రాష్ట్రీయం

కేంద్ర మంత్రి పదవి రాదనే కవిత రివర్స్ గేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ ఫైర్
హైదరాబాద్, నవంబర్ 23: కేంద్ర మంత్రి పదవి రాదనే ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్ ఎంపి కవిత రివర్స్ గేర్‌లో మాట్లాడుతున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఇటీవల జరిగిన సభలో కవిత ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బాగా పని చేస్తున్నారని అన్నారని, ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని విమర్శించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని అన్నారు. ప్రధాని మోదీతో సెల్ఫీలు దిగినప్పుడు, కేంద్ర మంత్రులతో ముచ్చట్లు పెట్టినప్పుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుతో పోలీసు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వివక్ష గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేతకాని, చేవలేని దద్దమ్మలా మారిందని, కేంద్రం వివక్ష చూపిస్తున్నదని టిఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించడం వారి చేతకానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు.