మెయిన్ ఫీచర్

మెరిసే.. హిప్ హాప్ నక్షత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే హిప్ హాప్ డ్యాన్స్ పోటీల్లో హైదరాబాద్ నక్షత్రాలు మెరుపులా మెరిశాయి. న్యాయ నిర్ణేతలను, వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు చిన్నారులు ప్రదర్శించిన ‘‘ఆత్మాహుతి సిబ్బంది’’ నృత్యరూపకం ఈ పోటీల్లో గెలవటమే కాదు అంతర్జాతీయ హిప్ హాప్ పోటీలకు ఎంపికకావటం విశేషం. గాలిలో తేలిపోతూ.. నేలపై వొయలుపోతూ ఈ చిచ్చరపిడుగులు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను, జడ్జీలను నరాలు తెగే ఉత్తంఠకు గురిచేశాయి. ఇపుడు ఈ చిచ్చర పిడుగులు అంతర్జాతీయ వేదిక అయిన లాస్‌వెగాస్‌లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లో సత్తా చాటుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఆగస్టు 9న ఈ పోటీ జరుగనున్నది.
టోనీ జాక్సన్ 26 ఏళ్ల కొరియోగ్రాఫర్. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ కొరియోగ్రాఫర్ జాతీయ స్థాయిలో నిర్వహించే హిప్‌హాప్ చాంపియన్‌షిప్‌ను తన బృందానికి దక్కేందుకు ఇచ్చిన శిక్షణ వారిని రాటుదేల్చింది. ముచ్చటగా ఏడుగురు చిన్నారులను డ్యాన్స్‌లో తీర్చిదిద్ది పోటీలోకి దింపాడు. జియా, గ్రేస్, శాంస్కర్, సాంకేత్, వనజ, భువన, బిపుల్ - ఈ టీమ్‌లో సభ్యులు. వీరిలో జియా ఢీ జూనియర్స్‌లో రన్నర్‌గా కూడా నిలిచింది. బ్రోకర్-2లో నటించింది. ఒక్కసారిగా ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికకావటంతో నెర్వస్‌గా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ తాము క్రమం తప్పకుండా చేసే ప్రాక్టీస్ వల్లే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపికయ్యామని ఈ చిన్నారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ముంబయిలో జరిగిన ఈ హిప్‌హాప్ చాంపియన్ పోటీల్లో పాల్గొన్న బృందాలన్నీ కూడా అత్యంత ప్రతిభావంతమైనవే. హిప్‌హాప్ పోటీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. పోటీ టఫ్‌గా ఉండటమే కాదు నెగ్గటమనేది ఛాలెంజింగ్‌తో కూడుకున్న సవాల్. అలాంటిది పోటీల్లో విజేతలుగా నిలిచామని న్యాయనిర్ణేతలు ప్రకటించేసరికి అందాల చంద్రుడ్ని అందుకున్న ఆనందాన్ని పొందామని చిన్నారులు వెల్లడించారు.
అంతర్జాతీయ వేదికపై
హైదరాబాద్
హిప్‌హాప్ పోటీలలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికపై తాను తయారుచేసిన టీమ్ నిలపటం ఆనందంగానూ, గర్వంగాను ఉందని యువ కొరియోగ్రాఫర్ టోనీ అంటున్నారు. గాలిలోనూ, నేలపైన పెద్దలు కూడా చేయలేని విధంగా వీరు చేసిన నాట్యం అద్భుతంగా ఉండటం వల్లనే అందరినీ అలరించిందని పేర్కొన్నాడు. చదువులో వెనుకబడకుండా తమని తాము తీర్చిదిద్దుకుంటూ అమెరికాలో మెరిసేందుకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంట ల వరకు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు అధిగమించేదెలా..?
అమెరికాలో జరిగే పోటీకి అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఈ చిన్నారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొరియోగ్రాఫర్ జక్సన్ సైతం అంగీకరిస్తున్నారు. ఒక్కొక్కరికి కనీసం రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సహాయానికి ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
చిన్నారులు మాత్రం తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనే ఆశతో రేయింబవళ్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ప్రపంచస్థాయ పోటీల్లోనూ గెలవాలని ఆకాంక్షిద్దాం.

హిప్‌హాప్ కాంపిటేషన్ చాలా కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ నా డ్యాన్స్ స్కూలు విద్యార్థులు వాటిని తట్టుకుని గెలిచారు. అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ పేరును నిలబెడతారనే నమ్మకం ఉంది. స్పాన్సర్స్ అందించే ఆర్థిక వెసులుబాటుతోనే ఇది సాధ్యం అవుతుంది.
- టోనీ జాక్సన్, ఏకలవ్య
డ్యాన్స్ కంపెనీ

అద్భుతాన్ని ఆవిష్కరిస్తాం
అంతర్జాతీయ వేదికపై మేము అద్భుతాన్ని ఆవిష్కరిస్తాం. మేము తప్పక పాల్గొంటామనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తీవ్రంగా కృషిచేస్తున్నాం.
- భువన (12)

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03