గుంటూరు

భక్తిశ్రద్ధలతో నిత్య ఔపాసన, బలిహరణ కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఆదివారం బాలచాముండికా అ మరేశ్వరస్వామివార్లకు నిత్య ఔపాసన, బలిహరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానాచార్యులు జగర్లపూడి వేంకటేశ్వరశాస్ర్తీ, ప్రధాన అర్చకులు శంకరమంచి మధుసూధనశర్మ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పులివాహ నం, పల్లకిపై స్వామిఉత్సవ విగ్రహాల ను వీధుల్లో గ్రామోత్సవం గావించారు. కార్యక్రమాలను ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
వెండి ద్వారం బహూకరణ...
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ అజ్ఞాతభక్తుడు స్వామికి సుమారు 15 వేల రూపాయలతో సమర్పించిన వెండి ముఖద్వారాన్ని ఆదివారం వెంకటాధ్రినాయుడు మండపంలోని ద్వారానికి అతికించారు. దాతల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.