సంపాదకీయం

ఆగని పోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టులు నానాటికీ బలపడుతున్నారనడానికి ఇది మరో నిదర్శనం. 2009లో కేంద్ర ప్రభుత్వం ‘మావోయిస్టు’ ఉగ్ర సంస్థను నిషేధించిన తరువాతనే చైనా ఉసిగొల్పుతున్న ఈ తీవ్రవాదులు బలపడిపోవడం అంతర్గత భద్రతకు పెరుగుతున్న ప్రమాదానికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒరిస్సా మల్కన్‌గిరి జిల్లా పనుస్‌పుట్ గ్రామం సమీపంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పులలో ఇరవై నలుగురు మావోయిస్టులు హతులయ్యారట! హతులలో పదకొండు మంది మహిళలుండడం మావోయిస్టుల విస్తరణకు మరో సంకేతం! నిషేధం తరువాత మావోయిస్టులు కొత్త బలం పుంజుకున్నారు. గతంలో నామమాత్రంగా ఉనికిని చాటుకున్న ప్రాంతాలలో మావోయిస్టులు ప్రస్తుతం పటిష్టమైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నది సోమవారం నాటి ఎదురుకాల్పుల వల్ల మరోసారి ధ్రువపడింది. ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్ రాష్ట్రాలలో పాతుకుపోయిన మావోయిస్టులు ఇపుడు ఒరిస్సాలో సైతం భయంకరమైన పోరాటం సాగించడానికి సిద్ధమయ్యారన్నది ఈ ధ్రువీకరణ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను ఒకప్పు డు అట్టుడికించిన నక్సలైట్లు, మావోయిస్టులు ఆ త రువాత ఆంధ్రప్రదేశ్ నుంచి నిష్క్రమించినట్టు ప్రచారం జరిగింది. కానీ మళ్లీ తెలంగాణ, అవశేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు తిరిగి వస్తున్నట్టు ఇటీవలి పరిణామాల వల్ల స్పష్టమైంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలోను, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దులలోను మావోయిస్టుల సంచారం మొదలైంది. మళ్లీ సంచలనం మొదలైంది. సోమవారం నాటి ‘ఎదురుకాల్పులు’ జరుగవలసి రావడం ప్రస్తుత ఘట్టంలో పరాకాష్ఠ. మరణించిన 24 మంది కాక వందలాది మంది మల్కన్‌గిరి జిల్లాలో తిష్ఠ వేసి ఉండడం ‘ధ్రువపడని’ వాస్తవం! ఎదురుకాల్పులు జరిగిన స్థలం నుంచి మిగిలిన మావోయిస్టులు దూరంగా జరగడం సహజం. కానీ మల్గాన్‌గిరి జిల్లాలో సోమవారం ఎదురుకాల్పులు జరిగిన తరువాత మిగిలిన మావోయిస్టులు పారిపోలేదు. అక్కడే ఉండి భద్రతాదళాలపై మళ్లీ దాడులకు సమాయత్తం అవుతుండడం ఆ ప్రాంతంలో సంఖ్యాపరంగా మావోయిస్టుల విస్తృతికి నిదర్శనం. మంగళవారం మళ్లీ అదే ప్రాంతంలో పోలీసులపై, భద్రతాదళాలపై మావోయిస్టులు దాడులు జరపడం మావోయిస్టుల బలానికి, ధీమాకు సాక్ష్యం. ఎదురుకాల్పులలో మంగళవారం మరో ముగ్గురు మావోయిస్టులు హతులయినప్పటికీ ఈ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాలు బలంగానే ఉన్నాయనడానికి తార్కాణం..
ఆంధ్రప్రదేశ్ ‘గ్రేహవుండ్స్’ పోలీసులు, ఒరిస్సా ‘స్పెషల్ ఆపరేషన్ గ్రూప్’- ఎస్‌ఓజి - పోలీసులు ఉమ్మడిగా ప్రతిఘటించడం బహుశా మావోయిస్టులు ఊహించని పరిణామం. అందువల్లనే ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు హతులయ్యారు. కానీ నక్సలైట్ల కాల్పులలో ఇద్దరు ‘గ్రేహవుండ్స్’ వీరులు తీవ్రంగా గాయపడడం మావోయిస్టుల సాయుధ పటిమకు నిదర్శనం. ఒక ‘గ్రేహవుండ్స్’ వీరుడు- కమండో- ఎమ్‌డి అబూబకర్ అసువులు కోల్పోవడం పోలీసుల ప్రాణాలకు నిరంతరం పొంచి ఉన్న తీవ్రవాద ప్రమాదానికి కొనసాగుతున్న సాక్ష్యం! ‘మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా’- సిపిఐ- మావోయిస్టును నిషేధించినంత మాత్రాన చైనా అమలు జరుపుతున్న ‘వ్యూహం’, మన దేశాన్ని అరాజకం పాలుచేయడానికి కొనసాగుతున్న కుటిల పథకం భగ్నమవుతుందని భావించడం భ్రమగా మిగిలింది. ఈ భ్రమ సోమవారం మరోసారి ధ్రువపడింది. ఎందరు పోలీసులు, ఎందరు మావోయిస్టులు హతులయ్యారన్నది వివిధ ఘటనలలో విభిన్నమైన విపరిణామక్రమం. కొన్నిసార్లు పోలీసులు, కొన్నిసార్లు మావోయిస్టులు అధికసంఖ్యలో మరణించారు. కానీ నిషేధం తరువాత ఎనిమిదేళ్లు జరిగినప్పటికీ మావోయిస్టు ప్రమాదం నుంచి దేశ ప్రజలకు విముక్తి లభించలేదు. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యం ఇది! జిహాదీ దుండగులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పేరుపెట్టి అభిశంసిస్తున్న మన ప్రభుత్వం, మావోయిస్టులను పెంచిపోషిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇదే విధంగా పేరుపెట్టి ఎందుకని అభిశంసించడం లేదు? గత ఏడాది మన సైనికులు అనేకమంది ఈశాన్య ప్రాంతంలో చైనా చంకబిడ్డలైన సాయుధులను హత్య చేయగలిగారు. మన ప్రభుత్వ దళాలు బర్మాలో నక్కి ఉండిన చైనా తొత్తులను- బర్మాలోకి చొచ్చుకొనిపోయి మట్టుపెట్టారు. ఈ చొచ్చుకొని పోవడం- హాట్ పర్స్యూట్- తరువాత ఈశాన్యంలో కొంతకాలం అణగారి ఉండిన చైనా సమర్థక సాయుధులు ఇపుడు మళ్లీ విజృంభిస్తున్నారు..
మన దేశాన్ని, నేపాల్‌ను బలహీన పరిచే చైనా కుట్రలో భాగం- మావోయిస్టులు! చైనా ఓడరేవులలో నౌకలకెక్కిన ఆయుధాలు బర్మా, బంగ్లాదేశ్ ఓడరేవులలో దిగబడి ఈశాన్యంలోకి అక్కడ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు, నేపాల్‌కు చేరుతున్నట్టు ఏళ్ల తరబడి ప్రచారమవుతోంది. ఈ ఆయుధ సరఫరాకు అంతరాయం కలుగకపోవడం వల్ల మాత్రమే ఛత్తీస్‌గఢ్‌లో ఏళ్ల తరబడి మావోయిస్టులు రక్తపాతం సృష్టిస్తున్నారు. ‘సాల్వాజుడుం’ నాయకుడు మహేంద్ర కర్మను, మరో పదహారు మందిని 2013 మే నెలలో మావోయిస్టులు హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిటచిన ఘటన! మావోయిస్టుల ఈ బీభత్స పటిమకు ప్రధాన కారణం చైనా నుంచి వారికి లభిస్తున్న ఆయుధాలు! అందువల్ల చైనాకు మన దేశం పట్ల గల విధానంలో మార్పు రానిదే మావోయిస్టుల బెడద, విస్తృతి అంతం కావు! జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పడం మానుకొమ్మని పాకిస్తాన్‌ను కోరుతున్నట్టే మావోయిస్టులను ఉసిగొల్పడం మానుకోవాలని మన ప్రభుత్వం ఇప్పుడైనా చైనాను బహిరంగంగా కోరాలి. లేదా చైనాతో ప్రమేయం లేకుండా మావోయిస్టులను సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి! ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ప్రధానంగా మావోయిస్టులతో తలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది, సహాయం చేస్తోంది. పరిమితమైన వనరులతో ఆయుధాలతో మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటిస్తున్నప్పటికీ మావోయిస్టులు మరింతగా విస్తరిస్తున్నారు. ఈ ‘విస్తృతి’కి సోమ, మంగళవారాల ఘటనలు నిదర్శనం..
మావోయిస్టుల సమస్య ఆర్థిక ప్రగతితో ముడిపడి ఉందన్నది మరో భ్రమ! ఆర్థిక ప్రగతి సాధించినట్టయితే మావోయిస్టుల బెడద అంతరించి పోతుందన్నది ఈ భ్రమ. ఈ భ్రమ ప్రాతిపదికగానే మావోయిస్టు పీడిత జిల్లాలలో ప్రత్యేక అభివృద్ధి పథకాలను అమలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్ల తరబడి భావిస్తున్నాయి. అంటే మావోయిస్టుల బెడద లేని చోట్ల ప్రత్యేక అభివృద్ధి పథకాలు అక్కరలేదా? మావోయిస్టుల బెడదతో నిమిత్తం లేకుండా అన్ని జిల్లాలలోను, రాష్ట్రాలలోను అభివృద్ధి పథకాలు అమలు జరపడం ప్రభుత్వాల విధి. అందువల్ల మావోయిస్టులకు, ఆర్థిక సమస్యలకు సంబంధం లేదు. చైనా ప్రభుత్వం సృష్టించిన, కొనసాగిస్తున్న అంతర్గత ప్రమాదం ‘మావోయిస్టుల’ విస్తరణ..