రాష్ట్రీయం

మ్యాజిక్‌స్క్వేర్స్‌లో సిద్దిపేట విద్యార్థుల గిన్నిస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట , డిసెంబర్ 19: మ్యాజిక్‌స్క్వేర్స్‌ను అతి తక్కువ సమయంలో పరిష్కరించి మెదక్ జిల్లా సిద్దిపేట విద్యార్థులు గిన్నిస్‌రికార్డులో నిలిచారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన మ్యాజిక్‌స్క్వేర్స్‌ను గణితశాస్త్రంలో 3.29నిమిషాల్లో 555మంది విద్యార్థులు ఒకేసారి పరిష్కరించి రికార్డు బ్రేక్ చేశారు. గిన్నిస్‌రికార్డుల ప్రతినిధి ఏడెల్ల రమేశ్ మాట్లాడుతూ యునైటెడ్, స్టార్ వరల్డ్‌రికార్డ్, బుక్ ఆఫ్ స్పెయిన్ రికార్డుల్లో విద్యార్థులు నమోదైనట్లు వెల్లడించారు. ఇలా 555మంది ఒకేసారి 9*9 మ్యాజిక్‌స్క్వేర్స్‌ను 3.29ని. పరిష్కరించడంతో పాటు 333విద్యార్థులు ఒకేసారి 3*3, 4*4,5*5,6*6,7*7,8*8,9*9 మ్యాజిక్‌స్క్వేర్ గడులను 8.22ని. నింపడం ప్రపంచంలో మొదటిసారన్నారు. గణితశాస్త్రంలోని ఈ భావనలు అర్థం చేసుకొని వేగంతో చేయడం అద్భుతమని, మ్యాజిక్‌స్క్వేర్ పై పరిశోధనలు జరిపిన ప్రఖ్యాత గణిత శాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా రికార్డు నమోదు కావడం అభినందనీయమన్నారు. ఈ రికార్డుల వివరాలు గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులకు పంపనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు చీఫ్ ఎడిటర్ విజయభాస్కర్ మాట్లాడుతూ మ్యాజిక్‌స్క్వేర్ అనే భావన మొదట చైనాకుచెందిన లోషూ అనే గణితశాస్తవ్రేత్త ద్వారా మొదలై తర్వాత అరేబియన్ వారి నుంచి భారతీయులు, యూరప్‌కు విస్తరించిందన్నారు.