ఉత్తరాయణం

గృహనిర్మాణం ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గృహనిర్మాణ పథకాలు నీరుగారిపోతున్నాయి. ఒకప్పుడు వివిధ పథకాల కింద పేదలకు గృహనిర్మాణం జోరుగా సాగింది. ఈ పథకాలకు ఇందిరమ్మ, రాజీవ్, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి నేతల పేర్లను పెట్టడం తప్ప నిరుపేదలకు సొంత ఇల్లు కలగా మారుతోంది. చాలా చోట్ల భూమి లభించడం లేదన్న సాకుతో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదు. గృహ నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు కూడా పెరగడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం తగ్గింది. ఇందిరమ్మ పథకంలో అక్కడక్కడా గృహ నిర్మాణాలు అరకొరగా చేపట్టినా లబ్దిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఎపిలో చాలా జిల్లాలలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించక పోవడం, కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం జరుగుతోంది. ఇకనైనా ఇందిరమ్మ లబ్దిదారులకు బిల్లులు చెల్లించి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలి.
- బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి
నియామకం ఎప్పుడో?
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ జన్నత్ హుస్సేన్ పదవీ విరమణ చేసి ఏడాదిన్నర కాలం గడిచినా ఇంకా కొత్త కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదు. సమాచార హక్కు చట్టం అమలుపై పాలకులకు ఎంతటి శ్రద్ధ ఉందో ఈ వైనం చెప్పకనే చెబుతోంది. గతంలో కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీం మందలింపుతో మోదీ సర్కారు వెంటనే సమాచార హక్కు కమిషనర్ల నియామకాలను జరిపింది. సమాచార హక్కు చట్టం అమలును పర్యవేక్షించేలా కమిషనర్‌ను నియమించకుంటే ప్రజల హక్కులను కాపాడేది ఎవరు?
-ఎం.శ్రీనివాసరావు, మల్లయ్యపేట