మాతో - మీరు

బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో మాయ జరిగి తమ జీవితం ఆనందంగా మారుతుందని ఆశిస్తూ బాధ్యతలు విస్మరిస్తాం. కాని మనం ఏమీ చేయకుండా ఏమీ రాదు. ఏమీ సాధించలేమన్న బృహత్తర సందేశం ఇచ్చిన ‘ఓ చిన్న మాట’ అద్భుతంగా ఉంది. మతాలు, అభిమతాలు వేరయినా మానవులంతా ఒక్కటే. మానవత్వం అనే పరిమళం వ్యాపింపచేద్దాం అన్న కానె్సప్ట్‌తో రాసిన ‘పువ్వులు’ కవిత మాకు బాగా నచ్చింది. లోకం కోసం, శ్రోతల కోసం కాక ఆత్మోద్ధరణ కోసం పాడుకున్న మహనీయుడు త్యాగరాజు గురించి అమృతవర్షిణిలో మల్లాది సూరిబాబుగారు చెప్పిన విషయాలు అలరించాయి.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)
ఊహించలేం
క్రైం కథ ఎవరూ ఊహించని విధంగా ఉత్కంఠభరితంగా ఉంది. ఛార్లెస్ 12 ఏళ్ల కుర్రాడని, తన తల్లిని ప్రేమిస్తున్న వాడిని చంపేశాడనీ ఎవరూ ఊహించలేరు. చివరకు పోలీసు కూడా ఊహించలేక పోవడం విచిత్రమే. హిమగిరి సొగసులు ఆహ్లాదభరితంగా చెప్పారు. అక్కడి ఆలయాల గురించి చదువుతుంటే చూస్తున్న అనుభూతి కలిగింది. ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికలో కందిపప్పు తగినంతగా తింటే స్థూలకాయం తగ్గుతుందని తెలిసి ఆశ్చర్యపోయాం. జీవశక్తి పెరగడానికి పప్పు ఎలా ఉపయోగపడుతుందో బాగా చెప్పారు. దంత ఆరోగ్యంపై కోతుల మక్కువ గురించి చదివి విస్తుపోయాం.
-శాండోప్రచండ్ (శ్రీనగర్)
కొత్త సొబగులు
అభివృద్ధికి, అధునాతన సాంకేతికతకు, సౌకర్యాలకు, సోయగానికీ చిహ్నంగా భాగ్యనగరికి కొత్త సొబగులు తెచ్చే మెట్రో రైలు గురించి కవర్‌స్టోరీలో చక్కగా వివరించారు. అయితే మెట్రో రైలు గురూ శ్రీ్ధరనే ప్రపంచంలో ఏవో కొన్ని మెట్రోలు తప్ప మిగిలినవన్నీ నష్టాల్లో నడుస్తున్నాయని చెప్పాడు. నష్టాలు తగ్గించుకోడానికి ఢిల్లీ మెట్రో చార్జీలు పెంచగా ఆందోళన ప్రారంభమైంది. అలాగే మెట్రో స్టేషన్లలో కల్పించే సౌకర్యాలకు ఫీజులు పెంచితే ఇబ్బంది.. పెంచకపోతే నష్టం. అయినా మాకూ మెట్రో ఉందని హైదరాబాదీలు గర్వించవచ్చు.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
అలరించారు
సంగీత భిక్ష, సంగీత దానం, సంగీత బంధువులు, సంగీత అనుభూతులు అంటూ గోపాలంగారు వివరించిన ‘నిజమైన బంధువులు’ అలరించారు. చిన్న చీమ తలను పదివేల భాగాలు చేస్తే వాటిలో ఒక భాగం ఆత్మరూపం. ఇది మనసుకు అందేదే గాని కంటికి కనిపించేది కాదంటూ వాసిలి వసంతకుమార్ గారు వివరించిన ‘ఆదితత్త్వ యోగారూఢం’ విజ్ఞానదాయకంగా ఉంది. నమ్మండి ఇది నిజం అంటూ చెప్పే సృష్టి వైచిత్రాలను ఈ వారం మిస్ అయ్యాం. ఏనుగులు అద్దంలో తమ ముఖాలను గుర్తుపడతాయని, ఏనుగుల గుంపునకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాం.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
తమిళ అభిమానం
మల్లాది వారు ‘మాతృభాష కాకపోవుడం వలన కొందరు విద్వాంసుల గానంలో అక్కడక్కడ ఉచ్చారణ దోషాలు, భాష వలన సంక్రమించిన యాసతో సాహిత్యం అందులోని భావం శ్రోతలకు చేరదనే విమర్శ అలా ఉంచిత, దక్షిణాది విద్వాంసులదే.. అంటారు. వాస్తవానికి తమిళులు కచేరీలు చేస్తే, ఏమీ అర్థంకాదు. పైగా ప్రక్క వాయిద్యాల ఘోష ఎక్కువ. మరి సంగీతం ఎవరికి? విద్వాంసులకేనా? త్యాగయ్య స్వచ్ఛమైన తెలుగులో కీర్తనలు రచించారు. శ్రావ్యమైన సంగీతం అర్థవంతంగా, స్వచ్ఛమైన ఉచ్చారణతో, పాడితే పామరులు కూడా ఆనందింపగలరు. అందువలననే కదా! ఘంటసాల వారు అమర గాయకుడుగా కీర్తింపబడ్డారు. పామరులకు గమకాలు, సంగతులు, పల్లవి, అనుపల్లవి అర్థంకావు.
-వి.వి.రమణ (విజయవాడ)
వ్యాధి కాదు
మధుమేహం వ్యాధి కాదు. శరీరంలో పాంక్రియాస్ అనే గ్రంథి సమర్థవంతంగా పని చేయకపోవడమో, లేక అసలు పని చేయకపోవడం వల్ల ఇతర శరీర భాగాల మీద దుష్ప్రభావం పడి వ్యాధుల బారిన పడవలసి వస్తోంది. మధుమేహాన్ని మహమ్మారి, తేనెపూసిన కత్తి అనే నామకరణాలు చేసి భయపెడుతున్నారు. వయసుకు తగ్గ శారీరక శ్రమ, ఆహార నియమాలు, సరైన మందులతో నియంత్రణ చేసి ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. మధుమేహంతో దశాబ్దాలు హాయిగా జీవించినవారున్నారు. జీవిస్తున్నారు. రోడ్డుపక్క అమ్మే తిళ్లు, ఆధునిక సంప్రదాయ విరుద్ధమైన వంటలు మానాలి. ఒకే సిరంజని అనేకసార్లు వాడకూడదన్నారు. మరి ఎన్నిసార్లు వాడాలో తెలియజేసి నట్లయితే బాగుండేది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
తీపి కబురు
జియోగ్రాఫికల్ ఐడెంటిటీని వివరించి ఇంతకు ముందే ఆ గుర్తింపు పొందిన వ్యాపార వస్తువులతోపాటు కొత్తగా జాబితాలో చేరిన వాటిని విశదీకరించిన కవర్‌స్టోరీ ‘తీపి కబురు’ విజ్ఞానదాయకంగా ఉండటమేకాక మాకు తెలీని ఎన్నో విషయాలు తెలియజెప్పింది. అలాగే సత్యదేవుని ప్రసాదం, తాపేశ్వరం, మడతకాజా, కాకినాడ గొట్టం కాజాలు కూడా జిఐ గుర్తింపునకు అర్హమైనవే. అందుకు గట్టి కృషి జరగాలి. వ్యాయామం వల్ల ఆరోగ్యం కలుగుతుందని తెలుసు కాని మెదడుకు కూడా ఎంతో మేలు జరుగుతుందందని ఇప్పుడు తెలిసింది.
-ఎస్.కె.ఎన్. (తూర్పుగోదావరి జిల్లా)