మెయన్ ఫీచర్

బేతాళప్రశ్నలకు బదులివ్వని ‘కొలీజియం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలోని అన్ని రంగాల్లో పారదర్శకత ఉండాలనీ, పక్షపాతానికి తావులేకుండా కార్యకలాపాలన్నీ నియమానుసారంగా జరగాలనీ పదేపదే ఆదేశాలు జారీచేస్తున్న న్యాయ వ్యవస్థలో పారదర్శకత ఎందుకు ఉండకూడదు..? ఈ ప్రశ్న ఇటీవలి కాలంలో తరచూ వినపడుతోంది. సర్వోన్నత న్యాయస్థానంతోపాటు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయమై అటు న్యాయవ్యవస్థ, ఇటు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న వాదోపవాదాలు ఈ ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తున్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, బదిలీలను పారదర్శకంగా జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని (నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్) సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. న్యాయమూర్తులే ఇతర న్యాయమూర్తులను నియమించుకునే ‘కొలీజియం’ విధానాన్ని సుప్రీం సమర్ధించుకున్నది.
కొలీజియం వ్యవస్థ రాజ్యాంగంలో కానీ, ఆ తరువాత జరిగిన సవరణలలో కానీ ఎక్కడా కనపడదు. 1990లో సుప్రీం కోర్టు రెండు తీర్పులను వెల్లడిస్తూ, సర్వోచ్ఛ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొంతమంది సీనియర్ న్యాయమూర్తులు కలిసి మిగిలిన జడ్జీలను నియమించుకునే కొలీజియం విధానాన్ని తనకుతానే రూపొందించుకున్నది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 2014లో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్’ (ఎన్‌జెఎసి) చట్టాన్ని 20 రాష్ట్రాల్లో అసెంబ్లీలు సైతం ఆమోదించాయి. రాష్టప్రతి ఆమోదంతో 13 ఏప్రిల్ 2015న అమలులోకి వచ్చిన ఎన్‌జెఎసి చట్టాన్ని అయిదుగురు జడ్జీల సుప్రీం ధర్మాసనం 16 అక్టోబర్ 2015న కొట్టివేసింది. దీంతో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి ఏది మెరుగైన విధానం? అన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. పలు సందర్భాలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టి. ఎస్.్ఠకూర్ సహా పలు కోర్టులు- కేంద్ర ప్రభుత్వం కారణంగానే జడ్జీల నియామకంలో ఆలస్యం జరుగుతోందని వ్యాఖ్యానిస్తూండగా, కొలీజియం సిఫార్సులు సరిగ్గాలేనందునే జడ్జీల నియామకాల్లో ఆలస్యం అనివార్యమవుతోందని ప్రభుత్వం స్పందిస్తున్నది.
కొలీజియం, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతూ ఉండగా, కొలీజియం పద్ధతిలోనే పారదర్శకత లేదని, వీలైనంత తొందరగా దీనిని సరిచేయాలంటూ సుప్రీంకోర్టులో సీనియారిటీలో అయిదవ జడ్జి అయిన జస్టిస్ చలమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొలీజియంలో పారదర్శకత తీసుకువచ్చేవరకూ ఆ సమావేశాలకు తాను హాజరుకానని చెప్పడమేకాకుండా, కొలీజియంలోని కొందరు సభ్యులకు- న్యాయమూర్తుల నియామకం ఏ ప్రాతిపదికన జరుగుతాయో తెలియదన్నారు. తమకు తామే ఆపాదించుకున్న అధికారాలతో కొలీజియం ఏర్పాటు చేసుకుని తమ తరువాతి తరం న్యాయమూర్తులని తామే నియమించుకుంటున్నప్పుడు పారదర్శకంగా ఎందుకు ఉండకూడదన్న ప్రశ్న ప్రజలకు కలుగుతున్నది. పార్లమెంటు, అనేక రా ష్ట్రాలు ఆమోదించిన ఎన్‌జెఎసి చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు తనంతటతానుగా కొన్ని ప్రమాణాలను, ప్రాతిపాదనలను ఎందుకు రూపొందించడం లేదన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది.
కొలీజియం సమావేశ వివరాలను రికార్డుచేయాలంటూ జస్టిస్ చలమేశ్వర్ చేసిన ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి రూమాపాల్ నవంబర్ 2011లోనే కొలీజియం వ్యవస్థను తూర్పారపట్టారు. కొలీజియం తన సహ న్యాయమూర్తులు చేస్తున్న అవకతవకలను పట్టించుకోవడం లేదని, ఆశ్రీత పక్షపాతం చూపిస్తున్నారని, అనవసర భేషజాలను చూపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా కొలీజియం వ్యవస్థపై తలెత్తుతున్న అనేక అనుమానాలు, ప్రశ్నలకు సరైన స మాధానాలు దొరక్క పోవడంతో ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నది. జడ్జీల నియామకానికి కారణాలు కానీ, అభిప్రాయాలు కానీ ఎక్కడా రికార్డు కావడం లేదు. కొలీజియంలోని ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తులు కొన్ని పేర్లను ఎంపికచేసి, వాటి ఆమోదం కోసం మిగిలిన వారి ముందు పెడుతున్నారనే భావన బలంగా ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జడ్జిగా నియమించే సమయంలో ఒక సభ్యుడు చేసిన అభ్యంతరాలను తోసివేస్తూ సదరు వ్యక్తిని అనుకూలంగా ‘మెజారిటీ సభ్యుల’ అభిప్రాయం సేకరించడం ఎంతవరకు సబబు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొలీజియంలో ఏమేం జరుగుతున్నాయో? ఎలా జరుగుతున్నాయో? ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో? బయటి ప్రపంచానికి తెలియడం లేదన్న వాదన కూడా గట్టిగా ఉన్నది. జడ్జీల నియామకాలు ప్రావీణ్యం, నైపు ణ్యం, అవగాహనా సామర్థ్యం, వృత్తి నిష్ఠ తదితర అంశాల ఆధారంగా జరుగుతున్నాయా? లే దా? అన్న అనుమానాలకు తావు కలిగిస్తున్నది. కొలీజియం చేసిన ఎంపిక నియామకాల్లో ఎనిమిది తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందుంచింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు, దేశ గౌరవానికి మంచిది కాదు. ‘కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీతనంతో వ్యవహరించాలి, నిష్పాక్షికంగా ఉండాలం’టూ జస్టిస్ చలమేశ్వర్ సహా పలువురు న్యాయ నిపుణులు చేస్తున్న డిమాండ్లను కొలీజియం ఎందుకు అంగీకరించడం లేదో అర్థం కావడం లేదు. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కేవలం కొంతమంది న్యాయమూర్తుల నిర్ణయాలకే పరిమితమా? ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ‘కోర్టులను మూసేస్తారా? న్యాయవ్యవస్థను పనిచేయకుండా చేస్తున్నారు’ అంటూ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం?
న్యాయమూర్తుల నియామకంలో జాప్యానికి కొలీజియం కూడా కారణమేనని చెప్పుకోవాలి. నిఘా విభాగాల (ఇంటెలిజెన్స్ బ్యూరో) అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, తమ దర్యాప్తులో ఎటువంటి ఆరోపణలు లేవని తేలిందంటూ వీరి పదోన్నతులను ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడులు వస్తున్నాయని, దేశ భద్రత, న్యాయవ్యవస్థ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఆమోదించలేమని అధికారులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో సుప్రీం కోర్టు కొలీజియం చేసిన 15-20 సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను తెలుపగా, వీటిని కొలీజియం అంగీకరించి ఆయా సిఫార్సులను వెనక్కు తీసుకున్నది. సుప్రీం న్యాయమూర్తిగా గోపాల సుబ్రహ్మణ్యంను సిఫార్సు చేసిన కొలీజియం ఆ తరువాత దానిని ఉపసంహరించుకోవడం ఇటీవలి కాలంలోని ఒక సంఘటన. ‘జడ్జీలు మాత్రమే మంచి జడ్జీలను నియమించుకోగలర’న్న వాదన నేతి బీరకాయ లాంటిదే. మద్రాసు హైకోర్టులో ఇటీవల ఒక జడ్జీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దుర్భాషలాడితే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేవు. సుప్రీం జడ్జి ఒకరు సమయానికి కోర్టుకు రాక పత్రికలకు ఎ క్కారు. కోర్టు మర్యాదలను పాటించని న్యాయమూర్తులు చాలామందే కనపడుతున్నారు. జస్టిస్ చలమేశ్వర్ వెలిబుచ్చిన అభిప్రాయాలతో జస్టిస్ కురియన్ జోసఫ్ కూడా ఏకీభవించారు. ఈ వ్యవస్థపై లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవల్సిన అవసరం ఉందని, దీనిని మెరుగుపరచేందుకు ‘గ్లాస్‌నోస్త్’, ‘పెరిస్ట్రోయికా’ వంటివి అవసరం ఉందని అన్నారు.
1993లో సుప్రీం చీఫ్ జస్టిస్ జి.ఎస్.వర్మ నేతృత్వంలో ‘సెకండ్ జడ్జెస్’ కేసులో తొమ్మిది మంది సభ్యులున్న బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగా కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. మొదట్లో చీఫ్ జస్టిస్‌తోపాటు ఇద్దరు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలతో కూడిన కొలీజియం న్యాయమూర్తుల నియామకం చేసేది. ఆ తరువాత దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరొక నలుగురు సీనియర్ జడ్జీల కొలీజియంగా మార్చారు. ఈ వ్యవస్థకు ఆద్యుడైన జస్టిస్ వర్మ తదనంతర కాలంలో ‘తాను ఇచ్చిన తీర్పును పునః సమీక్షించుకోవల్సిన అవసరం ఉన్నదని, కొలీజియం ఏర్పాటుపై తాను తలచినది మరొకటని’ అభిప్రాయపడ్డారు. దీని వౌలిక అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ 1998 జులైలో అప్పటి రాష్టప్రతి కె.ఆర్.నారాయణన్ లేవనెత్తిన అంశాలను కోర్టు పక్కకు పెట్టింది. ఈ వ్యవస్థను సవాల్ చేస్తూ జనవరి 2013లో సూరజ్ ఇండియా ట్రస్ట్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టివేసింది. దీనిలో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదని 2013 జులైలో అప్పటి చీఫ్ జస్టిస్ పి.సదాశివన్ అన్నారు.
కొలీజియం వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు గతంలో కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న పి.డి.దినకరన్‌ను సుప్రీం కోర్టు జడ్జిగా సిఫార్సు చేయడానికి వెనుక ఉన్న కారణాలను తెలపాల్సిన అవసరం ఉన్నది. కర్నాటక హైకోర్టు నుంచి దినకరన్‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకు తీసుకురావాలని అప్పటి చీఫ్ జస్టిస్ సిఫార్సుచేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తంకావడంతో కొలీజియం ఈ ప్రతిపాదనను విరమించుకోవల్సి వచ్చింది. కొలీజియం లోపభూయిష్ట నిర్ణయాలకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని, ఇటువంటి కొలీజియంను కొనసాగించాల్సిన అవసరం ఏమున్నదని పలువురు న్యాయ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని రద్దుచేయాలన్న డిమాండ్ బలపడుతున్నది.
‘సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993’ కేసు ఆధారంగా కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. దీంట్లో పిటిషనర్ల తరఫున వాదించి కేసు గెలిచిన ఫాలి ఎస్.నారిమన్ ఆ తరువాతి రోజుల్లో తన ఆత్మకథ- ‘ఱళచ్యిళ ళ్యూౄక చ్ఘిజూళఒ శ ఖఆ్యఇజ్యఘూ్దక’’లో ఈ గెలుఫునకు చాలా బా ధపడ్డారు. కొలీజియం వ్యవస్థపై నారిమన్ అంతరంగ మథనం ఇలా ఉంది..
‘ని యెశ’ఆ ఒళళ త్ద్ఘీఆ జఒ ఒ్య ఒఔళషజ్ఘ ఘఇ్యఖఆ ఆ్దళ చిజూఒఆ చిజ్పళ చఖజూళఒ యఛి ఆ్దళ డఖఔళౄళ ళ్యఖూఆ. దళక ఘూళ యశక ఆ్దళ చిజూఒఆ చిజ్పళ జశ ఒళశజ్యూజఆక జశ ఘఔఔ్యజశఆౄళశఆ శ్యఆ శళషళఒఒ్ఘజక జశ ఒఖఔళూజ్యూజఆక జశ తీజఒజ్యూౄ ఘశజూ ష్యౄఔళఆళశషళ. ని ఒళళ శ్య ళ్ఘఒ్యశ త్దీక ఘ ఆ్దళ చఖజూళఒ జశ ఆ్దళ దజదళఒఆ ష్యఖూఆ ఒ్ద్యఖజూ శ్యఆ ఇళ ష్యశఒఖఆళజూ త్దీళశ ఘ ఔ్యఔ్యఒ్ఘ జఒ ఘౄజూళ ఛ్యి ఘఔఔ్యజశఆౄళశఆ యచి ఘ హజద ళ్యఖూఆ చఖజూళ (్య ఘశ ళౄజశళశఆ ఘజ్ప్యూఆ్ఘఆళ) ఆ్య ఇళ ఘ చఖజూళ యఛి ఆ్దళ డఖఔళౄళ ళ్యఖూఆ. ని త్యీఖజూ ఒఖళఒఆ ఆ్ద్ఘఆ ఆ్దళ ష్యఒళజూ ళజూషఖజఆ శళఆత్యీరీ యఛి చిజ్పళ చఖజూళఒ ఒ్ద్యఖజూ ఇళ జూజఒఇ్ఘశజూళజూ. దళక జశ్ప్ఘూజ్ఘఇక ద్యజూ ఆ్దళజూ ‘్ళ్ఘజూఒ’ ష్యఒళ ఆ్య ఆ్దళజూ ష్దళఒఆ. దళక ఘఒరీ శ్య యశళ. దళక ష్యశఒఖఆ శ్య యశళ ఇఖఆ ఆ్దళౄఒళ్పళఒ.’’
(‘సుఫ్రీం కోర్టులోని మొదటి అయిదుగురు (సీనియర్) జడ్జీలలో ఉన్న ప్రత్యేకతలు నాకేం కనపడడం లేదు. సీనియారిటీలోనే వీరు ‘మొదటి అయిదుగురు’. సామర్థ్యంలో కానీ, మేధోసంపత్తిలో కానీ వీరు అగ్రస్థానంలో ఉన్నారని అనుకోవల్సిన అవసరం లేదు. ఒక హైకోర్టు జడ్జీని లేదా నిపుణుడైన న్యాయవాదిని సుప్రీం న్యాయమూర్తిగా నియమించాల్సిన సమయంలో సుప్రీం కోర్టులోని అందరూ జడ్జీల అభిప్రాయాలను ఎందుకు తీసుకోకూడదు. కేవలం అయిదుగురు జడ్జీలకే పరిమితమైన కొలీజియంను రద్దుచేయాలని సూచిస్తున్నాను. వీరు తమ అభిప్రాయాలను, సిఫార్సులను రహస్యంగా ఉంచుతున్నారు. ఎవరి అభిప్రాయాలను అడగరు. తమలోతాము తప్ప మిగిలిన వారిని సంప్రదించరు.’

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం 09899 331113