మహబూబ్‌నగర్

నవరాత్రులకు అలంపూర్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవదుర్గలంకారణలో పూజలందుకోనున్న శ్రీ జోగుళాంబ దేవి * 30న శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర తెప్పోత్సవం
అలంపూర్, సెప్టెంబర్ 20: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోంటె సర్వపాపాలు తోలుగుతాయని భక్తుల విశ్వాసం. జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో శరన్నవారాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమై 30వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు ఉత్సవాలు ప్రారంభించే ముందు గణపతి పూజ, పుణ్యహవాచనం, ఋత్విక్‌వరణం, మహకళశస్థాపన, అంకురరోహణ, ధ్వజరోహణం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారు తొమ్మిది రోజులలో శైలిపుత్రి మాత, బ్రహ్మచారిణిమాత, చంద్రఘంటా మాత, కూష్మాండా మాత, స్కంద మాత, కాత్యాయిని మాత, కాళరాత్రి మాత, మహగౌరి మాత, సిద్ద్ధిత్రీగా దర్శనమిస్తుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది

* రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రాంచందర్ కుంతియా
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు కొదవ లేదని కేవలం తాను రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకే పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ఇక్కడివచ్చి పనిచేస్తున్నానని తనకు ఈ రాష్ట్రంలో ఎలాంటి పదవులు అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఎఐసిసి కార్యదర్శి రాంచదర్ కుంతియా అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అధ్యక్షతన మహబూబ్‌నగర్‌లోని జెజె ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఇందిరమ్మ రైతుబాట భూ రికార్డుల అవగాహన సదస్సుకు ఎ ఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ భట్టివిక్రమార్క, ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు, డికె అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపిలు మల్లురవి, పొన్నం ప్రభాకర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి కుంతియా మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఇందిరమ్మ రైతుబాట ఇదో పెద్ద కార్యక్రమమని మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల తాను కాంగ్రెస్ శ్రేనులంతా అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఈ పరిస్థితి రావడానికి కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తాను వందశాతం సమర్థిస్తున్నానని కెసిఆర్ వేసిన సమితిలకు సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గ్రామగ్రామాన రైతు సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ పక్క కేంద్రంలో నరేంద్రమోది, మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అబద్దాల పాలన కొనసాగిస్తూ ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ నాయకులకు తమ తడాఖా ఏమిటో చూపించాలని గ్రామగ్రామానికి వెళ్లి కెసిఆర్ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. తనకు పూర్తి విశ్వాసం ఉందని 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చితీరుతుందని ఇక్కడి ప్రజలు ఏ ఆకాంక్షతో తెలంగాణ కోరుకున్నారో ఆ పాలన కాంగ్రెస్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ప్రతాప్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, వినోద్‌కుమార్, ముత్యాల ప్రకాష్, బెనహర్, బెక్కరి అనిత, ముధుసూదన్‌రెడ్డి, అనంతరెడ్డి, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

* మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్
దామరగిద్ద, సెప్టెంబర్ 20: భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని విఠ్లపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాను స్వచ్చ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని సూచించారు. మొదటగా ప్రతి మండల బ్లాక్ నుండి నాలుగు గ్రామపంచాయతీలను ఎంపిక చేసుకుని బహిరంగ మలమూత్రవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ పాఠశాల, వ్యక్తిగత మరుగుదొడ్లు, స్వచ్ఛ వైద్యశాల, ఘనద్రవ్య వనరుల నిర్వహణ, నీటి నాణ్యత, కాలుష్యం మొదలగు అంశాలపై దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. ఈ అంశాలు ఆమలు చేసేందుకు గ్రామంలోని పాఠశాలల ఏజెన్సీ కమిటీ, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజీక ఆరోగ్య కేంద్రాల కార్యకర్తలు, స్వచ్చంధ సంస్థలు, సర్పంచులు, కార్యదర్శులు భాగస్వాములై స్వచ్ఛ గ్రామంగా రూపొందించుకోవాలని అన్నారు. ఈ అంశాల ఆధారంగా ప్రతి గ్రామానికి, మండలానికి ర్యాంకింగ్ ఇవ్వడం, ప్రత్యేక ఆర్థిక సహయం అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య, డ్వామ పిడి జగధీశ్వర్‌రెడ్డి, ఎంపిడిఓ సిద్దిరామయ్య, తమశీల్దార్ బాలాజీ, ఎంపిపి చెన్నకిష్టప్ప, సర్పంచు వనజా తదితరులు పాల్గొన్నారు.
గద్వాలకు కృష్ణానది తీర పాదయాత్ర
గద్వాలటౌన్, సెప్టెంబర్ 20: తెలంగాణ మహాబూబ్‌నగర్‌లో పుట్టి రాయలసీమలోని శ్రీశైలం వద్ద కలుస్తున్న కృష్ణానది తీరా భాగాన నదుల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పాలమూరు లోని సత్యారం, ఈర్లదినె్న, మూలమల్ల గ్రామాలగుండా చింతరేవుల మీదుగా కాలినడకనా బుధవారం గద్వాల పట్టణానికి చేరారు. మనిషి మనుగడ సాధించాలంటే ప్రకృతి ప్రసాధించిన వనరులను పరిరక్షించుకోవడమే మంచి మార్గమని నదుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా కృష్ణానది తీరాన పాదయాత్ర చేస్తున్నామన్నారు యూనివర్శిటి అధ్యాపకులు రమేష్‌గౌడ్ అన్నారు. ఆయనతో పాటు ఆంధ్రా యూనివర్శిటి ఆచార్యులు ఆదినారాయణ, ఎంఏఎల్‌డి అద్యాపకులు మల్లిఖార్జున్‌లు ఉన్నారు.
నోబెల్ బహుమతి గ్రహితకు ఘనస్వాగతం
గద్వాలటౌన్, సెప్టెంబర్ 20: నోబెల్ బహుమతి గ్రహిత కైలాస్ సత్యార్థికి పట్టణవాసులు ఘనంగా స్వాగతం పలికారు. బాలలపై లైంగిక దాడులు మరియు బాలల అక్రమ రవాణా అంతానికై భారతదేశ యాత్రలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టారు. గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌లు పూలమాలతో ఘనస్వాగతం పలికారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, కైలాస్ సత్యార్థిలు పూలమాలలు వేసి నివాళర్పించారు అనంతరం శాంతికి చిహ్నంగా గాలిలోకి బెలూన్లను వదిలారు.

పిల్లలపై లైంగిక దాడులు దారుణం

* నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 20: సమాజంలో పిల్లలపై లైంగిక దాడులు జరగడం దారుణమని నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి అన్నారు. బుధవారం బాలల భద్రతలో భాగంగా నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి చేపట్టిన భారతయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెపిఎన్‌సి కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శనతో వెళ్లి కళాశాలలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యర్థి మాట్లాడుతూ మేక్ ఇండియా...సేఫ్ ఇండియా అని అందరు సంకల్పం తీసుకుని ఇతరులకు పంచాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైతే మరిన్ని చట్టాలు తీసుకురావాలని బాల్యంలో ఆనందంగా గడపాల్సిన చిన్నారులు వివిధ పరిశ్రమల్లో, దుకాణాల్లో, హోటళ్లలో పనిచేస్తున్నారని అలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. దేశంలో లైంగిక వేధింపులు, బాలికలపై అసభ్య ప్రవర్తన వంటి కేసులు 15వేలదాగా నమోదు కాగా అందులో కేవలం 4శాతమే పరిష్కారం అయ్యాయన్నారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణపై తాను 11000కిలో మీటర్ల మేర భారతయాత్ర చేస్తున్నానని ఈ యాత్రలో అనేక మంది పిల్లలను కలుస్తున్నానని, సొంత కుటుంబ సభ్యులే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చూసి ఎంతో బాధేస్త్తుందని అన్నారు. తాను 80వేల మంది చిన్నారులను వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పించానని అన్నారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాంఘీక దురాచారాలపై చాలా మంది పోరాడి ఉద్యమాలు చేసి వారి జీవితాలను కొల్పోయారని అదే కొవలో ఇంజనీరింగ్ చేసిన కైలాష్ సత్యర్థి ఉద్యోగం వదిలి సమాజహితం కోసం ఉద్యమకారుడిగా మారారని ఆయన ప్రశంసించారు. 1980లోనే బచ్‌పన్ బచావో అనే సంస్థ పెట్టిన ఆయన అక్కడి నుండి 144 దేశాలు తిరిగి పిల్లల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కైలాష్ సత్యర్థి అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చిన్నారులకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం, మాయమాటలు చెప్పి వ్యభిచార గృహాలకు పంపించడం, అఘాయిత్యాలకు పాల్పడడం లాంటి వాటివి దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య, అదనపు జడ్జి భూపతి, కళాశాల చైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ మూటల మనిషి

* మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: కెసిఆర్ మాటలకారి అని ఇన్ని రోజులు అన్నామని కానీ ఇకనుండి ఆయన మూటల మనిషిగా మారిపోయాడని ప్రాజెక్టుల నిర్మాణంలో కోట్ల రుపాయలు అవినీతి సొమ్మును సంపాదించారని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమానికి విచ్చేసిన జైపాల్‌రెడ్డి తన ప్రసంగంలో కెసిఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. సదస్సులో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ను నేరుగా తాను రైతుద్రోహిగా ప్రకటిస్తున్నానని ఈ మాటను నేను వందశాతం సమర్థించుకుంటున్నానన్నారు. లక్ష రుపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్న కెసిఆర్ నాలుగు విడుతలుగా చేసి రైతులను సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని వడ్డీని కూడా మాఫీ చేయని దుర్మర్గుడు కెసిఆర్ అన్నారు. ఈయన కారణంగా బ్యాంకుల నుండి రైతుకు చిల్లిగవ్వ కూడా రుణం అందడం లేదన్నారు. 1952లో టెనెంట్‌యాక్టును తెచ్చి పేదలకు భూమి పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అప్పట్లో తమకు సంబంధించిన 200 ఎకరాల భూమి కూడా పంపిణీ జరిగిందన్నారు. 1962,73,74లో తీసుకువచ్చిన భూసంస్కరణలు చాలా లాభం చేకూర్చాయని అంతకన్న కెసిఆర్ చేసేది ఏమిటని ప్రశ్నించారు. పాతచట్టాలను మారుస్తానంటున్న కెసిఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనా వేసిన కెసిఆర్ మూర్ఖుల స్వర్గంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెస్తే ఈయనగారు చేసింది ఏమిలేదని ఆమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. మూటలపై ఉన్న ధ్యాస పరిపాలనపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏదైన జరిగితే అందుకు కెసిఆర్ బాధ్యుడని హెచ్చరించారు. ఈయన పాలనలో అవినీతి దమాషా డబుల్ అయ్యిందని ఈయన కాలం దగ్గర పడిందని అందుకే పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కెసిఆర్ పాతాళానికి పడిపోవడం తధ్యమని జైపాల్‌రెడ్డి జోశ్యం చెప్పారు.

మహిళలకు అండగా కెసిఅర్

* మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
ఊట్కూర్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని మహిళలందరికి అన్నయ్యల ఉంటూ మహిళలకు అండగా ఉన్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలోని గ్రామ పంచాయతి కార్యాలయం దగ్గర దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి హజరై గ్రామంలోని మహిళలకు చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటూ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వం చేయ్యని విధంగా మహిళలకు కళ్యాణలక్ష్మి, షాదిముభారక్, ఒంటరి మహిళ పింఛన్లు పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఅర్‌కే దక్కిందని అన్నారు. కొన్ని పార్టిల నాయకులు చీరల పంపిణి కార్యక్రమంలో రాజకీయం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారికి రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ శివలింగమ్మ, నర్సింహ్మ, మహేష్‌గౌడ్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అమరచింతను సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్

అమరచింత, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి అమరచింతను సందర్శిచారు. గత పది సంవత్సరాల కిందట ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌కు అయిదు ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చినా నేటి వరకు వినియోగంలోని రాలేదని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమరచింతను కొత్త మండలంగా చేయడంతో అక్కడ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను ఏర్పాటు చేయలని విజ్ఞప్తి చేసినట్లుగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. దీంతో కలెక్టర్ శే్వతామహంతి పామిరెడ్డిపల్లి శివారులో ఉన్న 151, 152 సర్వే నెంబర్‌లో భూమిని పరిశీలించారు. అంతకు ముందు ఆమె దేశాయ్ ప్రకాష్‌రెడ్డి పాఠశాలలో విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పరిశీలించారు. వనపర్తి ఆర్‌డిఒ చంద్రరెడ్డి, అమరచింత తహశీల్దార్ దత్తాత్రి, ఆత్మకూర్ ఎంపిడిఒ పుష్పలీల, ఎంపిపి శ్రీ్ధర్‌గౌడ్, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, అమరచింత ఎత్తిపోతల అయకట్టు దారుల సంఘం అధ్యక్షురాలు సౌజన్యరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
సత్ప్రర్తన కలిగిన ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు

* జైలుశాఖ సూపరింటెండెంట్ దశరథ రాంరెడ్డి

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 20: సత్ప్రర్తన కలిగిన ఖైదిలకు జైలుశాఖ ఆద్వర్యంలో ఉపాధి ఉద్యోగ అశకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జైలుశాఖ సూపరింటెండెంట్ దశరథ రాంరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా జైలులో ప్రొఫెసర్ బీనా ఆద్వర్యంలో ఉన్నతి కార్యక్రమం ద్వారా ఖైదిలకు ఉద్యోగమేళను నిర్వహించారు. ఈ సందర్భంగా జైలుశాఖ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఖైదిలు కేవలం క్షణికావేశంలో నేరాలు చేస్తూ జైలుకు వస్తున్నారని అలాంటివారికి తిరిగి తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వారిలో మార్పును తీసుకువచ్చి సమాజంలో బతికేందుకు జైలుశాఖ ఆద్వర్యంలో ఉద్యోగ అవకాశాలను కల్పించి వారి ఆశయాలను నేరవేర్చేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లాలో దాదాపు నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రస్తుతం జైలులో కూడా ఖైదిల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుండడంతో తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ బీనా మాట్లాడుతూ ఖైదిలకు సైకాలజీ ద్వారా మరోసారి నేరం చేయకూడదనే ఉద్దేశ్యంతో తాము ఉన్నతి కార్యక్రమం ద్వారా వారికి ప్రత్యేక తరగతులను తీసుకోవడం జరుగుతుందని దానిద్వారా ఖైదిల్లో మార్పు వచ్చి వారు కూడా తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని ఆలోచించడం అభినందనీయమన్నారు. నేరాలను తగ్గించాలని కేవలం పోలీసు దెబ్బలకు, లా ద్వారా సమస్యకు పరిష్కారం కాదని కేవలం సైకాలజీ ద్వారానే ఖైదిల సమస్యలు పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలుశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.