జాతీయ వార్తలు

అధిక ధరలపై మహిళా కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడి బిజెపి ప్రధాన కార్యాలయం ముందు వారు గురువారం ధర్నా చేశారు. కూరగాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని ఖాళీ భోజనం ప్లేట్లతో మహిళలు ఆందోళనకు దిగారు. ధరల నియంత్రణలో ఎన్‌డిఎ సర్కారు దారుణంగా వైఫల్యం చెందిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.