హైదరాబాద్

మహిళలు స్వశక్తితో అన్నిరంగాలలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 12: మహిళలు స్వశక్తితో ఎదిగి పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో రాణించాలని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం రాత్రి ఆనంద్‌బాగ్ బృందావన్ గార్డెన్‌లో ది ఫెడరేషన్ అఫ్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ప్రస్తుత్త సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. అడపిల్ల పుడితే భారంగా చూసే రోజులు మారయని అన్నారు. మహిళలను విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేలా అందరూ ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే కనకారెడ్డిలు మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా స్వయంగా ఉపాధి అవకాశాలతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టె సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని తమకు నైపుణ్యం ఉన్న రంగాలలో రాణించాలని పేర్కొన్నారు. అసోషియేషన్ అధ్యక్షురాలు ఓ.నాగకుమారి కార్పొరేటర్‌లు ఎన్.జగదీష్‌గౌడ్, ఆకుల నర్సింగ్‌రావు, శిరీషారెడ్డి, ముంతాజ్ ఫాతి మా, సబిత, రజనీ, లక్ష్మీ, గాయత్రి, గజానని, నాయకులు వెంకన్న, మురుగేష్, మేకల రాముయాదవ్, బద్దం పరుశురాంరెడ్డి పాల్గొన్నారు.