మెయిన్ ఫీచర్

ఓడినా.. చరిత్ర సాధకురాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హిల్లరీ క్లింటన్’- గత కొన్నాళ్లుగా ఈ పేరు ప్రపంచమంతా సుపరిచితమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని సాధించిన తొలి మహిళగా వాసికెక్కిన ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి ఆదిలోనే సరికొత్త రికార్డును సృష్టించి చరిత్ర సాధకురాలిగా నిలిచారు. ఆది నుంచి ఎన్నికల సర్వేల్లో ఆధిక్యతను చాటుకుంటూ నువ్వానేనా అనే రీతిలో పోటీనివ్వటం ఆమె సామర్థ్యంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అధ్యక్ష స్థానానికి వందేళ్ల తరువాత ఓ మహిళ పోటీపడటం ఆమె మేధస్సు, ప్రతిభకు ప్రజలిచ్చిన కితాబు. తొలి మహిళా సేనేటర్‌గా ఎంపికై రికార్డులకు ఎక్కింది. ప్రత్యర్థి మాట దురుసుగా మాట్లాడినా చిరునవ్వుతో వాటికి ధీటుగా జవాబిచ్చిన హిల్లరీకి 1997 బెస్ట్ స్పోకెన్ గ్రమీ అవార్డు రావటం వక్తగా ఇంట గెలిచి రచ్చగెలవగలిగింది. తొలి నుంచి కొన్ని నీలినీడలు వెన్నాడుతునే ఉన్నాయి. ఆమె ప్రమేయం లేకుండా చోటుచేసుకున్న కుం భకోణాల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడింది. భర్త క్లింటన్ సెక్స్ కుంభకోణం ఆమెను చుట్టిముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ సమయంలో ఆమెకు భర్తకు విడాకులు ఇస్తుందని అందరూ భావించారు. కాని అన్నీ ంటినీ వౌనంగానే భరించింది. అంతేకాదు. ఆమె ఓర్పుకు నిదర్శనంగా పవర్‌ఫుల్ అమ్మగా ఫోర్బ్స్ మేగజైన్ ప్రశంసలు అందుకుంది. భర్త పక్కన పరాయి ఆడవాళ్లు పడుకోవటానికి అంగీకరించేదని, ట్రంప్ ‘ఆడకుక్క’ అని నిందించినా మొండితనమే పునాదిగా చేసుకుని రాజకీయాల్లో నెగ్గుకురాగలిగింది. కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈమెయిళ్ల కుంభకోణం వ్యవహారం నుంచి ఆమెకు క్లీన్‌చిట్ లభించినా ప్రజల తీర్పు ఒకింత నిరాశను మిగిల్చింది. స్టేట్ సెక్రటరీ హోదాలో దాదాపు 112 దేశాలలో పర్యటించి అమెరికా అగ్రరాజ్యపునాదులను పదిలం చేశారు. 68ఏళ్ల హిల్లరీని గెలిపించేందుకు అమెరికా వృద్ధ మహిళా ఓటర్లు లేని ఓపిక తెచ్చుకుని పోస్టల్ ఓట్ బ్యాలెట్‌ను సైతం ఉపయోగించి ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. అందుకే హిల్లరీ ఢీ అంటే ఢీ అనగలిగారు. ఆమెలో ఓ బేస్‌బాల్ ప్లేయర్, ఓ జర్నలిస్ట్ ఉన్నారు. ఊహించిన విధంగా రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ కనబరచి అందులో దిగింది. అగ్రరాజ్య అధ్యక్షుడికి భార్యగా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఆ సౌధంలో అధ్యక్షురాలిగా అడుగుపెట్టేందుకు చేసిన పోరాటంలో ఓడిపోయినా పాలనాదక్షురాలిగా అమెరికా ప్రజలలో చెరగని ముద్ర కొనసాగుతూనే ఉంటుంది.

- ఆశాలత