జాతీయ వార్తలు

మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వి.కె తహిల్ రమణి రాజీనామాకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదుముద్ర వేశారు. ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినీత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విజయ కే తహిల్‌ రమణి తన పదవికి సెప్టెంబర్ 6వ తేదీన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి కోవింద్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు పంపారు. తన బదిలీ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కొద్దిరోజుల క్రితం జస్టిస్‌ రమణి చేసుకొన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. జస్టిస్‌ రమణి పదవీకాలం వచ్చే ఏడాది అక్టోబర్‌ 2వరకు ఉంది. ఈలోపే ఆమె రాజీనామా చేశారు.