రాష్ట్రీయం

అతిగా మద్యం తాగి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 7: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం ఒక వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో సాయంత్రం మచిలీపట్నంలో ఇతని మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే పోలీసులు మాత్రం అతిగా మద్యం తాగటం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిలకలపూడి ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మచిలీపట్నం గాంధీనగర్‌కు చెందిన వల్లూరి శ్రీనివాస్(53) రోల్డ్‌గోల్డ్ కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస అయిన శ్రీనివాస్ ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. ఆరు నెలల క్రితమే లివర్ దెబ్బతిన్నదని, మద్యం మానకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు హెచ్చరించారు. అయినా శ్రీనివాసరావు మద్యం మానలేదు. సోమవారం ఉదయం నుండే అతిగా మద్యం తాగాడు. మధ్యాహ్నం సమయంలో కూడా మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో భార్యను అడగ్గా లేవని చెప్పింది. తన సైకిల్‌ను తాకట్టు పెట్టి మరీ మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. అయితే కల్తీ మద్యం తాగి శ్రీనివాస్ మృతిచెందాడని జోరుగా ప్రచారం సాగింది. విషయం తెలుసుకున్న బందరు డిఎస్పీ శ్రావణ్‌కుమార్, చిలకలపూడి సిఐ జనార్థనరావు మృతుని కుటుంబ సభ్యులను విచారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.