మెయిన్ ఫీచర్

ప్రత్యేక ఆకర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయ ముఖ మండపం, సప్త రాజగోపురాలు, శిఖరాలు, ప్రాకారాలు, స్తంభాలు అన్ని నల్లసరం కృష్ణశిలలతో నిర్మితమవుతున్నాయి. ఇందుకు వేయి మంది శిల్పులు ఆహార్నిశలు పనిచేస్తున్నారు. వచ్చే దసరా నాటికి ప్రధాన ఆలయంలో భక్తులకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. యాదాద్రి కొండపై ఆలయం నిర్మాణంలో కల్యాణమహామండపం, నృసింహుని 33రూపాలు, దశావతరాలు, పురాణ గాథలతో కూడిన శిల్పాలను, అన్నదాన సత్రం, క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి 108అడుగుల భారీ విగ్రహం,కొండ దిగువన 1000ఎకరాల్లో టెంపుల్ సిటీ, చుట్టు ఉన్న నవగిరుల్లో పార్కులు, ఉద్యాన వనాలు, పూదోటలు, కాటేజీలు, సత్రాల నిర్మాణాలు, చెరువుల అభివృద్ధి పనులతో పూర్తిగా యాదాద్రిని పర్యాటక, దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దుతున్నారు. 1952లో నిర్మితమైన ఘాట్‌రోడ్డుకు అదనంగా మరో ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు.