మెయిన్ ఫీచర్

పంచ్ విసిరింది.. పతకం పట్టింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడుసార్లు ప్రపంచ చాంపియన్. దేశం తరపున అత్యధిక మెడల్స్ సంపాదించిన విజేత. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. యువతకు స్ఫూర్తి. ఆమే ఎర్రవల్లి అంజన. తెలంగాణకు చెందిన యువతి ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

కరాటేలో 220 పతకాలుకరీంనగర్ క్రీడాకారిణి ప్రతిభ
కోచ్‌గా అవకాశమిచ్చిన ప్రభుత్వం

మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలంటే శారీరక బలం ఎంతో అవసరం. కష్టకాలంలోనూ మొక్కవోని సంకల్పబలంతో పతకాల పంట పండించింది. అందుకే 21 ఏళ్ల ఎర్రవల్లి అంజన యువ అథ్లెట్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది. చిన్న వయసులోనే కరాటేలో ఎర్రవల్లి సాధించిన విజయాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెను కరాటే విభాగానికి చీఫ్ గా నియమించి గౌరవించింది. మార్షల్ ఆర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా అంజన నిలిచింది.
ఐదేళ్లకే ఓనమాలు
అంజనకు ఐదేళ్ల వయసులోనే కరాటే అంటే మక్కువ ఏర్పడింది. చాలా చిన్న వయసులో తండ్రి ప్రోత్సాహంతో కరాటే నేర్చుకుంది. బంధువులు, సన్నిహితులు ఎన్ని మాటలు అన్నా తండ్రి ఆమెను కరాటే నేర్చుకునేందుకు పంపేవారు. ఇప్పుడు ఆమె సాధిస్తున్న విజయాలను చూసి పొంగిపోతున్నాడు. అంజన తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. తండ్రి ఆకాంక్ష మేరకు ఐదేళ్లకే కరాటే వైపు అంజన అడుగులు వేసింది. కరాటేనే కెరీర్‌గా మలుచుకోవాలనే అభిరుచి ఏడేళ్లకే కలిగిందని అంజన చెబుతోంది. కరాటేను వృత్తిగా మలుచుకోవాలనే ఆమె ఆలోచనను ఆనాడు అందరూ ఎగతాళి చేశారు. కరాటే గుర్తింపులేని క్రీడ అని అన్నప్పటికీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇందులోనే శిక్షణ తీసుకుని తెలుగు ప్రజలు గర్వించే స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంది. మార్షల్ ఆర్ట్‌లో అపూర్వ విజయాలను సొంతం చేసుకోవటానికి తల్లిదండ్రులు, కోచ్ ఎప్ప శ్రీనివాస్ కారణమని గర్వంగా చెబుతోంది.
220 పతకాలు సొంతం
కరీంనగర్‌కు చెందిన అంజన ఇప్పటి వరకు కరాటేలో 220 పతకాలు సాధిం చింది. జాతీయ స్థాయిలో కరాటేలో ఇన్ని పతకాలు సొంతం చేసుకున్న మహిళగా ఆమె రికార్డు సాధించింది. అండర్-22 కేటగిరీలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించింది. చదువుకుంటూనే రోజూ ఆరుగంటల పాటు ప్రాక్టీస్ చేసేది. పరీక్షల సమయంలో మాత్రం మొదటి ప్రాధాన్యత చదువుకే ఇచ్చేదాన్నని అంజన చెబుతుంది. కరాటేలో అంజన సాధిస్తున్న మెడల్స్, ఈ క్రీడ పట్ల ఆమె చూపుతున్న మక్కువను గుర్తించిన కోచ్ ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంతేకాదు కరీంనగర్‌లో నేడు ఎంతోమంది అమ్మాయిలు కరాటే నేర్చుకోవటానికి ముం దుకు రావటం విశేషం.
జీవితమే మారిపోయింది
నిజంగానే కరాటే నా జీవితానే్న మార్చేసిందని అంగీకరిస్తుంది. ఈరోజు ఇంత గుర్తింపు, నలుగురిలో ప్రత్యేకత ఈ కరాటే వల్లే ఆమెకు లభించింది. అంతేకాదు కరాటే ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని సైతం పాదుగొల్పింది.
బాధ్యత పెరిగింది
తెలంగాణ ప్రభుత్వం కరాటే చీఫ్‌గా నియమించటం వల్ల బాధ్యత మరింత పెరిగిందని అంటోంది అంజన. క్రీడాకారుల్లో దాగివున్న కరాటే ప్రతిభను గుర్తించి, వారిని జాతీయ స్థాయి చాంపియన్లగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని అంటోంది. కోచ్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించటం వల్ల ఆర్థికంగా స్థిరపడగలననే విశ్వాసం కలిగిందని, ఈ ప్రోత్సాహం ఒలింపిక్‌లో పతకాన్ని సంపాదించగలననే నమ్మకాన్ని కలిగించిందని చెబుతుంది. ప్రస్తుతం అంజన దృష్టి అంతా మే నెలలో 68 కిలోల కేటగిరీలో జరిగే నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పతకాన్ని సాధించేందుకు శ్రమిస్తోంది.