మెయిన్ ఫీచర్

దునియా మెచ్చిన హైదరాబాదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత టెన్నిస్ క్రీడాచరిత్రలో బంగారు బొమ్మ. టెన్నిస్ బ్యాట్ పట్టి 14 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్‌కు ఫ్యాషన్.. ఫ్రెండ్స్.. ఫిల్మ్స్ పట్ల తగని మక్కువ. అయతే క్రీడారంగంలో సంపాదించిన సెలబ్రిటీ హోదాను టెన్నిస్‌కే పరిమితం చేసిందే తప్పా కాసుల కోసం వాటివైపు వెంపర్లాడలేదు. వాస్తవానికి క్రీడల్లో నాలుగు పతకాలు సాధిస్తే చాలు వారి చూపంతా ఫ్యాషన్ ప్రపంచంవైపు, బహుళజాతి సంస్థల ప్రకటనలపై దృష్టికేంద్రీకరిస్తారు. ఆటల్లో వచ్చే ఆదాయం కంటే అందంగా యాడ్‌లో కనిపిస్తేచాలు కనకవర్షం కురుస్తుందనుకుంటారు. ఛాన్స్ దొరికితే బాలీవుడ్‌లోకి జంప్‌చేస్తుంటారు. కాని సానియా మీర్జా మాత్రం టెన్నిస్‌నే శ్వాసగా చేసుకుని రాణిస్తుంది. అడపాదడపా ప్రకటనల్లో కనిపించిన ఈ సుందరి టెన్నిస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అపుడపుడు సామాజిక సమస్యలపై జరిగే పోరులో తనవంతు సాయం అందించింది. ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా ఎంపికై దక్షిణాసియా దేశాల మహిళలపై హెచ్చుమీరుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సమితితో కలిసి పనిచేసింది. ఆమె సాధించిన విజయాలకు దేశం యావత్తు పొగడ్తలతో ముంచెత్తినా మురిసిపోతూ కూర్చోకుండా, ఆట మూలన పడకుండా పట్టుదలతో శ్రమిస్తూ పతకాలను తన ఖాతాలో జమచేసుకుంటుంది. సానియా చెల్లెలు చెన్నైలో ప్యాషన్ బ్రాండ్ ఏర్పాటు చేసింది. దీనికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సానియా తన జీవితంలో భాగమైన టెన్నిస్, ఫ్యాషన్, పెళ్లి, బాలీవుడ్ ప్రముఖుల పరిచయాలపై తన మనోభావాలను తెలియజేసింది.
టెన్నిస్ అకాడమీలో వందమంది చిన్నారులు
టెన్సిన్ అకాడమీలో ఇపుడు వందమంది చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రెండవదాన్ని కూడా ఇటీవలనే ప్రారంభించాం. నాతోపాటే టెన్నిస్ ఉండాలనే ఆశయంతో ఈ అకాడమీలను ఏర్పాటుచేశాను. కల సాకారం చేసుకోవటంలో ఇది ఓ భాగం. గత కొనే్నళ్ల నుంచి క్రీడారంగంలో అతివలు మరింత రాణిస్తున్నారు. పతకాలు సాధించే క్రీడాకారులలో మహిళలు ఎక్కువమంది ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒలింపిక్స్‌లో ఇది నిరూపితమైంది. క్రీడలలో రాణించటానికి అమ్మాయిలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి కృషి, పట్టుదల మరింత మంది అమ్మాయిలు ఈ రంగంలో వచ్చేందుకు దోహదం చేస్తుంది.
ఏడేళ్ల వైవాహిక జీవితం
షోయబ్‌తోపెళ్లయి ఏడేళ్లయింది. మ్యారేజ్ డేని ఇద్దరం కలిసి జరుపుకోలేదు. ఇద్దరం క్రీడారంగంలో ఉన్నప్పటికీ ఎవరి రంగంలో వారు రాణిస్తున్నాం. రెండేళ్ల క్రితం మా పెళ్లి రోజున షోయబ్ క్రికెట్‌లో శతకాన్ని పూర్తిచేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకోగా.. అదే రోజునే నేను నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించాను. అలా మా పెళ్లిరోజు జీవితంలో ఆనందాన్ని, కెరీర్ పరంగా పురోగతిని సాధించేందుకు దోహదం చేసింది.
చెన్నై జ్ఞాపకాలు
చెన్నైతో కుటుంబపరమైన అనుబంధం ఉంది. గత రెండు నెలల నుంచి చెన్నైలో ఉండటం మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఎందుకంటే తెల్లవారుజామున టెన్నిస్ ప్రాక్టీస్‌కు నడుచుకుంటూ వస్తున్నా చెన్నైవాసులతో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. చాలా జూనియర్ టోర్నమెంట్స్ ఇక్కడ ఆడాను. కొన్నిసార్లు విజయాలను సొంతం చేసుకున్నాను. ఇక్కడకు రావటం వల్ల ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
ఫ్యాషన్ రంగంలో ముందడుగు
ఫ్యాషన్ సెక్టార్‌లో మనదేశానికి మంచి గుర్తింపే ఉండటం సంతోషం. సరికొత్త రకాలను ఎన్నింటినో ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. అదే సమయంలో ఫ్యాషన్ ట్రెండ్స్ ఎంపిక చేసుకునే విషయంలోనూ భారతీయులు మరింత రాణిస్తున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి వేసుకోవటం ఇష్టం లేదనే విషయాలను సైతం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఆధునిక యువతకు పరిచయం చేయటంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞలు చెప్పాల్సి ఉంది.
బాలీవుడ్‌లో పలువురితో పరిచయాలు
బాలీవుడ్‌లో పలువురితో పరిచయాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఫరాఖాన్‌తో సన్నిహిత స్నేహితురాలు. వారితో టెన్నిస్ గురించి మాట్లాడను. నాకు నటించటం తెలియదు. కొన్ని షోలకు పిలిచినపుడు కెమెరా ముందు ఇలా నిలబడాలని చెబుతుంటారు. మీరు నేను నటించగా చూస్తారని అనుకోవటం లేదు.
బయోపిక్ గురించి..
బయోపిక్‌పై ఇంకా స్పష్టమైన రూపం లేదు. బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే నటించమని మా అమ్మ ప్రోత్సహిస్తుంది. కాని ప్రణీతి, దీపిక, అను ష్క వంటివారు ఇందులో నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను.