మెయన్ ఫీచర్

‘నల్లకుబేరుల’ వెన్నులో వణుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థికవ్యవస్థకు సమాంతరంగా నడుస్తూ, కొన్ని సందర్భాల్లో మన విధానాలు, ప్రణాళికలను కూడా శాసిస్తున్న నల్లధనంపై మోదీ ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. సమాజంలోని కీలక రంగాలను చెద పురుగులా తినేస్తున్న నల్లధనం నిర్మూలనకు కేంద్రం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఊహించడానికి కూడా భయపడ్డ నిర్ణయాలను మోదీ సర్కారు సాహసోపేతంగా అమలు చేసిందని జాతి యావత్తూ కీర్తిస్తోంది. భారతీయుల నల్లధనం ముఖ్యంగా రెండు ప్రదేశాలలో కనపడుతుంది. ఒకటి- విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు. రెండు- దేశంలోనే అధిక విలువ కలిగిన నోట్ల రూపంలో చెలామణి అవుతున్న డబ్బు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 2012లో సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో- సుమారు 500 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువచేసే ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో కొంతమంది ఘరానా వ్యక్తులు దాచారని పేర్కొన్నది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం, స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ వారు మరో ప్రకటనలో భారతీయులు దాదాపు రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన డబ్బు తమ బ్యాంకుల్లో దాచుకున్నారని ప్రకటించాయి.
నల్లధనంపై మోదీ ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తూ వచ్చింది. విదేశాల్లో మూలుగుతున్న భారతీయ సంపదను వెనక్కు తీసుకువచ్చేందుకు చట్టపర, దౌత్యపర చర్యలను చేపట్టింది. విదేశాల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేసేందుకు ఆయా దేశాలు, ఆయా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నది. ఇందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టడంలో ప్రధాని మోదీ చాలావరకు కృతకృత్యులయ్యారు. స్వచ్ఛమైన ఆర్థిక పాలన, అవినీతికి అడ్డుకట్ట, ఆర్థిక నేరస్తులకు శిక్షల విషయంలో ‘సేఫ్ హెవెన్’ దేశాలను కట్టడి చేయాలని ఇటీవల జరిగిన జి-20 దేశాల సదస్సులో మోదీ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇదే సమయంలో దేశంలో నల్లధనం నియంత్రణకు- అధిక మొత్తంలో కొనుగోళ్ళు చేస్తున్న వారు టాక్స్ నెంబర్లను కచ్చితంగా ప్రకటించాలని, నగదు రహిత కొనుగోళ్ళు, అమ్మకాలకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. బ్యాంకు అకౌంట్లను ఆధార్ నెంబర్‌తో జత చేసి, ఆదాయపు పన్ను విధానంతో అనుసంధానం చేసింది. ఆదాయ వ్యయ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సరికొత్త విధానాలను అమలులోకి తెచ్చింది. దీనికి కొనసాగింపుగా 500, 1000 రూపాయల విలువ చేసే కరెన్సీ నోట్లను వెనక్కు తీసుకున్నది.
2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలో యుపిఎ-వన్ , యుపిఎ-2 హయాంలో దేశంలో అవినీతి తారస్థాయికి చేరుకుని, నల్లధనం చెలామణి లక్షల కోట్ల రూపాయలకు చేరింది. హసన్ అలీఖాన్ కేసుకు ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. 2007లో మన ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హసన్ అలీని అరెస్ట్‌చేసింది. వేల కోట్ల రూపాయల పన్నులను ఎగ్గొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచడమే కాకుండా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సన్నిహితంగా ఉన్న ఆయుధాల వ్యాపారి అడ్నన్ ఖస్సోగికి కూడా పెట్టుబడి పెట్టాడన్న ఆరోపణలపై హసన్ అలీపై దర్యాప్తుసాగింది. స్విస్ బ్యాంకుల్లో 8 బిలియన్ డాలర్ల అమెరికన్ డాలర్ల విలువ చేసే భారతీయ ధనాన్ని హసన్ అలీ దాచాడని మన పత్రికలు సాక్ష్యాధారాలతో నిరూపించినా అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో ఆ దర్యాప్తు నత్తనడకన కొనసాగింది. నల్లధనం వ్యాప్తిని అడ్డుకునేందుకు మనదేశంలో కొందరు బలమైన ప్రయత్నాలే చేశారు. ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ నేతృత్వంలో పలువురు ప్రముఖులు 2009లో సుప్రీంకోర్టును ఆశ్రయించి విదేశీ బ్యాంకుల్లోని డబ్బును వెనక్కు తెప్పించాలని, దేశంలో నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఫలితంగా 4 జులై 2011న సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇనె్వస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసి మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిపి జీవన్‌రెడ్డిని దీనికి పరిశీలకుడిగా నియమించింది. ధార్మిక గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు 2010లో అవినీతి, నల్లధనం వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. ‘్భరత స్వాభిమాన్’ పేరిట 2010 సెప్టెంబర్ 2న గుజరాత్‌లోని ద్వారక నుంచి పెద్దఎత్తున యాత్ర ప్రారంభించారు. రాజస్థాన్, జమ్ము-కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర 25 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి రెండవ దశ యాత్ర సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని దాదాపు లక్ష మంది ప్రజలు ప్రతిజ్ఞచేశారు. ఇవే డిమాండ్లతో 30 జనవరి 2011న సుమారు 600 జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తులు పంపారు. 27 ఫిబ్రవరి 2011న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బాబా రామ్‌దేవ్ నిర్వహించిన ర్యాలీకి దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యారు. సభ అనంతరం భారత రాష్టప్రతికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.
అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ కూడా అవినీతి, నల్లధనంపై అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేసేందుకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎస్.గురుమూర్తి నాయకత్వంలో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్, బెంగళూరు ఐఐఎం- బెంగలూరు ప్రొఫెసర్ ఆర్.వైద్యనాథన్, సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెత్మలానీ సభ్యులుగా ఉన్న ఈ టాస్క్ఫోర్స్ ఒక నివేదికను బిజెపికి సమర్పించింది. దీని ఆధారంగానే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అవినీతిని అంతం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని, విదేశాల్లోని భారతీయ సంపదను వెనక్కు తీసుకువస్తామని, దేశంలో నల్లధనాన్ని అరికడతామని బిజెపి ప్రకటించింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అవినీతిపై బిజెపి యుద్ధం ప్రకటించింది. ఈ విషయమై సమర్ధవంతమైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. భారతీయులు విదేశీ ఖాతాల వివరాలను వెల్లడించాలంటూ 2015లో కఠిన ఆదేశాలు జారీచేశారు. బీనామీ వ్యవహారాలను నిరోధిస్తూ 2016లో నియమాలను రూపొందించింది. నల్లధనం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు.
2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక నేటివరకూ దాదాపు లక్ష 25వేల కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. దీని కొనసాగింపు చర్యగా 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుపరచి వాటి స్థానంలో కొత్త కరెన్సీని ప్రవేశపెడుతున్నట్టు మోదీ చేసిన ప్రకటనను దేశ ప్రజలు మనసారా స్వాగతించారు. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలో నల్లధనం ప్రభావం, అవినీతి గణనీయంగా తగ్గుతాయని, దొంగనోట్ల చెలామణి ఆగిపోతుందని, తీవ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారం తగ్గిపోతుందని, నిత్యావసర సరకుల ధరలు తగ్గుతాయని, రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయని, రాజకీయ నేతల చేతుల్లో నల్లధనం చేరడం ఆగిపోతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
దేశంలో లక్షల కోట్ల రూపాయల నల్లధనం 500, 1000 నోట్ల రూపంలో మూలుగుతోంది. సరైన లెక్కలు చూపించి నిర్ణీత కాల వ్యవధిలో బ్యాంకుల్లో జమ చేయకుంటే ఈ నోట్లు చిత్తుకాగితాలుగా మిగిలిపోతాయి. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు కూడా ఈ రూపంలోనే ఉన్నది. ఇవి ఉపయోగపడకపోతే రానున్న రోజుల్లో అవినీతి గణనీయంగా తగ్గిపోతుంది.
దొంగనోట్లతో విదేశీ శక్తులు మన దేశంలో తీవ్రవాద చర్యలు నిర్వహిస్తున్నాయి. మన పొరుగున ఉన్న శత్రుదేశాలు వారి భూభాగంలో ఈ దొంగనోట్లు ముద్రించి మన దేశంలో పంపిణీ చేస్తున్నారు. పాకిస్తాన్ తన కరెన్సీ కంటే అధిక మొత్తంలో మన కరెన్సీని ముద్రిస్తున్నదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడంతో తీవ్రవాద సంస్థల దగ్గరున్న డబ్బు ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోతుంది. నల్లధనం అంతమైతే రియల్ ఎస్టేట్ ధరలు దిగివచ్చి, తమ సొంత ఇంటి కలలు సాకారం అవుతాయని సగటు మనిషి భావిస్తున్నాడు. పెద్దనోట్లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం అనాలోచితంగా, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది కాదు. ఆరునెలల క్రితమే నల్లధనంపై పోరును తీవ్రం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోమని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్రం కోరింది. 50, 100 రూపాయల నోట్లను అధిక సంఖ్యలో ముద్రించమని ఆదేశించింది. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించడం, ఈ పనులను రహస్యంగా ఉంచడం చాలా అసాధారణ విషయం. 8 నవంబర్ 2016న సాయంత్రం 6.00 గంటలకు రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశమై 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. వెంటనే 6.30 నిమిషాలకు కేంద్ర క్యాబినేట్ సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించగా, వెంటనే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తూ ఉండగా కాంగ్రెస్‌తో సహా మమతా బెనర్జీ, ములాయం సింగ్, మాయావతి వంటి విపక్ష నేతలు పార్టీలు మాత్రం వ్యతిరేకించడం గమనార్హం. అనూహ్య రీతిలో మోదీ కొట్టిన దెబ్బకు విపక్ష పార్టీలు, కొందరు నేతలకు దిమ్మతిరిగిపోయింది. ప్రజాభిప్రాయానికి, దేశ హితానికి భిన్నంగా ఈ నాయకులు మాట్లాడడానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ దగ్గరున్న నల్లధనాన్ని మార్చుకోవడానికి వీరికి సమయం దక్కకపోవడం. రెండు- మోదీ ప్రతిష్ఠ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోవడంతో ఆయన్ను అందుకోడానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ సహా ఎవ్వరికీ ఆస్కారం లేకుండాపోయింది. వీరందరికీ తమ రాజకీయ భవిష్యత్ దీనంగా కనపడుతున్నది. పరిస్థితులు మారుతున్నాయి, ఇంకా మారతాయి. అందరూ ఆశించిన ‘అచ్చే దిన్’ సాకారమవుతోంది. *