మెయిన్ ఫీచర్

తేనీరు వెనుక కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్లో నాలుగువేళ్లు వెళ్లాలంటే ఇంటిల్లిపాది పనిచేయాల్సిన అవసరం అక్కడ తేయాకు కార్మికుల్లో ఉండటం వల్ల వారి పిల్లలు సైతం చదువులు మానుకుని తేయాకు సేకరణకు వెళ్లటం గమనార్హం. చిధ్రమవుతున్న తేయాకు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున వారి గురించి ప్రచారం చేయాలని ఔత్సాహికులు, స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చాయి.

చలికాలంలో ఉదయానే నోరూరించే ఓ కప్పు కమ్మటి అస్సాం టీ తాగితే ఒంట్లో హుషారొచ్చేస్తుంది. తాగిన కప్పు కింద పెడుతూ ఒక్క క్షణం ఆ టీపొడి తయారీ వేనుక ఉన్న మహిళల వ్యథల గురించి ఆలోచించమంటున్నారు ఔత్సాహిక ప్రచారకర్తలు. మనం గనుక ఆలోచిస్తే కన్నీరొస్తుందంటున్నారు. పచ్చటి తేయాకు తోటల్లో పరిమళాలు వెదజల్లే చల్లటి గాలుల మధ్య మహిళలు తేయాకు సేకరిస్తుంటే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆ దృశ్య కావ్యం వెనుక మాటలకందని మగువల మూగవేదన దాగివుంది. మనదేశం తేయాకు పరిశ్రమకు ప్రసిద్ధి. లిప్టన్, టాటా వంటి బడా కంపెనీల చేతుల్లోనే తేయాకు తోటలు ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ తోటల్లో పనిచేసే మహిళలు కనీసం టాయిలెట్ సౌకర్యం అనేది లేకుండా రేయింబవళ్లు పనిచేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు నిర్వహించిన అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. టీ కంపెనీల్లో 50శాతం వాటా ఉన్న రెండక్షరాల కంపెనీకి ఉంది. ఈ కంపెనీకి చెందిన తేయాకు ఎస్టేట్‌లో పనిచేసే లక్షా యాభైవేల మంది కూలీలకు సరైన వేతనాలు లేక దయనీయమైన వసతులు, ఆంక్షల మధ్య పనిచేస్తున్నారు.
ప్రపంచంలోనే పేరెన్నికగన్న మరో కంపెనీ తేయాకు తోటల్లోకి వెళితే అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి మహిళలు ఉపయోగించే టాయిలెట్ పనిచేయటం లేదు. దీనిని బాగుచేయించమని కోరితే తోటల్లోనే చాటుగా వెళ్లి అవసరాన్ని తీర్చుకోమని సలహా ఇస్తున్నారని మహిళలు తెలియజేస్తున్నారు. అలాగే వారికి ఇచ్చే పిచ్చుక గూళ్ల వంటి క్వార్టర్స్‌లోకి వెళ్లి తొంగిచూస్తే పైకప్పులన్నీ వర్షానికి కారిన చారలు దర్శనమిస్తాయి. భయంకరమైన అపరిశుభ్ర వాతావరణంలో వారు జీవనం గడుపుతున్న దృశ్యాలు అగుపిస్తాయి. తేయాకు తోటల్లో స్ప్రే చేసే రసాయనిక మందులు ఉపయోగించేటపుడు మహిళా కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు ఉండవు. ఇలాంటి రసాయనిక మందులను పంటపై పిచికారీ చేసేటపుడు వారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనాల్లో వెల్లడైంది. కార్మికల వర్కింగ్ కండీషన్స్ మెరుగ్గా ఉన్నాయో లేదో పరిశీలించి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పోరేషన్ టీ కంపెనీ యాజమాన్యాలకు సబ్సిడీ మంజూరు చేయాలి. ఎలాంటి పరిశీలన లేకుండానే సబ్సిడీలను కంపెనీ యజమానులు తీసుకుంటున్నారు.
నోట్లో నాలుగువేళ్లు వెళ్లాలంటే ఇంటిల్లిపాది పనిచేయాల్సిన అవసరం అక్కడ తేయాకు కార్మికుల్లో ఉండటం వల్ల వారి పిల్లలు సైతం చదువులు మానుకుని తేయాకు సేకరణకు వెళ్లటం గమనార్హం. చిధ్రమవుతున్న తేయాకు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున వారి గురించి ప్రచారం చేయాలని ఔత్సాహికులు, స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చాయి. టీ సేవించే వినియోగాదారులే కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని వీరి అభిలాష. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజూ టీ తాగిన వెంటనే ఆ రుచిని ఆస్వాదిస్తూ కప్పును కిందపెట్టేసేముందు మీరు టీ కంపెనీకి వెంటనే అభినందనలు తెలియజేయటంతో పాటు మీ కంపెనీల్లో పనిచేసే కార్మికలు జీవన స్థితిగతుల్లో కూడా ఇలాంటి కమ్మటి మార్పు తీసుకురమ్మని కోరుతూ డెక్స్ట్ మెస్సేజ్ లేదా ఈ మెయిల్, ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే కనీసం మోడువారుతున్న వారి బతుకులు చిగురిస్తాయని ఆశ. మరి మనందరం కూడా కమ్మటి టీ తాగటంతో పాటు చిత్తశుద్ధితో ఈ పనిచేద్దామా.
*