖ్యం, మాతృభాషలో బోధన గురించి ఎంతగా మొత్తుకుంటున్నా ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని పట్టడం లేదు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే పద్ధతులు అనుసరిస్తున్నారు. తెలుగు మీడియం చదువులు ఎందుకూ పనికిరావన్న భ్రమను వ్యాపింపజేస్తూ విద్యార్థులు తెలుగులో మాట్లాడితే శిక్షిస్తున్నాయి. ఈ భావజాలాన్ని అరికట్టాలి. కవర్‌స్టోరీ ‘తెలుగుకు వెలుగేది’లో ముఖ్యాంశాలు బాగా వివరించారు. క్రైం కథ ఉత్కంఠభరితంగా సాగుతూ బాగుంది. నరకం అనే మాట ఉపయోగించకుండా రచయిత కథను బాగా నడిపారు. కథ చదువుతుంటే సుందరమైన కలలు చూపించి చెత్తసరుకు అంటకట్టే కార్పొరేట్ సంస్థలు జ్ఞాపకం వచ్చాయి.
-ఆర్.మరుదకాశి (కరప)