మెయిన్ ఫీచర్

‘స్వచ్ఛ’మైన ఇల్లు ... ఆనందాల హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు.. స్వర్గసీమ! అది లక్ష్మీదేవి నడయాడే ప్రదేశమని తెలుసుకున్నప్పుడే కదా ఆనందాల హరివిల్లు అవుతుంది.! లేదంటే అన్నీ కష్టాలే.. నిత్యం కన్నీళ్ళే! ఇంటి ‘స్వచ్ఛత’ కోసం వారంలో ఒక రోజు కేటాయించి ఇంటిని చక్కదిద్దుకుంటే కుటుంబం అంతా హాయిగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. లేదంటే ఆదాయానికి మించి వైద్య ఖర్చులు తలపై కూర్చొంటాయ. ఇంట్లో రోజువారీ చెత్త ఎప్పటికప్పుడు పారబోస్తే ఈగలు, దోమలు దరిచేరవు. స్నానపు గదులు, మరుగుదొడ్లు, స్టోర్ రూంలు, ఇంటి మూలలను నిత్యం ఓ అరగంట కేటాయించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ లేదా వారానికి ఒకసారి ఇంట్లోని ఫ్లోర్‌ను సర్ఫ్‌తో లేదా పసుపుతోనైనా లేదా తేలికైన క్రిమి సంహారక లిక్విడ్‌లను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. పసుపు సర్వరోగ నివారిణిని కాబట్టి ఈ పసుపునే ఎక్కువగా వినియోగిస్తేనే ఎంతో మేలు.
ఇంట్లో చిన్న ఆలయం.. దేవుడి గది
పూజ గది ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి. బొద్దింక, ఇతర పురుగులు దూరనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో ఉండే వత్తులు, నూనె డబ్బా అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. వీలైనంతవరకూ పాత పేపర్లు పూజ గదిలో వాడకపోవడమే ఉత్తమం. ఈ పేపర్లకు దుమ్ము, ధూళి వేగంగా అంటుకుంటుంది. దీపపు ప్రమిద, నూనె సీసా, దీపారాధన కుందులు ఎప్పటికప్పుడు చింతపండుతో తోముకోవాలి. పూజించిన పువ్వులు, ఇతర పత్రిని ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. ఇంట్లో సాంబ్రాణి, అగరవత్తుల సువాసన వస్తుంటే పురుగులు దరిచేరవు.
అద్దంలా వంటగది
కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే వంట గది పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాదండోయ్.. ఆహార పదార్థాలు కూడా పాడైపోకుండా చూసుకోవటంతో పాటు వ్యర్థాలను ఎప్పటికప్పుడు పొడి చెత్తబుట్టలో వేస్తుండాలి. ఈగలకు ఆవాసం కల్పిస్తే ఆహారం కలుషితమై టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకుతాయి. పంచదార, ఉప్పు తదితర డబ్బాల్లోని స్పూన్లను వారానికి ఒకసారి శుభ్రపరచాలి.
పచ్చని మొక్కలతో పొదరిల్లు
ఇంటి ఖాళీ ప్రదేశాల్లో పచ్చని మొక్క లను పెంచుకుంటే కుటుంబానికి కావాల్సినంత స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. అలాగే ఆహ్లాదకరంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనుమరుగైపోతున్న పిచ్చుకలు వంటి పక్షులకు నివాసంగా ఉంటుంది. కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉన్నా చిన్న చిన్న ఐడియాలతో అందమైన ఉద్యానవనాన్ని పెంచవచ్చు.వేపచెట్టు, తులసి మొక్క ప్రాధాన్యం వెలకట్టలేనిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వేప, తులసి మొక్కలు వైద్యంగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు సరైన నిర్వహణ లేకపోతే బతుకుకు షాక్ ఇస్తాయి. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్‌లను శుభ్రపరుస్తుండాలి. శరీరానికి అవసరమైన మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం వంటివి అందించే స్వచ్ఛమైన మంచినీటిని తీసుకుంటే ఆరో గ్యానికి మంచిది.

- కృష్ణమూర్తి