మాతో - మీరు

కేన్స్ కళకళ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్స్ కళకళ...
సరికొత్త ఆలోచనలకు సెల్యులాయిడ్ రూపమిచ్చి.. జనం చేత సెహభాష్ అన్పించుకోవాలనుకోవడం కొందరికి ఇష్టం. సృజనకు పదునుపెట్టి, వెండితెరపై మనసు పెట్టి, అద్భుతాలు సృష్టించడం ఇంకొందరికి ఇష్టం. కళలు, సంస్కృతిని కాపాడి భావితరాలకు పరిచయం చేసేందుకు సినిమా ఓ ఆయుధమని, ఓ మంచి మాధ్యమమని నమ్మిన ఓ రాజకీయ నాయకుడు జీన్ జె కన్న కలల ప్రతిరూపం - నేటి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ అంటూ సాగిన ఈ వ్యాసం ఎన్నో విశేషాలను తెచ్చింది. సినిమా ఓ దృశ్యకావ్యం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి సినిమాలకు వేదిక అయిన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గురించిన సమగ్ర వ్యాసాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
లోకాభిరామమ్
ఈ శీర్షికన గోపాలంగారు అందిస్తున్న వ్యాస పరంపర ఎన్నో జ్ఞాపకాలను వెంట తెస్తున్నాయి. నిద్ర అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. నిద్ర కారణంగా శరీరం మరొకసారి కొత్తదవుతుంది. మెదడులో విషయాలు లైబ్రరీలో పుస్తకాలు సర్దినట్టు సర్దుకుంటాయి. కనుక ఎవరికి అవసరమయినంత కాలం వాళ్లు నిద్రపోవడమే మంచిది. ఈ అవసరం గురించి కూడా పరిశోధనలు జరిగాయి. పద్ధతులూ ఉన్నాయి. మొత్తానికి నిద్ర సుఖం కాదు. అవసరం అన్నది వాస్తవం. అలాగే ఓ చిన్న మాటలో పాస్‌వర్డ్ ‘సంతృప్తి’ అనడం చాలా బాగుంది. మనిషికి సంతృప్తి లేకపోతే ఎంత ఉన్నా దండుగేనని బాగా చెప్పారు. జనం మెచ్చిన రాణిగారి గురించి చాలా తెలుసుకున్నాం. ముఖ్యంగా రాణివాసమంటే విలాసవంతమైన జీవితం అని అందరూ అనుకునేట్టు ఉండదని ఈ వ్యాసం చెప్పింది. ‘పుణ్యఫలం’లో పూర్వజన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుందని చక్కగా తెలియజేశారు.
-డి.వి.తులసి (రామవరప్పాడు)
సంతృప్తి
పాస్‌వర్డ్‌ల అల్లిబిల్లి లోకంలో నా పాస్‌వర్డ్ ‘సంతృప్తి’ అనగలిగిన మహానుభావుడికి జోహార్లు! కబుర్లు ఖజానా గోపాలంగారు రెండు రైళ్లలో రెండు సినిమాల గురించి చెప్పిన కబుర్లు పాప్‌కార్న్ నమిలినంత బాగున్నాయి. నెహ్రూ - గాంధీ కుటుంబం ధర్మమా అని పరమ సెక్యులర్ విధానంలో కులాలు, మతాలు ప్రాతిపదికన ఉద్యోగాలే కాదు ప్రభుత్వ సెలవులు, అకాడెమీల అవార్డులు కూడా కోటాకు లోబడే ఉంటున్నాయి. ఆ కుటుంబం ఇప్పుడు అధికారంలో లేకున్నా ఆ ఫ్రేమ్‌ని చెదరగొట్టడం అంత సులభం కాదు. మైనారిటీలు, వామపక్షాలు, కాంగ్రెస్ నానా రభస చేస్తాయి.
-పి.శుభలక్ష్మి (కాకినాడ)
కామన్‌ఫండ్
రామలక్ష్మిగారి ‘కామన్ ఫండ్’ కథ బాగుంది. ఈ వారం ఎండలు మండిపోతున్నై అంటూ గోపాలంగారి వ్యాసం చాలా బాగుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.
-వై.ఎస్.లక్ష్మి (విజయవాడ)
వ్యక్తిత్వం
‘మీ వ్యక్తిత్వమే మీ అసలైన ఆస్తి’ వ్యాసం ఎంతో బాగుంది. బ్యాంక్‌లో డబ్బులాంటిది మన వ్యక్తిత్వం. బ్యాంక్ ఇచ్చే లోన్ లాంటిది కీర్తి. ఇంకా చెప్పుకోవాలంటే వ్యక్తిత్వం మహా వృక్షం లాంటిది. కీర్తి పుట్టగొడుగు లాంటిది... ఇలా వ్యక్తిత్వం గురించి అనేకానేక అంశాలను ప్రస్తావించారు. ఈ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
అలరించే శీర్షికలు
మెంతులతో స్వీట్లు, ఐస్‌క్రీంలు చేస్తారనీ, బ్లూహెరాన్ పక్షులు పెద్ద చేపల్ని నోటకరిచి మింగలేక చనిపోతూ ఉంటాయనీ తెలిసి ఆశ్చర్యపోయాం. ఓడ్కా మద్యం కాదు, ఔషధం కూడా అనడం సరికాదేమో. ఆ మధ్య రెడ్ వైన్ మంచిదే అన్న ప్రచారం జరిగినా ఈ మధ్య బ్రిటిష్ శాస్తవ్రేత్తలు అది హానికరమే అని తేల్చారు. వైన్‌లో ద్రాక్షరసం, బీర్‌లో బార్లీ ఉన్నంత మాత్రాన అవి మంచివి అనలేం. అవి కలిగించే మత్తు హానికరమే. అడుగులు వేస్తూనే ఉండాలని చదరంగం ద్వారా ‘సండే గీత’లో హితవు చెప్పడం బాగుంది. శరీరంలో ధాతువుల లోపాన్నిబట్టి మట్టి, సుద్ద లాంటివి తింటారు. మట్టిని వండి వడ్డించే రెస్టరెంట్లున్నాయంటే ఆశ్చర్యమే.
-కె.సుధీర్ (శ్రీనగరం)
జగమంత కుటుంబం
కుటుంబంలో అందరూ కలసి, హాయిగా గడపాల్సిన చోట హడావిడిగా, చిరాకుగా గడపటం తప్పడంలేదు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం, బాధ్యతలు పంచుకోవడం, మానసికంగా నేనున్నాననే భరోసా ఇవ్వడం వంటి లక్షణాలు కుటుంబ సభ్యులకు ఉపశమనాన్ని ఇచ్చే అంశాలు. ‘జగమంత కుటుంబం నాది’ - అన్న భావన అందరిలో పెరుగుతోంది. అలా అనుకోకపోతే - ‘ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ విషాద గీతం ఆలపించుకోక తప్పదు. చక్కటి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు. అలాగే ‘నమ్మండి.. ఇది నిజం’ చదువుతూంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఒక అమ్మాయి కోసం హకోడియా రైల్వే కంపెనీ తీసుకున్న నిర్ణయం చూస్తే ఇలా కూడా ఉంటుందా అనిపించింది. ఇదీ మానవత్వం అంటే.
-ఎన్.కోటేశ్వరరావు (అనకాపల్లి)