మెయిన్ ఫీచర్

కలయా!నిజమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవ చేయాలనే తపన చాలామందికి ఉంటుంది. అందుకవసరమైన వేదిక, మార్గం లభించదు. దీంతో తమలోని పరోపకార గుణాన్ని తమలోనే దాచేసుకుంటారు. అటువంటివారికి ఫుయల్ ఏ డ్రీమ్ మార్గం చూపుతుంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆన్‌లైన్‌లో సోషల్ సర్వీసు చేస్తోంది. ఎన్జీఓ సంస్థలనూ భాగస్వామ్యం చేస్తుంది. గత పదహారేళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు చేయుతనిస్తున్న ఫూయల్ ఏ డ్రీమ్‌ను స్థాపించింది తోట రంగనాథ్.
ఆశలు నింపుతున్న రంగనాథ్
గత 24 ఏళ్లుగా గోద్రేజ్, హిందుస్తాన్ టైమ్స్, పెప్సీ వంటి ప్రము ఖ కంపెనీల్లో పనిచేశాడు. సేల్స్, మార్కెటింగ్, సెంటర్ హెడ్‌గా ఎన్నో విభాగాల్లో తనదైన శైలి కనబరచేవాడు. స్టార్టప్స్ కోసం పని చేశాడు. కాని ఇవేవి అతనిలోని పరోపకార గుణానికి సంతృప్తినివ్వలేదు. అనర్గళంగా ఏడు భాషలు మాట్లాడగలిగే సత్తా ఉన్న రంగనాథ్‌కు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పని చేయాలని భావించాడు. ఆర్థికస్తోమత లేని ప్రతిభావంతులను వెలుగులోకితేవాలని ఆరాటపడేవారుడ. నిరుపేదల జీవితాల్లో ఆశలు నింపలన్నా ఓ ఆన్‌లైన్ వేదిక అవసరమని భావించాడు.
అతని ఆలోచనల నుంచి పుట్టిందే ‘్ఫయెల్ ఏ డ్రీమ్’. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో క్రౌడ్‌ఫండింగ్ సేకరిస్తోంది. గూంజ్, స్వాభిమాన్ వంటి ఎన్జీఓ సంస్థలు సైతం భాగస్వామ్యులను చేస్తోంది. ఇలా సేకరించిన నిధులను కరెంటు లేని గ్రామాలకు వెలుగులు, నిరుపేదలకు పట్టెడన్నం, సంగీతం నేర్చుకునే అభిలాష ఉన్నా ఆర్థికస్తోమత లేక అడుగునపడిన వారికి ఆయా కళలను నేర్పంచటం తదితర సేవాకార్యక్రమాలు చేస్తోంది.
అందమైన ఊహలకు రెక్కలు
బెంగళూరుకు చెందిన డిసౌజా తన అంథ స్నేహితునికి సాయం చేసేందుకు పరికరాన్ని కనుగొనాలని భావించాడు. అతని ఆలోచన కార్యరూపం దాల్చేటట్లు చేసింది ఫుయల్ ఏ డ్రీమ్. విద్యుత్ బైక్‌ను కనిపెట్టిన మణికందన్ ఆలోచనలకు పదును పెట్టింది. ఫిట్‌నెస్‌ను పెంచే టీ-షర్ట్ రూపకల్పన చేసింది. ఇలా సరికొత్త ఆలోచనలను వెలుగులోకి తెచ్చే వేదికగా మారింది.