తెలంగాణ

‘మహా’ ఒప్పందంతో ఒరిగేది శూన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్టత్రో చారిత్రక ఒప్పందం చేసుకున్నట్లు సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజానికి ఆ ఒప్పందం వల్ల తెలంగాణ రైతులకు ఫలితం ఏమీ ఉండదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి బదులు కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తానని సిఎం బెదరించడం సరికాదన్నారు. కెసిఆర్ మెప్పు కోసం తెరాస నేతలు కాంగ్రెస్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ బెదిరింపులకు తాము భయపడేది లేదని, దమ్ముంటే తమ ఆరోపణలను ఆయన ఎదుర్కొనాలని యాష్కీ అన్నారు.