మెయన్ ఫీచర్

పటేల్ మరో పదేళ్లు జీవించి ఉంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పక్షం తనను ప్రధానమంత్రి గా ఎన్నుకున్నప్పటికీ, మహాత్మాగాంధీ అభీష్టం మేరకు నెహ్రూకు ఆ పదవిని అప్పగించడం సర్దార్ పటేల్ చేసిన తప్పిదం! అధికార లాలస లేని వల్లభ భాయి సముత్కర్ష సంస్కార జీవన ప్రవృత్తికి ఇది పరమ ప్రమాణం.. కావచ్చు! కానీ దీనివల్ల దేశానికి ఘోరమైన నష్టం జరిగింది!
..............................
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 142వ జయంతి ఉత్సవాలకు ‘చైనీయ వస్తు బహిష్కరణ’ ఉద్యమం నేపథ్యం కావడం సముచితమైన పరిణామం. చైనాతో మన దేశానికి సరిహద్దు ఏర్పడకుండా నిరోధించడానికి క్రీస్తుశకం 1949వ, 1950వ సంవత్సరాలలో ఉప ప్రధానమంత్రిగా ఉండిన వల్లభ భాయ్ పటేల్ ప్రయత్నించడం చరిత్ర. టిబెట్ దేశం సహస్రాబ్దులపాటు చైనా కు, మన దేశానికీ మధ్య నెలకొని ఉండేది. టిబెట్ స్వతంత్ర దేశంగా కొనసాగి ఉండి ఉంటే మనకు చైనాతో ఇంత పెద్ద సరిహద్దు ఉండేది కాదు! చైనా దురాక్రమణ ప్రమాదం మనకు ఉండేది కాదు. మన దేశానికి ఉత్తరంగా దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల వైశాల్యం కలిగిన టిబెట్ దేశం ఉండేది. టిబెట్‌కు ఉత్తరంగా ఈశాన్యంగా ఉన్న చైనా మన దేశంలోకి చొరబడడానికి అవకాశం లేదు! కానీ వేల ఏళ్లుగా కొనసాగిన ఈ నైసర్గిక స్వరూపాన్ని చైనా చెరపి వేసింది. 1959లో టిబెట్‌ను పూర్తిగా దురాక్రమించింది, ఫలితంగా చైనా సరిహద్దు దక్షిణంగా జరిగి మన దేశపు ఉత్తర సరిహద్దుకు చేరింది. మనకూ చైనాకు మధ్య దాదాపు 4,100 కిలోమీటర్ల సరిహద్దు ఏర్పడింది. చైనాకు సువిశాలమైన త్రివిష్టప ప్రాకృతిక సంపద లభించింది, చైనా ఆర్థికంగా బలపడింది. మనకు కాపలా కాయడానికి అతిపెద్ద సరిహద్దు లభించింది. శత్రు దురాక్రమణ ప్రమాదం, రక్షణ వ్యయం పెరిగాయి. మూడేళ్లలోపు సమయంలోనే చైనా ప్రభుత్వం మన దేశంపై 1962లో దురాక్రమణ జరుపగలిగింది! సర్దార్ పటేల్ సలహాలను 1949-1950 సంవత్సరాలలో అప్పటి ప్రధానమంత్రి పట్టించుకోని ఫలితం ఇది.. చైనా వస్తుబహిష్కరణ అందువల్ల సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి! రామ్‌దేవ్‌బాబా లాంటి స్వదేశీయ ఉద్యమకారులు చైనా వస్తు బహిష్కరణకు పిలుపులనిచ్చారు! రంగారెడ్డి- వికారాబాద్- జిల్లాలోని అనేక గ్రామాలలో చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం మొదలుకావడం హర్షణీయ పరిణామం..
నిజాం నిరంకుశత్వం నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం చేయగలగడం వల్లభ భాయి సాధించిన జాతీయ ప్రాదేశిక సమగ్రతకు పరాకాష్ఠ. ఈ ప్రస్థాన క్రమంలో ఆ మహనీయుడు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని మళ్లీ దేశంలో విలీనం చేయగలిగాడు! ఇలా జమ్మూకశ్మీర్, జునాగఢ్, నైజాం మొదలైన 575 సంస్థానాలు ప్రధాన భారత భూమిలో కలసిపోవడం చారిత్రక పునరావృత్తి! ఎందుకంటె ఇవన్నీ యుగాలుగా, తరాలుగా అఖండ భారతదేశంలో అవిభాజ్యాలు! ‘విభజించిన’ బ్రిటన్ దురాక్రమణదారులు నిష్క్రమించగానే ‘సంస్థానాలు’- స్టేట్స్- మళ్లీ భారత సర్వసత్తాక స్వతంత్రభూమిలో కలసిపోవడం పునరావృత్త సహజ పరిణామం! కానీ పరిణామక్రమాన్ని, సంస్కార పరంపరను ప్రస్ఫుటింపచేయడానికి నిరంతరం మానవ మాధ్యమం అనివార్యం! ఆ మహనీయ మానవుడు వల్లభ మంత్రి! కొంతమంది సంస్థానాధీశులు ఈ సహజ స్వాతంత్య్ర సమైక్య సమగ్రతా స్ఫూర్తికి వైరుధ్యాలుగా పరిణమించారు, అతి తీవ్రమైన వైరుధ్యం ‘నిజాం’ సర్కారోడు! అందువల్లనే సర్దార్ పటేల్ నిజాం పెత్తనం చెలాయించిన ప్రాంతాన్ని వైరుధ్యం నుంచి విముక్తం చేయవలసి వచ్చింది! క్రీస్తుశకం 1323లో జిహాదీ వికృత చిత్తవృత్తులైన విదేశీయులు కాకతీయ మహాసామ్రాజ్యాన్ని వంచనతో కూలద్రోశారు. అప్పటినుంచి అన్యమత విధ్వంసం లక్ష్యమైన విదేశీయుల దురాక్రమణకు 625 ఏళ్లు బలైపోయిన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించింది! జిహాదీల బీభత్సకాండకు పరాకాష్ఠ చివరి ‘నిజాం’ నిరంకుశత్వం! సర్దార్ పటేల్ ఇలా హైదరాబాద్ సంస్థానానికి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించగలిగాడు. కానీ సమగ్ర జమ్మూకశ్మీర్‌కు మాత్రం ఆయన ఇలా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రసాదించలేకపోయాడు! సగం కశ్మీర్ పాకిస్తాన్, చైనాల ఉమ్మడి దురాక్రమణలో కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం జమ్మూకశ్మీర్ విలీన ప్రక్రియ 1947లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధాన గ్రస్తం కావడం! ‘జవము’ అని అంటే బలము, ‘హార’ము అని అంటే హరించుట, దొంగిలించుట, నశింపచేయుట! జాతీయ ‘జవహరుడు’ నెహ్రూ! త్రివిష్టప దేశంగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన టిబెట్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టదలచిన సర్దార్ పటేల్‌ను నెహ్రూ నిరోధించడం పటేల్‌కు ఎదురైన రెండవ వైఫల్యం! ‘మన దేశాన్ని నమ్ముకున్న టిబెట్‌ను చైనా బారినుండి మనం కాపాడలేకపోతున్నాము.. టిబెట్ స్వాతంత్య్రాన్ని మనం రక్షించగలగాలి’-అని 1949లోను, 1950లోను నెహ్రూకు వ్రాసిన ఉత్తరాలలో పటేల్ ఆవేదన చెందాడు. ‘చైనా స్వాతంత్య్రం చచ్చిపోయింది..’ అని నెహ్రూ సమాధానమిచ్చాడు!
సర్దార్ పటేల్ మరో పదేళ్లు జీవించకపోవడం దేశానికి దాపురించిన వైపరీత్యం.. 75వ ఏట పార్ధివ శరీరం పరిత్యజించిన పటేల్ 85ఏళ్లు జీవించి ఉండవచ్చు! జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుండి దేశాన్ని విముక్తం చేయకపోవడం సర్దార్ పటేల్ చేసిన ప్రధానమైన తప్పిదం.. ‘ప్రమాదో ధీమతాం అపి.’అన్న వ్యవహార వాస్తవం ఇలా మరోసారి ధ్రువపడింది. ‘్ధమంతులు సైతం పొరబడడం సహజం!’. 1946లో కాంగ్రెస్ పక్షం తనను ప్రధానమంత్రి గా ఎన్నుకున్నప్పటికీ, మహాత్మాగాంధీ అభీష్టం మేరకు నెహ్రూకు ఆ పదవిని అప్పగించడం సర్దార్ పటేల్ చేసిన తప్పిదం! అధికార లాలస లేని వల్లభ భాయి సముత్కర్ష సంస్కార జీవన ప్రవృత్తికి ఇది పరమ ప్రమాణం.. కావచ్చు! కానీ దీనివల్ల దేశానికి ఘోరమైన నష్టం జరిగింది! సగానికి పైగా జమ్మూకశ్మీర్ చైనా, పాకిస్తాన్‌ల దురాక్రమణకు గురికావడం, టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోవడం అత్యంత ఘోరమైన నష్టాలు! నిజానికి టిబెట్ స్వాతంత్య్రాన్ని నెహ్రూ చంపేశాడు, ఆయన తలకెక్కిన చైనా మైత్రి మత్తు ఆయన చేత ఈ పని చేయించింది! టిబెట్ స్వాతంత్య్రం కోల్పోవడం వల్ల, చైనాగ్రస్తం కావడంవల్ల జరిగిన తక్షణ విపరిణామం జమ్మూకశ్మీర్‌లోని తూర్పు, ఈశాన్య ప్రాంతం- లడక్‌లోకి చైనా చొరబడిపోవడం. బ్రిటన్ మన దేశంపై పెత్తనం చెలాయించిన సమయంలో లడక్‌కూ టిబెట్‌కూ మధ్య సరికొత్త సరిహద్దు ఏర్పడింది. ఈ సరిహద్దు ఏర్పడక పూర్వం మనం టిబెట్‌లోకి వెళ్లడానికి, కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని సందర్శించుకొనడానికి ఎవరి అనుమతి అవసరం ఉండేది కాదు! లడక్‌లోను, ‘ఉత్తర కాశ్మీర్-గాంధార’ సరిహద్దులోని దరదస్థాన్‌లోను టిబెట్‌లోను నేపాల్ ఉత్తర భాగంలోను, సిక్కింలోను, అరుణాచల్‌లోను మాట్లాడే భాషలన్నీ ‘బోటీ’ కుటుంబానికి చెందినవి. ఈ ‘బోటీ’ భాషల లిపి సనాతన బ్రాహ్మీలిపికి రూపాంతరాలు! ప్రాచీన కాలంలో టిబెట్ కూడా భారతదేశపు అంతర్భాగం.. ద్వాపర యుగం చివరిలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ‘రూపతి’ అనే కురువంశపు రాజకుమారుడు పాండవుల వైపు చేరలేదు, కౌరవులతో కూడ లేదు.. యుద్ధాన్ని నిరసించి కైలాస పర్వత ప్రాంతంలో స్థిరపడిపోయాడు. ఆ తరువాత కలియుగం ఆరంభంలో అతడు ‘త్రివిష్టప’ -టిబెట్-కు తొలి పరిపాలకుడయ్యాడు! కలియుగం పదిహేడవ శతాబ్ది- క్రీస్తు పూర్వం పదహైదవ శతాబ్దినాటి- వౌర్య వంశపు అశోకుడు బౌద్ధ మతాన్ని విస్తరింపచేశాడు. అప్పటివరకూ ‘త్రివిష్టపం’ సువిశాల భారత రాజ్యాంగ వ్యవస్థలోని ఒక రాజ్యం! ఆ తరువాత ‘టిబెట్’ మన దేశం నుంచి దూరంగా జరిగింది. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దిలో ఆది శంకరాచార్యులు ఉదయించిన తరువాత, క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో అలెగ్జాండర్ అనే గ్రీకు బీభత్సకారుడు మన దేశంలో చొరబడడానికి చేసిన ప్రయత్నాన్ని ‘గుప్త సమ్రాట్టు’లు తిప్పికొట్టిన తరువాత సనాతన వేద మతాలు మళ్లీ దేశమంతటా విస్తరించాయి! గాంధారంలోను, బర్మాలోను, శ్రీలంకలోను, త్రివిష్టపంలోను బౌద్ధ మత ప్రాబల్యం యధాతథంగా కొనసాగింది! అఖండ భారత్‌లోని నాలుగు దిక్కుల చివర ఉన్న ఈ ప్రాంతాలు ప్రధాన భూభాగం నుండి విడివడి ప్రత్యేక దేశాలుగా అవతరించాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాల భాషలు ‘సంస్కృత’ భాషకు రూపాంతరాలు అయినందున ప్రధాన భారత భూభాగంలో వీటికి సాంస్కృతిక సమానత్వం కొనసాగింది! బ్రిటన్ దురాక్రమణ ఈ సాంస్కృతిక సమానత్వాన్ని భంగపరచింది! బ్రిటన్ దురాక్రమణ సాగిన సమయంలో, జమ్మూకశ్మీర్ సహా వందలాది సంస్థానాలు గల నలబయి ఐదు శాతం భరత భూమిని ఈ దేశంలో పుట్టిన ‘రాజులు’, ‘సామంతులు’ పాలించారు. వీరందరూ బ్రిటన్ ‘పరమోన్నత అధికారం’- పారవౌంటసీ- శిరసావహించి పాలించారు! మిగిలిన యాబయి ఐదు శాతం ‘్భరత్’ను బ్రిటన్ ప్రభుత్వం స్వయంగా ‘పాలించింది’! అందువల్ల బ్రిటన్ ముక్త భారత్‌లో ‘నలబయి ఐదు శాతం’ భూమికి చెందిన ‘సంస్థానాలు’ సహజంగా కలసిపోవాలన్నది సర్దార్ పటేల్ చెప్పిన మాట!
‘యధాతథ స్థితి’- స్టాండ్ స్టిల్- ఒప్పందాలు, విలీనం- యాక్సెషన్- ఒప్పందాలు బ్రిటన్ వారసత్వ చిహ్నాలు! హైదరాబాద్, జమ్మూకశ్మీర్ వంటి సంస్థానాలన్నీ విదేశీయ దురాక్రమణకు ముందు అనాదిగా భారత్‌లోని అవిభాజ్య ప్రాంతాలు! ఈ వాస్తవాన్ని ‘హైదరాబాద్’ నిజాం అంగీకరించలేదు. జమ్మూకశ్మీర్ పాలకుడు మొదట మొండికెత్తినప్పటికీ తరువాత ఈ సనాతన-శాశ్వత- ప్రాదేశిక సమగ్రతా వాస్తవాన్ని అంగీకరించాడు! అంగీకరింపచేసినవాడు సర్దాల్ పటేల్!
కశ్మీర్ విలీనం విషయంలో సర్దార్ పటేల్ అనుసరించిన వ్యూహం గురించి ప్రముఖ రచయిత, సాంస్కృతిక చరిత్రకారుడు స్వర్గీయ భండారు సదాశివరావు తమ ‘గురూజీ’ గ్రంథంలో ఇలా వివరించారు. ‘ఇక ఆలస్యం ప్రమాదకరమని సర్దార్ పటేల్ నిశ్చయించుకొన్నారు. కశ్మీరు సంస్థానం దివాన్ మెహర్ చంద్ మహాజన్‌తోను, గురూజీతోను సంప్రదింపులు జరిపారు. కశ్మీర్ మహారాజు హరిసింగ్‌కు గురూజీ పట్ల శ్రద్ధ, ఆదరాలు ఉన్నాయని పటేల్‌కూ మహాజన్‌కూ తెలుసు. సంప్రదింపుల తరువాత 1947 అక్టోబర్ 10వ తేదీన గురూజీ ప్రభుత్వ విమానంలో శ్రీనగర్‌కు వెళ్లి ‘మహారాజా’తో చర్చలు జరిపారు.. చివరకు కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి మహారాజు అంగీకరించేట్టు చేసి 1947 అక్టోబర్ 19న గురూజీ తిరిగివచ్చి సర్దార్‌పటేల్‌కు వివరాలు తెలిపారు.’. ‘గురూజీ’ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ‘ద్వితీయ సర్‌సంఘ చాలక్’ - రెండవ అధ్యక్షుడు- మాధవ సదాశివ గోళ్వల్కర్!
ఇలా తాను విలీనం చేయగలిగిన కశ్మీర్‌ను ‘ఐక్యరాజ్యసమితి’కి ఎక్కించి ‘అంతర్గత సమస్య’ను అంతర్జాతీయం చేసిన నెహ్రూ నీతిని సర్దార్ పటేల్ నిరసించాడు. ఈ నిరసన ఫలితంగానే ‘హైదరాబాద్’ను ‘సమితి’కి నివేదించే ప్రయత్నాన్ని నెహ్రూ విరమించుకున్నాడు! కానీ టిబెట్ విషయంలో నెహ్రూను నియంత్రించడానికి వీలుగా క్రీస్తుశకం 1950 తరువాత పటేల్ జీవించకపోవడం భరతమాత దురదృష్టం..

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com