మెయిన్ ఫీచర్

ఆనందంగా కాల్చండి .. అలరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది పిల్లలు స్టైల్‌గా చేతుల్లో బాంబు పట్టుకుని కాల్చే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల చేతులు కాలే ప్రమాదం ఉంది.
సినిమాల్లో రజనీకాంత్ అలా చేస్తే తనకి కోట్ల రూపాయలు ఇస్తారు. అదే నిజ జీవితంలో మనం చేస్తే ప్రమాదానికి గురై ఆసుపత్రికి లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

గత ఏడాది దీపావళి నాడు ఓ అబ్బాయి తన స్నేహితులతో నోట్లో బాంబు పెట్టుకొని అంటిస్తానని సవాల్ చేశాడు. సవాల్ చేయడం సులువే. ఆ సవాల్ శృతి తప్పితే దాని పరిణామాలు ఎదుర్కోవడం నరకం. రజనీకాంత్ సిగరెట్టు పెదాలమధ్య పెట్టుకున్నట్టు ఈ పిల్లాడు బాంబు పెట్టుకుని పేలే సమయానికి బయటికి ఊదేద్దామనుకున్నాడు. ఊదడంలో ఒక సెకండు లేట్ అయింది. బయట పేలాల్సిన బాంబు నోట్లో పేలింది. ఆనందంగా గడపాల్సిన దీపావళి రోజు వాళ్లింట్లో ఏడుపులు. ఆ పిల్లవాడి పైపెదాలు, క్రింది పెదాలు రెండుగా చిట్లాయి. మూతంతా కాలింది. తగిన చికిత్స చేయడం జరిగింది. మళ్లీ దీపావళి వచ్చేసింది.
పటాకులు కాలుస్తున్నప్పుడు కానీ దీపాలు పెడుతున్నప్పుడు కానీ మీకు కానీ, మీ ఇంట్లో వాళ్లకి కానీ లేక మీ చుట్టుప్రక్కల వున్నవాళ్లకి కానీ కాలితే మీరు పాటించాల్సిన సూచనలు.
ముందుగా మీరు కంగారుపడద్దు.
మంట ఒంటిని అంటి ఉంటే దాన్ని ఆర్పే ప్రయత్నం చేయండి (నీళ్లు జల్లో లేక గుడ్డ కప్పో).
మంట ఉన్న ప్రదేశం నుంచి బాధితులని చల్లగా ఉన్న ప్రదేశానికి తరలించండి.
కాలిన చోట ఉన్న దుస్తులను, ఆభరణాలను తీసివేయండి.
ఓ పది నిమిషాలు పాటు చల్లని నీరు ఆ కాలిన చోట పారేలా చూడండి. బాంబు పేలుళ్ళవల్ల కలిగే కాల్పులలో ఆ బాంబు తయారుచేయడానికి ఉపయోగించిన మందు పొడి ఆ కాలిన ప్రాంతాలలో పడే ప్రమాదం ఉంది. పైన చెప్పినట్టు ఓ పది నిమిషాలు నీరు గనక పోస్తే ఆ పొడి నీటితోపాటు కొట్టుకుపోయి కాలిన ప్రాంతం శుభ్రంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. చల్లనీరు పోయటం వల్ల మంట తగ్గేందుకు ఆస్కారం ఉంది. మంచు గడ్డ పెట్టరాదు.
అలా శుభ్రపరిచిన ప్రదేశంపై శుభ్రమైన ఓ గుడ్డను కప్పి వైద్యుడిని సంప్రదించండి.
బొబ్బల్ని పేల్చే ప్రయత్నం, కాలిన చోట చర్మం తొక్క తీసే ప్రయత్నం మీరు చేయకండి. టూత్‌పేస్ట్ అని, పసుపని మీకు తెలిసీ తెలియనివన్నీ రాయడం మంచిదికాదు. మీరు తెలిసీ తెలియని వైద్యం చేయకండి.
కాలిన ప్రదేశాన్ని చల్లని నీరుతో పది నిమిషాలు శుభ్రపరిచి ఓ శుభ్రమైన పొడిగుడ్డ దానిపై కప్పి దగ్గరలోని వైద్యు డ్ని సంప్రదించండి. తను ఏం చేస్తే ఉత్తమమో నిర్థారిస్తాడు.
కొంచెం కాలినా ఎక్కువ కాలినా వెంటనే వైద్యుడ్ని కలిసి తరుణోపాయం ఏంటో తెలుసుకోవడం మంచిది. టి.టి. ఇంజెక్షన్ తీసుకోవడం ఉత్తమం. పటాకులు కాల్చేప్పుడు ముఖ్యంగా కాలే ప్రదేశాలు రెండు- 1. చేతులు 2. ముఖం. కొంతమంది పిల్లలు బాం బు కాల్చాక పేలకపోతే మంట అంటిందా లేదా అని చాలా దగ్గరకు వెళ్లి బాంబుని చూసే ప్రయత్నం చేస్తారు. ఆ క్షణంలో బాంబు పేలితే ముఖంపై కాలే ప్రమాదం ఉంది. మరికొంతమంది బాంబు చేతిలో పట్టుకొని పేలే సమయానికి గాలిలో విసరే ప్రయత్నం చేస్తారు. అది పొరపాటున దారినపోయే ఎవరి ముఖంపైనో పడి పేలితే? మన ఆనందం ఇంకొకరికి విషాదం కావద్దు. పటాకులు జనాలకి దూరంగా, ఖాళీ స్థలంలో కాల్చడం మంచిది. భాగ్యనగరంలో స్థలం ఉండడమే కష్టం. ఇక కాల్చడానికి ఖాళీ స్థలాలు ఎక్కడుంటాయని ప్రశ్నించేవారు డాబాపైనో, రోడ్డుమీదో వచ్చిపోయే జనాన్ని కొంచెం చూసి వారు దూరంగా పోయాక కాల్చుకోవడం ఉత్తమం. రోడ్డుపై ప్రయాణం చేసేవారిలో బాంబులంటే భయం ఉన్నవారు ఉంటారు. పిల్లలు, ఆడవాళ్లు ఉంటారు. వాళ్లు క్షేమంగా ఇంటికెళ్లడం మన చేతుల్లో వుంది. చిన్నారులూ... జాగ్రత్తగా కాల్చండి.

- డా. రమేష్ శ్రీరంగం,సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

- డా. రమేష్ శ్రీరంగం