మెయిన్ ఫీచర్

వనితకు ‘వాత్సల్యం’తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరెండున్నర రూపాయలకే శానిటరీ
ప్యాడ్స్, డిస్పోజ్ కూజా
శసింపుల్ .. సులభం .. సురక్షితం
శఅమ్మాయిల ఆరోగ్యంపై దంపతుల
ఆరాటం

స్వాతి బడేకర్ గ్రామీణ పిల్లలకు చదువు చెప్పే టీచర్. గుజరాత్‌లోని వడోదరకు 138 కిలోమీటర్ల దూరంలో ఉండే దాహోద్ అనే గ్రామీణ ప్రాంతానికి వెళ్లి పిల్లలకు చదువుచెబుతుంది. స్కూళ్లలో ఆడపిల్లలు సంఖ్య రానురాను తగ్గిపోవటాన్ని గమనించింది. కారణం అందరికీ తెలిసిందే.. రజస్వలైన ఆడపిల్లలు రుతుస్రావంపై సరైన అవగాహన లేక స్కూళ్లకు రావటం లేదని గ్రహించింది. కేవలం బహిష్టు మూలంగా భావి జీవితాన్ని అంధకారం చేసుకోవటం తట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని భర్త శ్యాం సుందర్ దృష్టికి తీసుకువెళ్లింది. ఇంటి నుంచే ఈ దంపతులు సేవ ఆరంభించారు.

భర్త శ్యాం సుందర్ బట్టలకు వేసే రంగులు, కెమికల్స్ అమ్మే వ్యాపారి. గాంధేయవాది. అంతేకాదు మోదీ ఇచ్చిన ‘స్వచ్ఛ్భారత్’ పిలుపునకు ఆకర్షితుడై ఏదైనా చేయాలని ఆరాటపడుతున్నాడు. అటువంటి సమయంలో భార్య చెప్పిన విషయాన్ని గ్రహించారు. వారిద్దరు కలిసి ‘వాత్సల్య’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఏ అమ్మాయి కూడా రుతుస్రావం సమస్యతో స్కూలు మానేయకూడదని, సహజ సిద్ధంగా వచ్చే ఈ శారీరక మార్పుపై వారిని చైతన్యవంతులను చేయటంతో పాటు వారికి సింపుల్‌గా..సులభంగా వాడేఆరోగ్యకరమైన నాప్కిన్స్ తయారుచేసి కేవలం రూ.2.50లకే అందించటం ప్రారంభించారు. అంతేకాదు భార్య స్వాతి బడేకర్ ఈ శానిటరీ ప్యాడ్స్ వాడకంపై గ్రామీణ ప్రాంతాలలో విస్తత్ర ప్రచారం చేసి చైతన్యవంతుల్ని చేశారు.
యూనిట్స్ ఏర్పాటుతో మహిళలకు ఉపాధి..
ఈ నాప్కిన్స్ మరింత మందికి అందించాలనే ఆలోచనతో వడోదరలో డిఆర్‌డిఏ సహకారంతో నాప్కిన్స్ తయారీ యూనిట్లను ఏర్పాటుచేసి అనేక మంది మహిళలకు ఉపాధి కల్పించారు. ఇలా ఇచ్చిన నాప్కిన్స్‌ను ఆడపిల్లలు వాడుతున్నారు గానీ వాటిని ఎక్కడపడితే అక్కడ వేస్తుండటం వల్ల పర్యావరణం దెబ్బతింటున్న విషయాన్ని గ్రహించాడు. సింథటిక్ మెటీరియల్‌తో తయారుచేసే ఈ ప్యాడ్స్ సైడ్ ఎఫెక్టులు వస్తాయని, ఇది ఇంకా తీవ్రమైన సమస్యగా భావించిన ఆయన పరిష్కారం కూడా తానే వెతకాలనే భావించాడు.
సరికొత్త ఆలోచనతో సాధారణ మట్టిపాత్ర
ఇలా ఆయన ఆలోచనల నుంచి వచ్చిందే ‘అశుద్ధనాశక్’అనే సాధారణ మట్టిపాత్ర. ఇది చూడటానికి కూజా వలే ఉన్న ఇది ఎలక్ట్రికల్ సాధనం. వాడిన ప్యాడ్‌ను అందులో వేసి కొంత ఎండుగడ్డిని వేసి తగులబెట్టవచ్చు. ఈ బూడిదను మొక్కలకు వేసుకునేలా ఈ పరికరాన్ని తయారుచేశాడు. శ్యాంసుందర్ ఈ ప్యాడ్లను అడ్డగోలుగా పారేయకుండా కేవలం రూ.2.50లకే నాప్కిన్స్, వీటితో పాటు ఈ సాధారణ మట్టి పాత్రను కూడా అందజేస్తారు. ఇపుడు గుజరాత్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో ఈ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తూ.. వాడిన తరవాత వాటిని ఈ పాత్రలో వేసి కాల్చేస్తుంటారు. ఇపుడు వడోదరలో ఈ నాప్కిన్స్, అశుద్ధనాశక్ పాత్రను విరివిగా కొనుగోలు చేస్తున్నారు.
విరివిగా స్కూళ్లకు...
శ్యాంసుందర్ తయారుచేస్తున్న ఈ చౌకైన నాప్కిన్స్, అశుద్ధనాశక్ పాత్రను ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వమే సరఫరాచేస్తోంది. సర్వశిక్ష అభయాన్‌కు చెందిన 500 స్కూళ్లకు, 109 కస్తూర్బా పాఠశాలలకు సరఫరా చేశారు. జైపూర్, పూణె, మంగుళూరు, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాలకు వేలాది పాత్రలను సరఫరాచేస్తున్నాడు. అంతేకాదు నాప్కిన్స్ తయారుచేసే 20
యంత్రాలను మహిళలకు అందజేసి వారు స్వయం ఉపాధి పొందేలా బాటలు వేశాడు.
రాష్టప్రతి ప్రశంస
ఇలా గ్రామీణ వనితల ఆరోగ్యానికి తన వంతు సేవ అందిస్తున్న శ్యాంసుందర్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలను సైతం అందుకున్నాడు. తన యూనిట్ల గురించి కేంద్రమంత్రి వెం కయ్యనాయుడుకి సైతం వివరించారు. ఇలా

పర్యావరణానికి ముప్పు
వాస్తవానికి 2015లో ఈ నాప్కిన్ల వాడకంపై జరిగిన సర్వేలో అందోళనకరమైన అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికీ మనదేశంలో 81శాతం మంది గ్రామీణ మహిళలు పాతబట్టలనే వాడతారు. నాప్కిన్స్ వాడకం గురించి 68శాతం మందికి తెలుసు. వారు ఉపయోగించిన నాప్కిన్స్‌ను చెత్తకుప్పల్లో పడేయటం వల్ల కొనే్నళ్లపాటు నాశనం కాకుండా పర్యావరణానికి ముప్పువాటిల్లనున్నది. అలాగే నాప్కిన్స్‌ను ఉపయోగించే 36.6 కోట్ల మంది మహిళలు వాటిని అడ్డగోలుగా పడేస్తున్నారు. ఇవన్నీ వాతావరణ కాలుష్యానికి కారణమై క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధు లు రావటానికి కారణమవుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. కాని శ్యాంసుందర్ యూనిట్లలో తయారుచేసే నాప్కిన్లు మెత్తటి కాటన్‌తో మన్నికగా, చౌకగా ఉంటాయి.

అవగాహన లేకపోతే శాపమే...
ఆడవాళ్లను నెలనెలా పలుకరించే ప్రకృతి పిలుపు ఆమెకు వరమైనా.. సరైన అవగాహన లేకపోతే శాపమే. చెంగుచెంగున దూకే యుక్తవయసు నుంచి ఆరంభమయ్యే ఈ ప్రకృతిసిద్ధ పరిణామం వల్ల అమ్మాయిల్లో ఆందోళనలు, అనుమానాలు ఎనె్నన్నో. నేడు 12-13 ఏళ్ల మధ్యే ఆడపిల్లలు రజస్వల అవుతున్నారు. ఈ వయసువారు పిల్లల కిందే లెక్క. సహజసిద్ధంగా సంభవించి ఈ శారీరక మార్పు గురించి సరిగ్గా అర్థంచేసుకోలేక, శుభ్రత పాటించక చాలామంది ఆడపిల్లలు, మహిళలు సైతం ఇన్‌ఫెక్షన్లు, ఇనె్ఫర్టిలిటీ వంటి వ్యాధులబారిన పడుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పాత బట్టలనే వాడుతున్నారు. నాప్కిన్స్ వాడేవారు సంఖ్య మనదేశంలో 6శాతం మాత్రమే ఉంది. వీరు కూడా నాప్కిన్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక స్కూలుకు వెళ్లే పిల్లలు డ్రాపవుట్స్‌గా మారుతున్నారు. కంటికి చిన్న సమస్యగా కనబడే ఈ రుతుస్రావం వల్ల ఆడపిల్లల పడుతున్న ఇబ్బందులను గమనించిన 54ఏళ్ల శ్యాం సుందర్ అనే సామాజిక ఉద్యమకారుడు తన భార్య స్వాతి సహకారంతో పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు.