రాష్ట్రీయం

మహిళను కాలితో తన్నిన ఎంపీపీ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందల్వాయి: భూ వివాదంలో భాగంగా ఓ మహిళను కాలితో తన్నిన నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి ఎంపీపీ ఇమ్మడి గోపీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ధర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపికి ఇందల్‌వాయి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పక్కన సర్వే నం.1107లో నాలుగెకరాల స్థలం ఉంది. గతేడాది ఈ స్థలంలోని అతిథిగృహంతో పాటు 1125 గజాలను రూ.33.72 లక్షలకు తనకు విక్రయించినట్లు గౌరారం గ్రామానికి చెందిన ఒడ్డె రాజవ్వ పేర్కొంటున్నారు. అయితే భూతగాదాల విషయమై గొడవ జరగడంతో ఎంపీపీ ఇమ్మడి గోపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడు. ఎంపీపీ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ శ్రేణులు ఈ రోజు ఇందల్వాయి మండలంలో బంద్‌ చేపట్టాయి.