మెయన్ ఫీచర్

విద్రోహం పట్ల ‘మానవీయ శ్రద్ధ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే హిందీ చలనచిత్రం విడుదలకు ఆటంకాలు తొలగిపోవడం గురించి గొప్పగా ప్రచారం జరుగుతోంది! ఈ సినిమాలో పాకిస్తాన్‌కు చెందిన ఫవాద్‌ఖాన్ అనే నటుడు ప్రముఖ పాత్రను పోషించాడట! పాకిస్తాన్‌లోని ప్రముఖులలో అత్యధికులు ప్రచ్ఛన్న ‘జిహాదీ’లు! ఆ దేశ అభినయ కళాకారులలో సైతం అత్యధికులు ప్రచ్ఛన్న జిహాదీలు! ప్రత్యక్ష ‘జిహాదీ’లు ఇస్లాం మతేతర ప్రజలను దాదాపు పదునాలుగు శతాబ్దులుగా హత్య చేస్తున్నారు.. ఇలా హత్యచేస్తున్న వారిని ప్రచ్ఛన్న ‘జిహాదీ’లు సమర్ధిస్తున్నారు. అందువల్ల సమస్య పాకిస్తానీ నటుడు మన దేశంలో రూపొందిన ఒక సినిమాలో నటించడం కాదు, అది విడుదల కాకపోవడం లేదా విడుదల కావడం కాదు.. మన దేశానికి వ్యతిరేకమైన విద్రోహ ప్రవృత్తి మన దేశంలోని చలనచిత్ర రంగ నిర్వాహకులను ఆవహించి ఉండడం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’ బీభత్సకారులు జమ్మూకశ్మీర్‌లోని ఊరీ వద్ద పదిహేడు మంది మన సైనికులను హత్యచేయడం ‘విస్తృత జిహాద్’లో ఒక ఘటన.. ఈ ఘటన వల్ల మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి శత్రువన్న కనువిప్పు మన దేశంలోని ప్రముఖులకు, మేధావులకు, పారిశ్రామికవేత్తలకు కలుగలేదు.. ప్రత్యేకించి హిందీ చలనచిత్ర రంగపు ‘ఘరానా’లకు కలుగలేదు! పాకిస్తాన్ క్రీస్తుశకం 1947లో ఏర్పడి నాటి నుంచి కూడా అక్కడి ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా శత్రుత్వం వహించి ఉంది, మన దేశంలో నిరంతరం ‘జిహాదీ’ తోడేళ్లను ఉసిగొల్పుతోంది! అందువల్ల ‘ఊరీ’ ఘటన జరగడానికి పూర్వం దశాబ్దుల తరబడి పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి శత్రువన్న వాస్తవం, మన దేశాన్ని బద్దలుకొట్టడానికి యత్నిస్తోందన్న వాస్తవం మన దేశంలోని సామాన్య ప్రజలకు తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు.. చలనచిత్ర రంగంలోని ఘరానాలకు తెలియదా? ‘ఏ దిల్ హై ముష్కిల్’- ఇది బాధామయ హృదయం- అన్న హిందీ సినిమా నిర్మాణాన్ని మొదలుపెట్టే నాటికి, నిర్మించిన కరణ్‌జోహార్‌కి తెలుసు! అయినప్పటికీ మన దేశంలో ‘నటులు’ దొరకనట్టు ఒక పాకిస్తానీ నటుడిని ఎందుకని దిగుమతి చేసుకున్నాడు? ఇక ముందు పాకిస్తానీ నటులతో సినిమాలు తీయబోనని ఈ కరణ్‌జోహార్ వాగ్దానం చేశాడట! ఇంతకుముందు ఎందుకు తీసినట్టు? దేశభక్తికి సమాంతరంగా దేశ విద్రోహం కూడ ముంబయి చలనచిత్ర పరిశ్రమలో నిహతమై ఉంది.. లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్‌దావా, జాయి ఏ మహమ్మద్ వంటి ముఠాలు ‘్భరత్‌ను బద్దలుకొట్టడం తమ లక్ష్యమని’ బహిరంగంగా చాటుతుండిన సమయంలోనే ఈ పాకిస్తాన్ నటుడు ప్రధానుడుగా భారతీయ నిర్మాత ఈ ‘ఏ దిల్...’ చిత్రాన్ని నిర్మించాడు!
ఊరీ ప్రాంతంలోని మన సైనిక శిబిరాలపై దొంగచాటు దాడులు జరిపి మన సమర వీరులను మట్టుపెట్టింది తామేనని పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న బీభత్స సంస్థ లష్కర్ ఏ తయ్యబా అక్టోబర్ 25వ తేదీన మరోసారి ప్రకటించింది! కానీ అప్పటికే ఈ పాకిస్తాన్ ‘ఘరానా’ నటుడు అభినయించిన ‘సినిమా’ను విడుదల చేయించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషిచేసి వ్యతిరేకులను ఒప్పించింది! ఈ వ్యతిరేకులు ప్రధానంగా ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ వారు. ‘ఊరీ’లో పాకిస్తాన్ జిహాదీలు మన సైనికులను హత్యచేసిన వెంటనే పాకిస్తానీ నటులు మన దేశం నుండి వెళ్లిపోవాలని ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’- మ.న.సే.-వారు హెచ్చరించారు. నలబయి ఎనిమిది గంటలలోగా వారు మన దేశం నుండి నిష్క్రమించాలని కూడ ‘మనసే’ స్పష్టం చేసింది. పాకిస్తానీలు నటించిన చలనచిత్రాలను మన దేశంలో విడుదల చేయరాదన్నది ‘మనసే’ వారి మరో కోరిక! ‘మనసే’ వారు ఇలా కోరడం జాతీయతా నిష్ఠకు, దేశ ప్రజల సమష్టిహితానికి సంబంధించిన అంశం! నిజానికి ‘ఊరీ’పై దాడి జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వమే ఈ పాకిస్తానీ నటులను దేశం నుండి వెళ్లగొట్టి ఉండాలి! చలనచిత్రాలు, క్రీడలు, విందు భోజనాలు, ఇష్టాగోష్ఠులు సుహృద్భావ మైత్రికి, సాదర్య భావానికి చిహ్నాలు, కానీ తమ కుటుంబ సభ్యులను హత్యచేసిన వారితో కలసి హతుల బంధువులు ఇలా ఉమ్మడిగా వినోద విలాస వికృత విన్యాసాలకు పాల్పడే వారిని మాతృదేవి క్షమించదు, మాతృభూమి క్షమించదు.. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ నటుడు అభినయించిన ‘చిత్రాన్ని’ సురక్షితంగా విడుదల చేయించగలమని దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 20న ‘సినిమా వాళ్ల’కు హామీనిచ్చాడు! ఈ హామీని మహారాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది! ‘సినిమా’ విడుదల అవుతోంది! మహీరాఖాన్ అనే మరో ఘరానా పాకిస్తానీ ముంబాయి నటుడు షాహ్‌రూఖ్‌ఖాన్ అనే వాడితో కలసి మరో హిందీ చిత్రంలో అభినయించిందట! ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ సైతం చివరికి అంగీకరించిందట! జాతీయతా నిష్టపై, దేశ సమగ్రతపై, దేశ భద్రతపై, మన సర్వ సతంత్ర సార్వభౌమ అధికారంపై వాణిజ్య వికృతి సాధించిన విజయమిది! వాణిజ్య ప్రపంచీకరణ తొండ దశను దాటి ఊసరవెళ్లిగా రూపాంతరం చెందింది..
‘ప్రపంచీకరణ’ ప్రవచిస్తున్న ‘దేశాల సరిహద్దులు చెరగిపోవడ’మంటే ఇదే.. భరతమాత వరాల బిడ్డలైన సైనికులు ‘నిరంతర నిర్‌నిద్రులై’ భరతభూమి సరిహద్దులు చెరగిపోకుండా సంరక్షిస్తున్నారు. దేశ హితం కంటే వాణిజ్య ప్రయోజనాలు ప్రధానమంటున్న ‘ప్రపంచీకరణ’ తొత్తులు మాతృభూమి సరిహద్దులను చెరపివేయడానికి మళ్లీమళ్లీ యత్నిస్తున్నారు. తెలిసి చేసినప్పటికీ తెలియక చేసినప్పటికీ తప్పు తప్పే! దేశ విద్రోహకర నేరాల విషయంలో ఇది మరింత నిష్ఠతో అన్వయం అవుతోంది! నేరం చేసినవారు శిక్ష పొందాలి! కానీ తాము శిక్షను పొందడం వల్ల, తమ కారాగృహ నిర్బంధం వల్ల తమ వృత్తి పాడైపోతుందని, తమ ఉపాధి నష్టమవుతుందని, తమ కుటుంబం వారు నిద్రాహారాలు కోల్పోతారని, తమ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని, తన భార్య ‘గోరుచుట్టు’ వ్యాధికి చికిత్స జరిగే సమయంలో వైద్యశాలలో తాను ఆమె పక్కన కూర్చుని ఓదార్చడానికి వీలుండదని ఘరానా నేరస్థులు ఇటీవలి కాలంలో న్యాయస్థానాలలో విన్నపాలను చేస్తున్నారు! ఈ ‘ఘరానా’ నేరస్థుల విన్నపాల గురించి, వారి మనోభావాలకు కలిగిన గాయాల గురించి, కారాగృహవాసం వల్ల వారికి కలుగుతున్న అసౌకర్యం గురించి ‘మానవీయ శ్రద్ధా- హ్యూమన్ ఇంటరెస్ట్’- కథనాలు విరివిగా ప్రచారం కావడం కూడ మన దేశంలో కొనసాగుతున్న ప్రహసనం! జేబుదొంగలు, తిండిని దొంగిలించి కడుపునింపుకున్న వారి విషయంలో ఇలాంటి కథనాలు ప్రచారం కావు. దేశ విద్రోహులు, ఘరానా ఆర్థిక నేరస్థుల విషయంలోనే ప్రచారకర్తలకు ఈ ‘మానవీయ శ్రద్ధ’తన్నుకొని వస్తోంది! తమ కుటుంబంలోని ఒక వ్యక్తికి ముక్కుమీద ఏర్పడిన ‘పుండు’కు శస్తచ్రికిత్స జరిగే సమయంలో తాను వైద్యశాలలో ఉండాలని అందువల్ల తనకు తాత్కాలిక నిర్బంధ విముక్తిని ప్రసాదించాలని గతంలో సంజయదత్తు అనే హిందీ చిత్ర అభినయవేత్త కోరాడు. దీనికి ‘మానవీయ శ్రద్ధావంతుల’ గొప్ప ప్రచారం కూడా లభించింది. ఐదేళ్ల కంటే తక్కువ సమయం జైల్లో గడిపిన సంజయదత్‌కు నాలుగుసార్లు ఇలా ‘పెరోల్’ లభించింది! శిక్షాకాలం పూర్తికాక పూర్వమే అతగాడిని మహారాష్ట్ర ప్రభుత్వం జైలునుండి విడుదల చేసింది.. 1993లో ముంబయిలో భయంకరమైన పేలుళ్లు జరిపించి పాకిస్తాన్‌కు పారిపోయిన దావూద్ ఇబ్రహీం ముఠాతో సంజయ్‌దత్‌కు సన్నిహిత మైత్రి ఉందన్న అభియోగం ఋజువుకాలేదు.. సంజయ్‌దత్ తన ఇంట్లో అక్రమంగా మారణాయుధాలు నిలువచేసి ఉంచాడన్న అభియోగం నిజమని న్యాయనిర్ధారణ జరిగింది. అభియోగ విచారణ సమయంలో ఆయన ఆరు నెలలపాటు విదేశాలకు వెళ్లి ‘సినిమా షూటింగ్’లో పాల్గొనడానికి అనుమతి లభించింది. ఆ సినిమాను విదేశాలలోకాక మన దేశంలోనే నిర్మించుకోవాలన్న న్యాయ నిర్దేశం వెలువడి ఉండవచ్చు, వెలువడలేదు.. ఇదంతా ఘరానా నేరస్థుల పట్ల వివిధ రంగాల నిర్వాహకులకున్న మానవీయ శ్రద్ధ.. చిన్నచిన్న నేరస్థులకు ఈ సదుపాయం లేదు!!
ఇప్పుడు ఈ ‘మానవీయ శ్రద్ధ’ను ప్రముఖులు, అధికాధిక రాజకీయ పక్షాలు, ప్రభుత్వాల నిర్వాహకులు కలిసికట్టుగా కరణ్ జోహార్‌పై కురిపిస్తున్నారు, ముంబయిలోని హిందీ చిత్ర నిర్మాతలపై కురిపిస్తున్నారు. కరణ్‌జోహార్ ఈ ‘ఏ దిల్...’ నిర్మించడం మొదలుపెట్టేనాటికి- ‘ఊరీ’ ఘటన జరిగిన తరువాత మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వ భారత వ్యతిరేక బీభత్స జిహాదీ స్వభావం కరణ్‌జోహార్‌కి, ఇతర ముంబయి నిర్మాతలకు తెలిసి వచ్చిందట! అంతకు పూర్వం పాకిస్తాన్ మనకు మిత్రదేశమని వీరంతా విశ్వసించారట! తెలియక చేసిన అపరాధాన్ని మన్నించి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోనివ్వాలట! కానీ కరణ్‌జోహార్ తదితర హిందీ చిత్ర నిర్మాతలు ఏళ్లతరబడి తెలిసి చేస్తున్న అపరాధమిది.. కనీసం 1993లో ముంబయిలో జరిగిన పేలుళ్ల తరువాతనైనా పాకిస్తాన్ మనకు శత్రు దేశమని వీరు గుర్తించారు. అయినప్పటికీ దేశంలో కళాకారులు లేనట్టు పాకిస్తాన్ నటీనటులను ఏళ్లతరబడి దిగుమతి చేసుకున్నారు.. మాతృదేశానికీ విదేశాలకూ మధ్య, మిత్ర దేశాలకు, శత్రు దేశాలకు మధ్య తేడా చూపరాదన్న వికృత ‘సమానత్వ ప్రవృతి’ మన దేశంలోని వివిధ రంగాలలోని అత్యధిక ప్రముఖులను ఆవహించి ఉంది..
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రభుత్వం మనదేశంలోని అడవులను నిర్మూలించింది.. మహావృక్షాలను నరికివేసి కలపను ఓడలకెత్తి తమ దేశానికి తరలించింది! బ్రిటన్ దుండగుల దుస్తంత్రం గురించి తెలియని ‘అమాయకులైన’ ఘరానా వ్యాపారులు నిరంతరం చెట్లను నరికించి బ్రిటన్‌కు ఎగుమతి చేసి కోట్ల రూపాయలను గడించారు. శ్రీరామ్ అనే మహాత్మాగాంధీ అనుచరుడు ‘మాల్‌గుడి’ సమీపంలోని ‘మెంపి’ కొండ ప్రాంతంలో ఈ ‘వృక్ష నిర్మూలన’ను నిరోధించడానికి జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించాడు! ఒకచోట వృక్షాలను నరుకుతున్న దృశ్యాన్ని చూశాడు.. వద్దని కోరుతూ సత్యాగ్రహం చేశాడు! వ్యాపారి శ్రీరామ్ వద్దకు వచ్చాడు. ‘అయ్యా.. నేను కూడా మహాత్మాగాంధీ అనుచరుడిని, ఆయనంటే నాకు భక్తి.. ఆయన హరిజన నిధికి ఐదువేల రూపాయల విరాళం ఇచ్చాను..’- అని ఘరానా వ్యాపారి శ్రీరామ్‌కు చెప్పాడు! ‘మరి బ్రిటన్ ప్రభుత్వం వారి యుద్ధనిధికి ఎంత ఇ చ్చా వు..??’అని శ్రీరామ్ అడిగాడు. ‘దానికి కూడ ఐదువేల రూపాయలే ఇచ్చాను..’ అన్నది వ్యాపారి సమాధానం! అతగాడికి మాతృదేశం, దురాక్రమించిన దేశం సమానం! రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ఈ ‘చరిత్ర’ వివరించి ఉన్నాడు! ఈ ప్రసిద్ధ ఆంగ్ల రచయితను దేవానంద్ అనే హిందీ నటుడు మోసం చేయడం వేరే కథ.. ఇప్పుడు హిందీ చిత్ర నిర్మాతలలో అధికులకు మాతృదేశం, పాకిస్తాన్ రెండూ సమానం! నటులను దిగుమతి చేసుకొని పోషించారు! మన సైనికులకు విరాళం ఇస్తారట..

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com