మెయిన్ ఫీచర్

‘అమ్మ’ లేదు కాని క్యాంటీన్‌లున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో జయలలితమ్మ లేదు గానీ, ఆమె 2013 నుంచీ మొదలుపెట్టి అమలు చేస్తున్న అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. శుచిగా పుష్టికరంగా అతి స్వల్ప ధరలకే వండి వడ్డించే సాంబార్ సాదం తైర్ సాదం, ఇడ్లీ, వడై, సాంబర్‌ల లాంటి ఆహార పదార్థాలు పేదలకి లభిస్తున్నాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాల పాలకులకి రుూ అమ్మలాంటి అమ్మ భోజన ఫలహారశాలల వెనుక దాగిన రహస్యం పట్ల విపరీతంగా మోజు- అంతేకాదు జనాలని ఆకర్షించడానికి ఒక స్కీము అవసరం ఐనాయి. తాజాగా హర్యానా రాష్ట్ర పాలకులు అమ్మ క్యాంటీన్ల మీద కనే్నశారు. హర్యానా రాష్ట్ర కార్మిక మంత్రి నయాబ్ సింగ్ మైనీ ఒక బృందాన్ని వెంటబెట్టుకుని అమ్మ క్యాంటీన్లలో అమ్మ వాటర్ బాటిల్స్‌ను వెదుక్కుంటూ చెన్నై చేరి, అక్కడ మకాం పెట్టారు.
టిఫిన్ సెంటర్ల తర్వాత- తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఆమె నుంచి నీటి సరఫరా పథకం- కొన్ని వర్గాల వారికి ఉచితంగా కూడా సప్లయ్ చేస్తూ వచ్చింది. రాజస్థాన్ లాంటి రాష్ట్ర గవర్నమెంట్లు- ‘నమ్మ’ మోడల్ క్యాంటీన్లు మొదలుపెడుతున్నారు. అదే పద్ధతిలో కేరళలో ‘నమ్మ క్యాంటీన్లు’ త్వరలో అమలుకానున్నాయి. ఇప్పుడు హర్యానా రాష్ట్రం ‘అమ్మ’ టిఫిన్ సెంటర్లలో బడుగు వర్గాల ‘ఓటు’ను ఆకర్షించాలని ఉబలాటపడుతోంది. క్వాలిటీ విషయంలో అమ్మ క్యాంటీన్లదే ‘అన్నపూర్ణ హస్తం’!

veeraji.pkm@gmail.com