మెయిన్ ఫీచర్

తెలుగుతల్లి నుదుట ‘సింధూ’రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది 2011వ సంవత్సరం. పుల్లెల గోపిచంద్ అకాడమీకి మీడియా వెళితే అక్కడ పదహారణాల తెలుగుతనం ఉట్టిపడే పదహారేళ్ల అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఎవరోలే! అని ముందుకు సాగుతుండగా.. అనుమానం వచ్చి పరీక్షగా చూడగా.. ఆమే పి.వెంకట సింధూ అని గ్రహించేసరికి అందరి కళ్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాయి. పదేళ్ల వయసులో చిన్నిచిన్ని అడుగులతో ఈ అకాడమీకి వచ్చిన ఈ చిన్నారి సింధూ ఆనాడు సీనియర్స్ ఆడిన షటిల్ కాక్స్ పోగేస్తూ ఉండేది. ఆరేళ్లకే ఇంత పెద్దదైందా! అని అందరి నోటా ఆశ్చర్యమే. ‘‘ఇపుడు నేను ఐదడుగుల పదకొండు అంగుళాలు సార్’’ అని ఆ రోజు ఆమె తనను తాను పరిచయం చేసు
కుంది. ఇపుడు ఆమె పాత సింధూ కాదు. రియో ఒలంపిక్స్‌లో ఇంచుమించు ఈ ఆరడుగుల రాకెట్టు తన చేతితో రాకెట్ విసురుతుంటే యావత్ ప్రపం చం కళ్లప్పగించి చూసే స్థాయికి తన పరిచయ ప్రస్థానాన్ని తీసుకువెళ్లింది. ఆమె దూకుడుకు నేడు యావత్ భారతావని జేజేలు పలికింది. వరుస పోటీల్లో ఏకపక్ష విజయంతో దూసుకుపోయిన తెలుగమ్మాయి నేడు రియో విశ్వక్రీడల బాడ్మింటన్‌లో వెలుగులు విరజిమ్ముతూ తళుక్కుమంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్‌కు దూసుకువెళ్లిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్రకెక్కింది. గోపిచంద్ అనే ద్రోణాచార్యుని శిక్షణలో ఆమె ఏకలవ్యగా ఎదిగి తదేక దీక్షతో తనను తాను తీర్చిదిద్దుకుంది. యావత్ భారతం ఆమె లిఖించిన నవ చరితను ఆస్వాదిస్తూ ఇన్నాళ్లు మనం చూసిన సింధూ వేరు.. ఇపుడు సింధూ వేరు అనేటట్లు కనికట్టు చేసింది. రెండు పదు లు దాటిన ఈ తెలుగు సింధూరం గురించి కొన్ని విశేషాలు
ఆమె స్మృతిపథంలో రెండే బొమ్మలు...
ఆమె స్మృతిపథంలో రెండే రెండు బొమ్మలు కదులుతుంటాయి. ఒకరు గోపీ సార్, మరొకరు తండ్రి రమణరావు అని అంటుంది.
గోపీచంద్ అకాడమీలో ఉన్న 32 అడుగులు ఎల్‌ఇడీ టీవీ ముందు కూర్చొని తెలుగు సినిమాల్లో వచ్చే జోక్స్‌ను వింటూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. తెలుగు హాస్య సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంటాయి అని చెబుతోంది.
ఆమె ప్రేమించేది బ్యాడ్మింటన్‌ను, శ్వాసించేది కూడా ఆ ఆటనే.
తల్లిదండ్రులైన పి.వి.రమణ, విజయ ఇద్దరూ కూడా వాలీబాల్ ప్లేయర్స్. అదే ఆమె క్రీడారంగంలో ఎదగటానికి దోహదపడింది.
గురువు పుల్లెల గోపీచంద్, తండ్రి రమణ ఇద్దరూ కూడా అర్జున్ అవార్డు గ్రహీతలు
పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకునేటపుడు ఆమె ఎక్కువగా తీసుకునే అల్పాహారం పూరీ-శనగలతో చేసిన కూర. దీంతో పాటు గ్లాసు పుచ్చకాయ రసాన్ని కూడా తీసుకుని శిక్షణకు ఉపక్రమిస్తుంది.
రోజూ ఏడుగంటలు ప్రాక్టీస్ చేస్తుంది. మార్కులు, ర్యాంకులు ఆమెకు పట్టవు. పాసవ్వాలనే ధ్యేయంతోనే చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో చదువుతుంది. కేవలం బాడ్మింటన్ మెళకువలే నా సంస్కృత ఫాఠాలు అని చెబుతుంది. అయినప్పటికీ 70శాతం మార్కులు వచ్చేవి. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలపుడే సింధూ వారం రోజుల పాటు రాకెట్‌ను పక్కనపెట్టి పూర్తిగా పుస్తకాలనే పట్టుకుందట!.
ఆమెకు తన లక్ష్యం తెలుసుకాబట్టే నిన్నటి సింధూ ఆట ఒక ఎత్తయితే నేడు సెమీస్‌లో ఆడిన ఆట మరో ఎత్తుగా నిలిచి క్రీడా కదనరంగంలో ముందుకు దూసుకువెళుతోంది.
ఎత్తు, 24 గంటలు చెదరని చిరునవ్వు తల్లిదండ్రులు నుంచి వచ్చిన వారసత్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎపుడు ఉల్లాసంగా ఉంటారు.
గొప్ప విజయాలు ఎపుడూ సునాయాసంగా రావు. మొక్కవోని సంకల్పంతో ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకుని రియో ఒలింపిక్‌లో జైత్రయాత్ర కొనసాగించింది. సెమీస్‌లో విజయం సాధించిన తరువాత తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏమైనా తిన్నావా అని మాత్రమే అడిగారు. ఇంకేమీ సలహాలు ఇవ్వలేదు. ఎందుకంటే టెన్షన్‌కు గురవుతుందని. ఆమె మనసెరిగి మెలిగే తల్లిదండ్రులు, గురువు గోపీచంద్ లభించటం ఆమెకు దక్కిన వరం.
నెల రోజుల నుంచి ఫోన్, ట్విట్టర్‌లకు దూరం..
తనకు వరంగా లభించిన హైట్‌తో నెట్‌పైకి దూకుతూ సెమీస్‌లో ప్రత్యర్థిని భయపెట్టిన సింధూ రియో ఒలింపిక్స్ కోసం నెల రోజుల నుంచి కనీసం ఫోన్ కూడా ముట్టుకోవటం లేదు. ట్విట్టర్‌ను కూడా మూసివేసింది. మోడలింగ్ మీద ఆసక్తితో జుట్టును అందంగా కర్లింగ్ చేయించుకుని సహజసిద్ధ సిందూర పువ్వుగా వికసించేందుకు ఇష్డపడింది.
అరుదుగా చాక్లెట్స్..స్వీట్లు
యోగా, స్విమ్మింగ్ చేస్తూ కూడా రిలాక్స్ అవుతుంది. అంతేకాదు అరుదుగా చాక్లెట్స్, స్వీట్స్ తినటానికి ఇష్టపడుతుంది. అక్క సింధూకన్నా ఏడు సంవత్సరాలు పెద్దది. ఆమె డాక్టర్.
విలువలేని వస్తువులను పోగేస్తుంది..
మనం విలువలేని వస్తువులంటూ చెత్తకుప్పల్లో పోస్తాం. కాని సింధూ మాత్రం విలువలేని వస్తువులనే కలెక్ట్‌చేసి భద్రం చేసుకుంటుంది. వారానికి ఒకటి, రెండుసార్లు బయటకు వెళ్లి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయటానికి ఇష్టపడుతుంది.

- ఆశాలత