రాష్ట్రీయం

ఇసుక మాఫియాను పదేళ్లు పోషించలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపాను నిలదీసిన కిమిడి కళావెంకటరావు
హైదరాబాద్, డిసెంబర్ 4: ఇసుక మాఫియా పదేళ్లపాటు పెంచి పోషించిన కాంగ్రెస్ నేతలకు, వైకాపా నేతలకు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వైకాపా నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. చంద్రబాబునాయుడు ఇసుక విధానాన్ని సమీక్షించి, శే్వతపత్రం విడుదల చేసి వాస్తవాలు వెల్లడిస్తే దానిని తప్పుపట్టడం ప్రతి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఇసుక మాఫియా దందాలు తాజా శే్వతపత్రంతో మరోసారి బట్టబయలు అవుతుందనే భయంతోనే అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇసుక అక్రమ రవాణా నియంత్రించడం ద్వారా అటు వినియోగదారులకు, ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుందని, తద్వారా ఒక త్రైమాసికం ఉండగానే ప్రభుత్వానికి ఇసుక విధానం వల్ల 517.36 కోట్ల రూపాయిలు ఆదాయం వచ్చిందని చెప్పారు. 23 జిల్లాలు కలిపి ఏడాది కాలంలో గత ప్రభుత్వ హయాంలో ఆదాయం 100 కోట్లు మాత్రమేనని గుర్తించాలని అన్నారు. సీనరేజి కింద 2007-08లో 87.70 కోట్లు, 2008-09లో 66.90 కోట్లు, 2009-10లో 90 కోట్లు, 2010-11లో 128 కోట్లు, 2012-13లో 121.60 కోట్లు, 2013-14లో 4.90 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని చెప్పారు. 2007 నుండి 2014 వరకూ వచ్చిన మొత్తం ఇసుక ఆదాయం 600 కోట్లు కూడా లేదని అన్నారు.