మెయిన్ ఫీచర్

జంతువులకో సూపర్‌మేన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొంభై ఏళ్ల ముసలోళ్ల దగ్గర నుంచి, పుట్టిన పిల్లాడికి సైతం ఆసక్తి కలిగించే ఏకైక హీరో సూపర్‌మేన్ ఒక్కడే. తనకున్న అపూర్వ శక్తులతో అద్భుత సాహసాలు చేసే ఈ సూపర్‌మేన్ తన గ్రహాంతరవాసులను రక్షిస్తాడు. అలాగే హైదరాబాద్ నగరంలోని జంతువులకు ఓ సూపర్‌మేన్ ఉన్నాడు. అతనే ప్రదీప్ నాయర్. కాకపోతే ఈ నాయర్ వద్ద అద్భుత శక్తులు లేవుగానీ ప్రేమ, మానవత్వం దాగున్నాయి. వెలకట్టలేని ఈ శక్తులతో ఆపదలో ఉన్న జంతువులను రక్షించి అక్కున చేర్చుకుంటాడు. ఐటీ ప్రొఫెషనల్‌గా రెండు చేతులా సంపాదిస్తూ కులాసాగా ఉండాల్సిన వయసులో జంతువుల ప్రేమికుడిగా మారాడు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ఈ యువకుడు చేస్తున జంతుసేవతో ఎన్నో మూగజీవులు తమ బాధను మరచి కేరింతలు కొడుతుంటాయి. అంబా!అని బావిలో పడిన ఆవును, కాళ్లు విరిగి కుయ్యోమొర్రో అనే కుక్కలను, కొన ఊపిరితో కొట్టుమిట్టాడే ఏ జంతువు గురించి సమాచారం అందిస్తే చాలు రెక్కలు కట్టుకుని సూపర్‌మేన్ వలే ఈ టీమ్ వాలిపోయి కాపాడతాయి.

దశాబ్దకాలం నుంచి జంతుసేవలో..
ప్రదీప్ నాయర్‌కు చిన్నప్పటి నుంచి జంతువులంటే ఎంతో ప్రేమ. ఈ ప్రేమే అతన్ని జంతువుల రక్షకుడ్ని చేసింది. గత దశాబ్దకాలం నుంచి హైదరాబాద్ నగరంలో ఆపదలో ఉన్న జంతువులను రక్షిస్తున్నాడు. ఇందుకోసం శజ్ఘౄ జ్ఘీజ్యూఒ నిశజూజ్ఘ అనే సంస్థను ఏర్పాటుచేశాడు. ఇందులో ఇపుడు 11మంది వలంటీర్లు ఉన్నారు. ఈ వలంటీర్ల సంఖ్యను ఇంకా పెంచుకుంటే మరిన్ని మూగజీవులను కాపాడినవారమవుతామని ప్రదీప్ నాయర్ అంటున్నాడు. ఆపదలో ఉన్న జంతువులను రక్షించటానికి ఎన్నో రకాల కిటుకులు ప్రయోగించటం నేర్చుకున్నాడు. తన టీమ్‌లో ఉన్న వలంటీర్లకు సైతం నేర్పుతున్నాడు. ఆపదలో చిక్కుకుని మాటలకందని మూగవేదన అనుభవించే రకరకాల జంతువులు చనిపోకుండా జాగ్రత్తగా రక్షించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరైమన నైపుణ్యం, కిటుకులు తెలిస్తేగానే వాటిని సురక్షితంగా రక్షించలేరు. ఈ ఆర్గనైజేషన్ ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ కేరళలో కూడా ఇది పనిచేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ శాఖలను మరిన్ని విస్తరించే యోచనలో ఉన్నాడు.
సాహసాలు ఎనె్నన్నో!
కనీసం ఏరోజు ఐదారు సాహసాలు చేయకుండా ఉండరు. జంతువులను రక్షించే సమయంలో సాహసం చేయటం ఒక ఎత్తయితే, ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. కనీసం తమకు ఆర్థికంగా సాయం అందించేవారే ఉండరని ప్రదీప్‌నాయర్ అంటున్నారు. అయినప్పటికీ సేవాదృక్పథంతో ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నట్లు అతను వెల్లడిస్తున్నాడు. ఓసారి 70 అడుగుల బోరుబావిలో ఓ పిల్లి పడిపోయింది. ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న బోరుబావిలో నుంచి పిల్లిని బయటకు తీయాలంటే చాలా కష్టమైంది. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి ఆ పిల్లిని బయటకు తీయటం జరిగింది. పొడవాటి తాడుకు మెష్‌బ్యాగ్‌కు గొళ్లెం కట్టి బోరుబావిలోకి పంపించి తీసినట్లు ప్రదీప్ నాయర్ తెలిపాడు. అలాగే నీళ్లులేని లోతైన బావిలో ఓ ఎద్దు పడిపోయింది. ఈ ఎద్దును కూడా రక్షించటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అంటాడు. ఈ సందర్భంగా తమ జేబుల్లో ఉన్న డబ్బును సైతం పోగొట్టుకున్నట్లు ప్రదీప్ వెల్లడించాడు. అలాగే హైదరాబాద్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్స్ భవనంలోని ఓ గోడకు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల్లో ఒక కుక్కపిల్ల ఇరుక్కుపోయింది. దాని శరీరం అంతా మెత్తగా ఉంది. కాని తల మాత్రం ఆ రంధ్రం నుంచి రావటం లేదు. విద్యార్థులు ఈ టీమ్‌కు ఫోన్ చేయటంతో కుక్క తలకు నూనె రాసి ఇరవై నిమిషాల్లో బయటకు తీయటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న కిటుకులు ఉపయోగించి ఎన్నో జంతువులను కాపాడుతుంటారు. అలాగే పాతబస్తీలో ఓ గుర్రం గాయపడితే దానికి కావల్సిన వైద్య చికిత్స అందించి, నడవలేని స్థితిలో ఉన్న ఆ గుర్రాన్ని పోలీసులు అనుమతితో ఈ టీమ్ పెంచుకుంటుంది. జంతువులను, తీగల్లో చిక్కుకుపోయిన పక్షులను ఎలా రక్షించాల్లో తెలియజేసే వీడియోలను రూపొందించి ఫేస్‌బుక్‌లో ప్రదర్శిస్తుంటారు. బ్లూక్రాస్ వంటి సంస్థలకు అనుబంధంగా ఈ టీమ్ పనిచేస్తుంది.

గోడ రంధ్రంలో ఇరుక్కుపోయన కుక్కను, బావిలో పడిన ఎద్దును ఇలా కాపాడారు