మెయిన్ ఫీచర్

పిల్లల పెంపకానికి ప్రణాళిక ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, అటువంటి బాలలను మనం ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామన్నదే నేటి మన సమస్య. సమస్త జీవరాశిలో అనుకరణ అనేది మనుషులకే బాగా వచ్చు. పుట్టిన దగ్గరనుంచి మరణించేవరకు అనుకరించేది మానవజాతే. అనుకరణ అనేది మానవ జీవితంలో ఒక భాగం అయింది. పిల్లలు మొదట తమ తల్లిదండ్రులను, అనంతరం నట్టింట్లో భూతం (బుల్లితెర)లో ప్రసారం అయ్యే కార్యక్రమాలలో సంగీతకారులను, నటులను అనుసరిస్తున్నారు. బుల్లితెరలో ప్రసారం అయ్యే వ్యాపార ప్రకటనలను పిల్లలు అనుసరించడం, తల్లిదండ్రులు చూసి మురిసిపోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, భవిష్యత్‌లో అవి వారికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఎవరికీ తెలియదు.
బహుళజాతి కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విక్రయాలను పెంపు చేసుకోవడం కోసం బుల్లితెరపై అత్యంత ఆకర్షణీయంగా వ్యాపార ప్రకటనలను రూపొందిస్తున్నాయి. మన దేశంలో నొప్పుల బామ్ తయారీలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ యజమాని ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఈ సందర్భంగా ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది. తమ బామ్ విక్రయాలు మార్కెట్‌లో తగ్గుముఖం పట్టినప్పుడు కొద్దిరోజులపాటు వ్యాపార ప్రకటనలు ఇస్తామని, దాంతో మార్కెట్‌లో తమ కంపెనీ షేర్ తమకే ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి వ్యాపార ప్రకటనలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో ఇట్టే అవగతం అవుతుంది. పిల్లలు నటులను అనుకరించడం వలన, వారికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. చిత్ర పరిశ్రమలో నటునిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అంతేకాకుండా, వెండితెర లేదా బుల్లితెర మీద వారు చేసే విన్యాసాలలో ఎక్కువ శాతం కల్పితాలు. బైక్ రేస్‌లు, ఆడవారిని టీజ్ చేయడం తదితర అవలక్షణాలు అన్ని ఈ అనుకరణలలో భాగమే. ధూమపానం, మద్యం సేవించడం ఒక ఫ్యాషన్‌గా మారాయి. గత కొద్ది సంవత్సరాలుగా బుల్లితెర మీద వివిధ పేర్లతో డాన్స్ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఈ పోటీలలో పాల్గొంటున్న చిన్నారులు అద్భుతంగా డాన్స్ చేస్తున్నారని చెప్పడం కన్నా, విన్యాసాలు చేస్తున్నారని చెప్పడం సబబుగా ఉంటుంది. శృంగారం అంటే ఏమిటో తెలియని వయస్సు పిల్లల చేత, శృంగార నృత్యాలు చేయిస్తున్నారు. ఇటువంటి వాటివలన పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని బాలల హక్కుల సంఘాలు, మేధావులు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకొనే నాధుడే కరవు.
అదే పిల్లలు శాస్తవ్రేత్తలను అనుకరించడంవలన పలు లాభాలు ఉన్నాయి. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపులో వారికి భాగస్వామ్యం లభించడమే కాకుండా, వారు స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో చిరుప్రాయం నుంచే శాస్ర్తియ దృక్పథం అలవడుతుంది. దీనివలన, పలు సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు. పిల్లల్లో తార్కికంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఇది వారు చదువులో రాణించడానికి కూడా దోహదపడుతుంది. అయితే, శాస్తవ్రేత్తల గురించి, వారి పరిశోధనలు, వారు ఆవిష్కరించిన కొత్త అంశాలు వలన జన జీవనంలో వచ్చిన మార్పులు, తదితర అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలో సైన్స్ విభాగంలో తొలిసారిగా నోబుల్ బహుమతి పొందిన శే్వత జాతేతరుడు సర్ సి.వి.రామన్. కాంతికి సంబంధించి కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్‌కు 1930లో ఆయన ఫిజిక్స్‌లో నోబుల్ బహుమతి వచ్చింది. ఆయన ఈ ప్రయోగం చేయడానికి ఉపయోగించిన పరికరాల మొత్తం ఖర్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే. ఈ విధంగా అతి తక్కువ ఖర్చుతో, అందుబాటులో వున్న వనరులను వినియోగించుకొని అద్భుతాలను ఆవిష్కరించిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఇటువంటివారి గురించి విస్తృతంగా పరిచయం చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం ఇటు మీడియాపై ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇటువంటి అంశాల గురించి తెలియచెప్పాలి. అప్పుడే పిల్లలు శాస్తవ్రేత్తలను అనుకరించే, అనుసరించే అవకాశం వుంది. దీనివలన, పిల్లల భవిష్యత్‌ను ఉజ్జ్వలంగా తీర్చిదిద్దవచ్చు. తల్లిదండ్రులారా.. ఇకనైనా ఆలోచించండి. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో.

నట్టింట్లో భూతం (బుల్లితెర)లో ప్రసారం అయ్యే కార్యక్రమాలలో సంగీతకారులను, నటులను అనుసరిస్తున్నారు. బుల్లితెరలో ప్రసారం అయ్యే వ్యాపార ప్రకటనలను పిల్లలు అనుసరించడం, తల్లిదండ్రులు చూసి మురిసిపోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, భవిష్యత్‌లో అవి వారికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఎవరికీ తెలియదు.శృంగారం అంటే ఏమిటో తెలియని వయస్సు పిల్లల చేత, శృంగార నృత్యాలు చేయిస్తున్నారు. ఇటువంటి వాటివలన పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని బాలల హక్కుల సంఘాలు, మేధావులు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకొనే నాధుడే కరవు.

- పి.హైమావతి