మాతో - మీరు

చదివింపజేసే శీర్షికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ రెండూ సందేశాత్మక సారాంశాలతో ఆకట్టుకొంటున్నాయి. అక్షరాలోచన కవితలన్నీ అభ్యుదయ భావపరంపరలో కొనసాగాయి. కవర్‌స్టోరీ ‘మధుమేహం’ గురించి విశే్లషణాత్మకంగా సదవగాహన కలిగింపజేసి, ఎన్నో విలువైన అంశాలను స్పృశించాయి. కనె్నగంటి అనసూయ గారి ‘నడిచి వచ్చిన దారి’ కథ ఆసక్తికరంగ చదివింపజేసింది. రాత్రిపూట ఉద్యోగరీత్యా మేల్కొనేవారి కోసం డా.జి.వి.పూర్ణచంద్‌గారిచ్చిన సలహాలు సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కుంచెం తేడాగా..తోపాటు అర్జున్ కార్టూన్లు సైతం మమ్మానందింపజేశాయి.
-నేమాన సుభాష్‌చంద్రబోస్ (విశాఖపట్నం)
మనకి పట్టదు
గోపాలంగారు చెప్పినట్లు చారిత్రక నవలలు ఎంత వాస్తవమో, ఎంత కల్పితమో చెప్పలేకపోయినా ఆంగ్లంలో చాలానే ఉన్నా, మనకు గతం గురించి పట్టదు. మన చరిత్ర గురించి పట్టదు. మన తాతలు ఏం చేసినదీ తెలియదన్నది నిజమే. ఎందుకిలా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. నిజమే. ఇద్దరు పోలీసుల్ని చంపి తప్పించుకున్న ఖైదీ రాబర్ట్ గృహిణి జూలియా ఇంట చేరి ఆమెని బెదిరించగా ఆమె కొడుకు చెట్టు మీది ట్రీహౌస్‌లోకి వెళ్లగా రాబర్ట్ కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నంలో అతడు ఎక్కిన కొమ్మ విరిగింది. మరో కొమ్మ అతని గొంతుని చుట్టబెట్టి బిగించి అతనిని చంపి ధర్మవృక్షం అన్న పేరును సార్థకం చేసుకోవడం నమ్మలేని నిజమే!
-ఎ.చైతన్య (వాకలపూడి)
నాయకుడు
గ్రంథాలలో నాయకుడెలా ఉండాలో వందల నిర్వచనాలు పేర్కొనబడ్డాయి. వాసిలి వసంతకుమార్ గారు మహాభారత గాథను, కృష్ణ గీతను ఉటంకిస్తూ పేర్కొన్న నాయకత్వ లక్షణాలన్నీ మేనేజ్‌మెంట్ పుస్తకాలలో రకరకాలుగా రాయబడ్డాయి. వీటిని సందర్భాన్ని బట్టి ప్రయోగిస్తూంటారు. లేదా కొత్త పద్ధతులను కనిపెడుతూంటారు. నెహ్రు, శాస్ర్తీ, ఇందిర, రాజీవ్ నుంచి నేటి మోదీ వరకు నాయకత్వాన్ని అన్ని కోణాలలో విస్తృతపరిచినవారే. వారి దృక్పథం వేరు, దారులు వేరు అయినా గమ్యం ఒక్కటే. అదే ప్రజా సంక్షేమం. కృష్ణ భగవానుడి దారి మరో రకంగా ఉన్నా అది ధర్మ సంస్థాపనకే దారి తీసింది. మన ప్రభుత్వాలు కూడా న్యాయసూత్రాల ననుసరించి, లేదా మార్పులు చేసయినా నేరస్తులను కఠినంగా శిక్షించకపోతే వారికి మరింత స్వేచ్ఛనిచ్చినట్లవుతుంది.
-లక్ష్మీరామం (హైదరాబాద్)
హెచ్చరిక
మన దేశంలో బాబాలు లాగానే యూరోపియన్ దేశాల్లో జిప్సీలు భవిష్యత్తుని చెప్తుంటారు. తన కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేస్తాడని ముందుగానే తెలుసుకున్న జిప్సీ మేడంలోలా తన కుమారుని ఆమెకు దూరంగా ఉండమని హెచ్చరించింది. కాని పరిస్థితులు అలా తోసుకు వచ్చి ఆ కొడుకు వౌడీనే కాక తల్లినీ చంపేస్తాడు. కొడుకు వౌడీని చంపేస్తాడని తెలుసుకోగలిగిన లోలా తన మరణాన్ని తెలుసుకోలేక పోయిందా అన్నది కోటి రూపాయల ప్రశ్న. వసంత శీతాకాల సమయంలోని వాతావరణం అందరికీ చిరాకు కలిగించినా ఆ కాలంలో ప్రసవించిన బాలింతలకు మాత్రం ఎంతో మంచిదని తెలిసి ఆశ్చర్యపోయాం.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
ప్రశంసనీయం
ఆదివారం అనుబంధం విందు భోజనాన్ని తలపించింది. ‘అమృతవర్షిణి’లో మన వెంట వచ్చేది సంస్కారమే.. కానీ సంసారం కాదనే నగ్న సత్యాన్ని విడమరిచి చెప్పిన తీరు ప్రశంసనీయం. సంసార బంధాలు తెంచుకో అనే సందేశాన్ని అందించింది. ఆడే బొమ్మలు వీరు - ఆడించే సూత్రం నీవు - మనిషి జీవితంలోని వివిధ దశలను పేర్కొన్న తీరు, ఆస్తిపాస్తులు, ఆడంబరాలు, రావేవీ కడవరకు అనే కఠిన నిజాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన విధం.. చదివిన చదువరి వైరాగ్యానికి లోనుకాక తప్పదు. ‘రాజమార్గం’.. పాలకుల ప్రజల కష్టాలు, మారు వేషంలో వెళ్లి తెలుసుకునే వారని, దాని ఆధారంగా తగిన నివారణ చర్యలు చేపట్టేవారని తెలియజేసింది. వార్తాపత్రికలు ఇప్పుడా పని చేస్తున్నాయి. వ్యక్తిత్వం, వ్యక్తిమత్వంగా పరిణమించాలంటే దేహ తత్వంతో మురిసిపోక ఆత్మ తత్వాన్ని అందిపుచ్చుకోవాలని, అదే ఆత్మయోగమని ‘మృత్యుభయం’ వ్యాసం వివరించింది.
-పంజాల నరసయ్య (హైదరాబాద్)
కస్తూరి
‘అమృతవర్షిణి’ శీర్షికన మల్లాది వారు అందిస్తున్న వ్యాసాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. కస్తూరి మృగం మస్తకంలో ఉండదు కస్తూరి స్రవించే గ్రంథి. బొడ్డు దగ్గర ఉంటుంది. అందుకనే దానికి మృగనాభి అన్న మరో పేరు. ఉచ్చారణ సాధు ప్రయోగం. ఉచ్ఛారణ అని మూడుచోట్లా అచ్చు తప్పేనా? నా వద్ద శూలమంగళం వైద్యనాథ అయ్యర్ హరికథ గ్రామఫోన్ రికార్డు ఒకటి ఉన్నది. 1920 ప్రాంతాలలో రికార్డు చేసినదనుకొంటాను.
-వి.ఆర్.రంగారావు (మద్రాసు)
భావాల స్పర్థ
రూల్ ఆఫ్ లా గురించి ఉపన్యాసాలు బాగానే ఉంటాయి. కాని ప్రాక్టికల్‌గా లా అండ్ ఆర్డర్‌ని పర్యవేక్షించేటప్పుడు రూల్స్ అడ్డుపడతాయని కొందరి అనుభవం. ఈ రెండు భావాల మధ్య స్పర్థను ‘సండే గీత’లో చక్కగా వివరించారు. థాయ్‌లాండ్ రాజు వర్థంతి సందర్భంగా తెల్ల ఏనుగుల నివాళి ఫొటో, కొత్త శోభను సంతరించుకొన్న ఏథెన్స్‌లోని శిథిలాల ఫొటో అలరించాయి. కావడి పెట్టె జ్ఞాపక చిహ్నం ఎలా అయిందో వివరించిన కవిత బాగుంది. వెయ్యికోట్ల వెర్రి కవిత కూడా భేష్. ‘కుంచెం’ తేడాగా కార్టూన్లు నవ్వించాయి.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)